కోయంబత్తూర్ – దక్షిణ దేశపు మాంచెస్టర్ పట్టణం

కోయంబత్తూర్ తమిళ్ నాడు రాష్ట్రం లో కలదు. ఇది రాష్ట్రం లో విస్తీర్ణంలో రెండవది. ఇండియా లో ఈ నగరం పెద్ద పట్టణాలలో 15 వ స్థానం లో కలదు. ఒక మెట్రో నగరం. దేశం లోనే ఒక ప్రారిశ్రామిక కేంద్రం గా గుర్తించబడి ‘ మాంచెస్టర్ అఫ్ సౌత్ ఇండియా ‘ అని పిలువ బడుతోంది.   కోయంబత్తూర్ కు ఈ పేరు కోయన్ అనే నాయక వంశ రాజుల ప్రధాన మంత్రి పేరు మీద వచ్చింది. ఈ నగరం గత రెండు దశాబ్దాల లో విద్యా పరంగా, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. ఈ నగరాన్ని గతంలో విజయనగర రాజులు, నాయక్ లతో సహా అనేక ప్రధాన వంశాలు పాలించాయి. 17 వ శతాబ్దంలో ఈ నగరం మైసూరు రాజ్యం లో ఉన్నప్పటికీ బ్రిటిష్ వారు దీనిని 1799 లో గెలుచుకుని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లో భాగం చేసుకున్నారు.   ఈ నగరం 1930 ల తర్వాత బాగా అభివృద్ధి చెందినది. ఇక్కడ ప్రధాన పరిశ్రమ టెక్స్ టైల్ పరిశ్రమ. నగర వాతావరణం ఆహ్లాదంగా వుంటుంది. భూమి సారవంతమైనది మరియు ఇక్కడి ప్రజలుశ్రమించి పని చేసే వారు.   ది కాటన్ సిటీ తమిళ్ నాడు లో కోయంబత్తూర్ టెక్స్ టైల్ మరియు టెక్నాలజీ లలో ప్రాముఖ్యత కల నగరం. ఇక్కడ పురాతన హస్త కళలు మరియు ఆధునిక పరిశోధనలు రెండూ కలసి నడుస్తాయి. ఆదాయం లో ఈ సిటీ చెన్నై తర్వాత నగరం గా పేరు పడింది. దక్షిణ దేశం లో ఆదాయం లో నాల్గవ స్థానం లో కలదు.   ఈ సిటీ కాటన్ సిటీ అఫ్ ఇండియా గా పేరు పడి వేలాది మందికి పరిశ్రమలో, మరియు లక్షలాది మందికి స్థానికంగా జీవనం ఇస్తోంది. ఈ ప్రదేశం చుట్టూ పత్తి పొలాలు అధికంగా కలవు. టెక్స్ టైల్ మిల్స్ చిన్నవి మరియు పెద్దవి కలసి సాగుతాయి. అనేక మందికి జీవనోపాధి కలిగిస్తున్నాయి. వివిధ విద్యా సంస్థల విద్యార్ధులు ఇక్కడ కల రీసెర్చ్ సంస్థలలో వారి రీసెర్చ్ చేస్తారు. టెక్స్ టైల్ పరిశ్రమలో నైపున్యతలను చూపేందుకు ఇక్కడ రెండు ఉన్నత సంస్థ లు కలవు. వీటి పేర్లు మేడి టెక్ మరియు ఇందు టెక్ కాగా ఇవి ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ కేంపస్ లో కలవు.   కోయంబట్టూర్ పారిశ్రామిక అభివృద్ధి కారణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ గత 15 సంవత్సరాలలో బాగా అభివృద్ధి చెందాయి. తమిళ్ నాడు లోని చెన్నయి తర్వాత కోయంబత్తూర్ గరిష్ట సంఖ్యలో సాఫ్ట్ వేర్ పట్టభద్రులను తయారు చేస్తోంది.

ఈ ప్రదేశం లో అనేక పరిశ్రమలు వచ్చాయి. ఐ.టి. కంపెనీ లు కాగ్నిజంట్ టెక్నాలజీ సోలుషన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, డెల్, రాబర్ట్ బాష్ మరియు ఐ బి ఎం వంటివి పుట్టుకోచాయి. త్వరలోనే ఊరు పొలిమేరలలో మరొక ఐ టి పార్క్ కూడా రానుంది.   సిటీ లో ప్రసిద్ధ ఆకర్షణలు అంటే మరుదమలై టెంపుల్, ధ్యానలింగ టెంపుల్, ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ సంక్చురి మరియు నేషనల్ పార్క్ మరియు బ్లాకు థండ ర్ థీం పార్క్ లు.

మరుధమలాయి టెంపుల్

మరుధ మలాయి టెంపుల్ లో మురుగన్ పూజించబడతాడు. ఈ టెంపుల్ ఒక కొండపై కలదు. దీనిని కొంగు రాజులు పురాతన కాలం లో నిర్మించారు. ఈ టెంపుల్ మురుగన్ కు గల టెంపుల్ ఆరుపద వీడు టెంపుల్ తర్వాత రెండవది. లార్డ్ మురుగన్ కు మరుదమలై అనధికారంగా ఎదవ పది వీడు గా మురుగన్ భక్తులు భావిస్తారు. ఈ టెంపుల్ సుమారు 1200 సంవత్సరాల కిందటిది గా చెపుతారు. దీనిని గురించి అనేక గ్రంధాలలో కలదు. టెంపుల్ గోడలపై అనేక శాశనాలు కలవు

ఈ టెంపుల్ పడమటి కనుమలలో కలదు. కోయంబత్తూర్ సిటీ నుండి 15 కి. మీ. ల దూరం లో వుంది రోడ్డు మార్గం లో తేలికగా చేరవచ్చు

ధ్యాన లింగ టెంపుల్, వేల్లింగిరి

ధ్యాన లింగ టెంపుల్ 1994 సంవత్సరం లో వేల్లియన్ గిరి లో సద్గురు స్థాపించారు. అదే సంవత్సరం లో ఈ టెంపుల్ సద్గురు చే మొట్ట సారిగా ధ్యానలింగ అనే భావన మొదటి ప్రోగ్రాం గా చర్చించబడింది. 1996 లో ధ్యాన లింగ టెంపుల్ వద్ద లింగం ప్రతిష్టించారు. 1999 వరకూ ఈ టెంపుల్ సద్గురు శిష్యులకు మాత్రమే ప్రవేశ అనుమతి వుండేది. 1999 నవంబర్ 23 నుండి ఈ టెంపుల్ ప్రవేశాన్ని పబ్లిక్ కు అనుమతించారు.

తమ జీవితాలలో ఒత్తిడి, ఆందోళన తగ్గించు కోవాలనుకునే వారి లో ఈ టెంపుల్ ప్రాముఖ్యత పొందింది. ప్రశాంత ధ్యానానికి ఈ టెంపుల్ కు అనేక మంది వస్తారు. ఈ టెంపుల్ లోకి అన్ని మతాల వారికి ప్రవేశం కలదు.

ఈ ప్రదేశం వేసవి లో అధిక వేడి, వర్షాలు ఒక మోస్తరు, చలి కాలం చల్లగా వుంటుంది. కోయంబట్టూర్ లో ఒక ఎయిర్ పోర్ట్ , ఒక రైలు స్టేషన్ కలవు. రోడ్డు మార్గం లో అనేక పట్టణాలకు కలుపబడి వుంది.

Related posts

%d bloggers like this: