మున్నార్ – ప్రకృతి యొక్క స్వర్గం

కేరళ లోని ఇడుక్కి జిల్లాలో కల మున్నార్ హిల్ స్టేషన్ ఒక అద్బుత పర్యాటక ప్రదేశం. పడమటి కనుమలలోని ఈ ప్రాంతం పూర్తిగా కొండలచే చుట్టుముట్టబడి ఉంటుంది. మున్నార్ అంటే మూడు నదులు అని అర్ధం చెపుతారు. ఈ ప్రదేశం మూడు నదులు కలిసే ప్రదేశంలో కలదు. అవి మధురపుజ్జ, నల్లతాన్ని మరియు కుండలే నదులు. ఈ ప్రాంతం తమిళనాడు సరిహద్దులలో ఉండటంచేత, ఆ రాష్ట్రానికి చెందిన అనేక సాంస్కృతిక అంశాలు ఇక్కడ చోటుచేసుకునాయి. ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కావటం చేత ఈ హిల్ స్టేషన్ కేరళ రాష్ట్రానికి ప్రపంచం వ్యాప్తంగా పేరు తెచ్చిపెటింది. దేశ విదేశాలనుండి లక్షలాది పర్యాటకులు మరియు పిక్నిక్ లు కోరేవారు అద్భుతమైన ఈ ప్రాంతానికి వచ్చి తనివితీరా విశ్రాంతి పొందుతారు, ఆనందిస్తారు.   మున్నార్ లో ఒక ఔత్సాహిక పర్యాటకుడు కోరే అంశాలు అన్ని లభిస్తాయి. విహారానికి సరైన ప్రదేశం, విస్త్రుతమైన తేయాకు తోటలు, అందమైన లోయలు మెలికలు తిరిగే పర్వత ప్రాంతాలు, పచ్చటి భూములు, అరుదైన మొక్క మరియు జంతు జాలాలు, దట్టమైన అడవులు, వన్య సంరక్షణాలయాలు, తాజా గాలి, స్వాగతించే వాతావరణం మరియు ఇంకా ఎన్నో, ఎన్నో అంశాలు లభిస్తాయి.   విశ్రాంతి సెలవులు కోరేవారికి మున్నార్ ప్రదేశం అనేక ఎంపికలు చూపుతుంది. సైట్ సీయింగ్ ఇక్కడ ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ప్రత్యేకించి వాతావరణం ఎంతో బాగుంటుంది. ఇక్కడ అనేక ట్రెక్కింగ్ ప్రదేశాలతో ఈ ప్రదేశం బైకర్లకు మరియు ట్రెక్కర్లకు స్వర్గంలా వుంటుంది. పర్యాటకులు పొడవైన మార్గాలలో తోటల మధ్య, పచ్చటి ప్రదేశాలలో ట్రెక్కింగ్ లే కాదు సాధారణ షికార్లు కూడా చేయవచ్చు. వివిధ రకాల అరుదైన పక్షులు ఇక్కడ తిరగటం చేత బర్డ్ వాచింగ్ ఇక్కడ ఆసక్తి కరంగా ఉంటుంది.   కనుమరుగవుతున్న నీలగిరి టార్ అనే ఒక రకమైన దుప్పికి నివాసం. అనముడి శిఖరం దక్షిణ ఇండియాలోని ఎతైన శిఖరం ఈ నేషనల్ పార్క్ లో కలదు.పర్యాటకులు సుమారు 2700 మీటర్ల ఎత్తున్న ఈ శిఖరాన్ని అధిరోహించడానికి ముందుగా అటవీ శాఖ అనుమతులు తప్పక తీసుకోవాలి.  

రావికుళం నేషనల్ పార్క్
మున్నార్ నుండి 15 కిమీ దూరంలో ఉంది, 97 చ. కిమీ. వైశాల్యంలో విస్తరించి ఉంది, ఈ పార్క్ అసాధారణమైన సీతాకోక చిలకలు, జంతువులు మరియు పక్షులకు ఆవాసంగా ఉంది. అధిరోహించటానికి ఇది ఒక అనుకూలమైన ప్రదేశం, ఈ పార్క్ తేయాకు మొక్కల మరియు పొగమంచు దుప్పట్లలో కప్పబడిన పర్వత ప్రాంతాలతో ప్రకృతిపరంగా అద్భుతంగా ఉంటుంది. నీలకురింజి పూలతో పర్వత వాలులు నీలంరంగు తివాచీతో కప్పబడిన ఈ పార్క్ ఒక ఆకర్షణీయమైన ప్రదేశం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూసే మొక్క ప్రాంతంలో ఉంది 2006లో ఇది చివరిసారి వికసించింది.

అనముడి శిఖరం
మున్నార్ పట్టణం నుండి అనముడి దాదాపు 13 కిలోమీటర్లు దూరంలో మరియు 8,842 అడుగుల ఎత్తులో ఉంది. కేరళలోని అత్యంత ఎత్తైన పర్వతం అనముడి. ఎర్నాకుళంలో ఉన్న అరణ్య మరియు వన్యప్రాణుల అధికారుల అనుమతితో శిఖరాలను ఎక్కవచ్చు.

మట్టుపెట్టి
ఈ ఆసక్తికరమైన మట్టుపెట్టి ప్రదేశం మున్నార్ పట్టణం నుండి 13 కిమీ దూరంలో ఉంది. సముద్ర మట్టం నుండి 1700 మీ ఎత్తులో ఉన్న మట్టుపెట్టి జలాశయం తాపీపని నైపుణ్యానికి పేరు. మరియు అందమైన జలాశయం. ఇక్కడ బోటు షికారుకు అవకాశం ఉంది. చుట్టుప్రక్కల ఉన్న కొండలు మరియు ప్రకృతి దృశ్యాలు కనుల విందుగా ఉంటాయి.. ఇక్కడ అత్యధిక పాలను అందించే వివిధ జాతుల ఆవులను చూడవచ్చును. బాగా పెరిగిన తేయాకు మొక్కలు, గడ్డిభూములు మరియు షోలా అడవులతో మట్టుపెట్టి అథిరోహణకు ఆనుకూలమైన ప్రదేశంగా ఉంది మరియు అనేకరకాల పక్షులకు నిలయంగా ఉంది.

పల్లివాసల్
మున్నార్‌లోని చితిరాపురం నుండి 3 కిమీ దూరంలో పల్లివాసల్ ఉంది, ఇది కేరళలోని మొదటి జలవిద్యుత్తు ప్రణాళిక. ఈ ప్రదేశం కూడా ప్రకృతి దృశ్యాలతో మనోహరంగా ఉంటుంది మరియు సందర్శకులు తరచుగా దీనిని వనభోజనాల ప్రదేశంగా అభిమానిస్తారు.

చిన్నకనల్
మున్నార్ పట్టణ సమీపాన చిన్నకనల్ ఉంది. ఇక్కడ నీటి జలపాతాలు ఉన్నాయి, పవర్ హౌస్ వాటర్‌ఫాల్స్ అని ప్రసిద్ధి చెందింది, సముద్ర మట్టానికి 2000మీ నుండి జలపాతం నిటారుగా పడుతుంది. పశ్చిమ కనుమల శ్రేణి యొక్క ఆహ్లాదకరమైన దృశ్యాలతో ఈ ప్రదేశం నిండి ఉంటుంది.

అనయిరంగల్
చిన్నకనల్ నుండి ఏడు కిలోమీటర్లు ప్రయాణిస్తే, అనయిరంగల్ చేరవచ్చు. అనయిరంగల్ మున్నార్ నుండి 22 కిమీ దూరంలో, ఏపుగా పెరిగిన తేయాకు మొక్కల తివాచీతో కప్పబడినట్లు ఉంటుంది. జలాశయంను సందర్శించటం ఒక అనుభూతిగా ఉంటుంది. అనయిరంగల్ ఆనకట్ట చుట్టూ తేయాకు మొక్కలు మరియు ఎప్పుడూ హరితంగా ఉండే అడవులు ఉంటాయి.

టాప్ స్టేషను
మున్నార్ నుండి టాప్ స్టేషను 3 కిమీ దూరంలో ఉన్న ఎత్తైన ప్రదేశం, ఇది సముద్ర మట్టం నుండి 1700 మీ ఎత్తులో ఉంది. ఇది మున్నార్-కొడైకనాల్ రహదారిలో ఉన్న ఎత్తైన ప్రదేశం. మున్నార్ ను సందర్శించే వారు నలుదిక్కులు కనిపించే టాప్ స్టేషను‌ను సందర్శిస్తారు, ఇక్కడ నుండి పొరుగు రాష్ట్రమైన తమిళనాడును చూడవచ్చు. మున్నార్‌లో నీలకురుంజి పువ్వులు విస్తారమైన ప్రాంతంలో వికసించటాన్ని చూడవచ్చు.

తేయాకు ప్రదర్శనశాల
తేయాకు తోటలకు మున్నార్ ప్రసిద్ధి చెందినవి. కొన్ని విశిష్టమైన మరియు ఆసక్తికరమైన విషయాలను తెలపటానికి మరియు ప్రదర్శించటానికి కొన్ని సంవత్సరాల క్రితం టాటా టీ కంపెనీ వారిచే ప్రత్యేకంగా తేయాకు ప్రదర్శనశాల ఆరంభించబడింది. ఈ తేయాకు ప్రదర్శనశాలలో అసాధారణమైన, ఛాయాచిత్రాలు మరియు యంత్ర పరికరాలు ఉన్నాయి; మున్నార్‌లోని తేయాకు మొక్కల మూలాలు మరియు పెరుగుదల గురించి ఇవన్నీ తెలుపుతాయి. ఈ సందర్శనశాల మున్నార్‌లోని నల్లతన్ని ఎస్టేట్ ఆఫ్ టాటా టీ వద్ద ఉంది మరియు ఇది చూడటానికి చక్కని ప్రదేశం.

వృక్షజాలం మరియు జంతుజాలం
తేయాకు తోటలను పెంచటం ద్వారా నివాసాలు విచ్ఛిన్నం అయ్యి మున్నార్‌లోని అధిక వృక్ష సముదాయం మరియు జంతు సముదాయం అదృశ్యమైపోయాయి. అయినప్పటికీ, సమీపాన ఉన్న అనేక రక్షిత ప్రాంతాలలో జీవించి ఉన్న జంతు జాతులు ఉన్నాయి, ఇందులో తూర్పున నూతన కురింజిమాల రక్షితప్రాంతం, చిన్నార్ వైల్డ్ లైఫ్ సాంక్చువరీ,, మంజంపట్టి వాలీ మరియు ఆగ్నేయాన ఉన్న ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ సాంక్చువరీ యొక్క అమరావతి అభయారణ్యం, ఎరావికుళం నేషనల్ పార్క్ మరియు ఉత్తరాన అనాముడి షోలా నేషనల్ పార్క్, పాంపడం షోలా నేషనల్ పార్క్ దక్షిణాన మరియు తూర్పున ప్రతిపాదించబడిన పళని హిల్స్ నేషనల్ పార్క్ ఉన్నాయి. ఇందులో నీలగిరి థార్, నెరసిన వన్నెకల అతిపెద్ద ఉడుత, నీలగిరి వడ్రంగి-పావురం, ఏనుగు, అడవి ఎద్దు, అడవి జింకలు ఉన్నాయి. నీలకురింజి అనే పూలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూస్తాయి.

మున్నార్ చుట్టుపట్ల కల జలపాతాలు చాలా అందమైనవి, వాటికి చుట్టుపక్కలకల మరింత అందమైన పరిసరాలు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. పల్లివాసల్ మరియు చిన్నకనాల్ (దీనినే పవర్ హౌస్ వాటర్ ఫాల్స్ అంటారు) అనే ఈ రెండు జలపాతాలు మున్నార్ పర్యటనలో తప్పక చూడదగినవి.

అనయిరంకాల్ రిజర్వాయర్ మున్నార్ లో చూడదగిన మరో ప్రదేశం. ఈ కొండ ప్రాంతాలలో అనాదిగా వస్తున్న తేయాకు తోటల పెంపక అంశాల ప్రదర్శన టాటా టీ కంపెనీ వారు నిర్వహిస్తున్న ఒక మ్యూజియం లో చూచి తప్పక ఆనందించాలి.

మున్నార్ లో మరిన్ని ప్రధాన ఆకర్షణలు అంటే పోతనమేడు, అట్టుకాల్, రాజామల, ఎకో పాయింట్, మీనెలి మరియు నడుకాని. టాప్ స్టేషన్ మున్నార్ – కొడైకెనాల్ రోడ్ లో బహు సుందరంగా కనపడే ప్రదేశం. ఇక్కడ 12 సంవత్సరాలకొకసారి పూచే నీలక్కురింజి పూవులు పూస్తాయి. తప్పక చూడండి.

పోతన్ మేడు

పోతనమేడు ఒక చిన్న అందమైన గ్రామం. ఇది మున్నార్ నుండి 6 కి.మీ.ల దూరంలో ఉంటుంది. సహజ అందాలకు పెట్టింది పేరు. మున్నార్ సందర్శించే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని తప్పక చూడాలి. ఇక్కడనుండి మున్నార్ హిల్ స్టేషన్, చుట్టుపక్కల లోయలు మరియు మధురపూజ నది చూడవచ్చు. ఈ ప్రదేశం ట్రెక్కర్లకు మరియు ప్రకృతి ప్రియులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

ఈ గ్రామంలో విశాలమైన తోటలు, మరియు పచ్చటి ప్రదేశాలు అనేకం కలవు. టీ తోటలు, మరియు యాలక తోటల కొండలనుండి వీచే చల్లని గాలి పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. పోతనమేడు వ్యూ పాయింట్ కు చేరాలంటే, పర్యాటకులు తోటల మధ్య నుండి ట్రెక్కింగ్ చేయాలి. ఫొటోగ్రఫీ ఆసక్తి కలవారు ఈ ప్రదేశాలను మరింత ఇష్టపడతారు. మెలికలు తిరిగే రోడ్లు, ఎత్తైన కొండలు ఈ ప్రదేశానికి మరింత అందం తెచ్చాయి. ఈ ప్రదేశానికి వెళ్ళే వారు తమ ఆహారం మరియు నీరు తప్పక తీసుకు వెళ్ళటం సూచించదగినది.

మున్నార్ పర్వత శ్రేణుల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి పర్యాటకులు సంవత్సరం పొడవునా సందర్శించేలా చేస్తాయి. మున్నార్ చేరాలంటే, కేరళ మరియు తమిళనాడు, రెండు రాష్ట్రాలనుండి చేరవచ్చు. ఈ ప్రదేశానికి సౌత్ ఇండియాలోని అన్ని ప్రాంతాలనుండి టూర్ ప్యాకేజీలు కూడా కలవు. పర్యాటకులు ఈ ప్రాంతంలో కల అనేక హోటళ్ళు, రిసార్టులు, హోమ్ స్టేలు మరియు రెస్ట్ హౌస్ లలో తమ వసతిని తమ తమ బడ్జెట్ల మేరకు ఎంపిక చేసుకోవచ్చు సమీప రైల్వేస్టేషన్ ఎర్నాకుళం మరియు అలువా. 105కిమీ దూరంలో ఉన్న కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి సమీపంలో ఉంది.  

మున్నార్ లో హోటల్స్ బాగానే వుంటాయి. ముందుగా ఆన్లైన్ లో బుక్ చేసు కోవాలి. సౌకర్యం గా వుంటుంది. బస్ స్టాండ్ కి దగ్గరలో వున్నాయి . మహావీర్ రెస్టారెంట్ అని వెజ్ రెస్టారెంట్ వుంది. మున్నార్ లో వున్న సౌకర్యం ఏంటంటే , ఆర్టీసీ .టూరిస్ట్ ప్రాంతాల్లో ఎక్కడైనా చాలా వరకూ, సొంతం గా టాక్సీ మాట్లాడుకోవాలి. మున్నార్ లో బస్ అన్ని టూరిస్ట్ ప్రాంతాలకు లభిస్తుంది. Ecko పాయింట్ కి వెళ్లి , అక్కడ నుండి వేరే వ్యూ పాయింట్ కి బస్ దొరుకుతుంది. కావలసినంత సమయం గడపొచ్చు. జలపాతాలు దగ్గర. కానీ మధ్యాహ్నం 2 గంటలు అయ్యేటప్పటికి వర్షం వచ్చేస్తుంది ఇంచుమించు రోజూ. కేరళ గవర్నమెంట్ వారిది స్టోర్ వుంది. బస్ స్టాండ్ కి దగ్గర. దానిలో అటవీ వుత్పత్తులు, టీ పొడి వంటివి చాలా దొరుకుతాయి. మసాలా సరుకులు, సుగంధ నూనెలు దొరుకుతాయి. వెదురు బియ్యం దొరుకుతాయి. గంధపు చెక్క మాత్రం దొరకదు. తినటానికి బాకెరీ ఐటమ్స్ ,ఐస్ క్రీం వంటివి వుంటాయి.

%d bloggers like this: