అమరావతి – చరిత్ర లో నడయాడే జ్ఞాపకాలు

దక్షిణ భారత దేశంలోని గుంటూరు జిల్లాలో  కృష్ణా నది ఒడ్డున కల ఒక చిన్న  పట్టణం అమరావతి. ఇక్కడ కల అమరేశ్వర టెంపుల్ కారణం గా ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. అంతేకాక, ఇక్కడ నిర్మించబడిన అతి పెద్ద బౌద్ధారామాల కారణంగా కూడా ప్రసిద్ధి కెక్కింది. ఈ బౌద్ధ స్తూపాలని మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందే నిర్మించారని విశ్వసిస్తారు. దీనిని అప్పట్లో ధాన్య కటకం లేదా ధరణికోట అని పిలిచేవారు. ఆంద్ర పాలకులలో మొదటి వారైన సాతవహనలుకు సుమారు క్రి. పూ. 2 వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు వారి సామ్రాజ్యానికి రాజధానిగా వుండేది.   గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను అమరావాతి లోనే బోధించాడు. దీనికి చారిత్రిక ఆధారాలు వజ్రాయన గ్రంధం లో పొందుపరచబడి వున్నాయి. ఈ కారణంగా అమరావతి పట్టణం క్రి. పూ సుమారు 500 సంవత్సరాల ముందు కూడా కలదని తెలుస్తోంది. నేడు ఈ పట్టణం, అమరావతి స్తూపం , పురావస్తు మ్యూజియం వంటి ఆకర్షణల కారణంగా ఒక చక్కని పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది.  

అమరావతి స్తూప లేదా మహాచైత్య

అమరావతి స్తూపం లేదా మహా చైత్య, అమరావతిలో ఒక గొప్ప ఆకర్షణ. ఈ స్తూపాన్నిబౌద్ధ మతాన్ని అనుసరించిన చక్రవర్తి అశోకుడి కాలం లో నిర్మించారు. తర్వాత చివరికి అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ మత వ్యాప్తికి పాటు పట్టాడు. క్రి. పూ. 200 సంవత్సరాల నాటికే స్తూపం నిర్మాణం పూర్తి అయింది. ఈ స్తూపం , దానిపై చెక్కడాలు బుద్ధుడి జీవిత కధను మరియు అతని బోధనలను తెలియ చేస్తుంది. అమరావతి శాతవాహన రాజుల రాజధాని అయినపుడు, ఈ స్తూపాన్ని మరింత బుద్ధుడి జీవిత విశేషాలతో ని ఇతర చిత్రాలతో అలంకరించారు. అయితే, తదుపరి కాలం లో బౌద్ధ మతం ప్రభావం కోల్పోయినందున ఆ స్తూపం మట్టిలో కప్పబడి వుంది, సుమారు క్రి. పూ. 1796 సంవత్సరంలో ఆ ప్రదేశాన్ని సందర్శించిన కల్నల్ కోలిన్ మెకంజీ చే కనుగొనబడింది. ఒకసారి తవ్వకాలు మొదలైన తర్వాత స్తూపమే కాక దానికి సంబంధించిన అనేక శిల్పాలు కూడా బయట పడ్డాయి. నేడు ఆ స్తూపమే దక్షిణ ఇండియా లో కనుగొనబడిన అశోక పిల్లర్ గా వ్యహరించబడుతోంది.

  ఆర్కియోలాజికాల్ మ్యూజియం


అమరావతి లో కృష్ణా నది కి కుడి వైపున ఆర్కేయోలాజికాల్ మ్యూజియం కలదు. అమరావతి చరిత్ర, దాని సంస్కృతి, ఆనాటి ప్రాంత సాంప్రదాయాలు వంటివి తెలియ జేసే వస్తువులు ఈ మ్యూజియం లో కలవు. అమరావతి లో పుట్టిన కళలకు , మరియు భారతీయ కళలకు చారిత్రక ఆధారాలు ఇస్తోంది. సుమారు 3వ శతాబ్దం లో విలసిల్లిన బౌద్ధ మత శిల్పాలు సైతం ఈ మ్యూజియం లో కలవు.   అమరావతి సాంప్రదాయాలు, పద్మం, పూర్ణ కుంభ వంటివి అమరావతి సాంప్రదాయాని తెలుపుతాయి. ఇవన్నీ ఆ పట్టణ ప్రజల ఆనాటి వైభవోపేత జీవనాన్ని తెలుపుతాయి. అమరావతి పట్టణ చరిత్ర ఆది నుండీ తెలుస్తోంది. అనేక చరిత్ర పుస్తకాలు చది వేకంటే , ఒక్కసారి మ్యూజియం సందర్శిస్తే చాలు, ఎంతో చరిత్ర తెలిసిపోతుంది.

కృష్ణా నది తీరం ఒక విహార ప్రదేశంగా వేలాది పర్యాటకులని ఆకర్షిస్తోంది.   

కృష్ణా నది తీరం ఎంతో ఆహ్లాదకరమైన నది తీరం. అమరావతి పట్టణాన్ని కృష్ణా నది ఒడ్డున నిర్మించారు. కనుక ఈ నది, ఆ పట్టణ వాసులకు ఎంతో ప్రాధాన్యత కలిగినది. మానవ నాగరికతలు అనేకం నదీ తీరాల లోనే విలసిల్లి చరిత్రలు సృష్టించినాయనేది ఒక వాస్తవం.

ఈ పట్టణం క్రీస్తు కు ముందే కలదు. కనుక ఈ పట్టణ ప్రజల జీవనంలో కృష్ణా నది శతాబ్దాల పాటు ప్రధాన పాత్ర పోషించింది. ఎంత కాలం గడిచినప్పటికీ ఈ నది విలువలని తగ్గించలేము. అది ఇంకా అమరావతి పట్టణానికి ఒక గొప్ప విలువైన ఆస్తి గా వుంది, వేలాది పర్యాటకులని సంవత్సరం లోని అన్ని కాలాల లోను ఆకర్షిస్తోంది.

ఈ పట్టణానికి రోడ్డు, రైలు, లేదా బోటు ల లో తేలికగా చేరవచ్చు. దీనికి సమీప ఎయిర్ పోర్ట్ విజయవాడ లో కలదు. రాష్ట్ర ప్రభుత్వ బస్సు లు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి అమరావతి కి నడుస్తాయి. ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా ఉష్ణమండల వాతావరణం కలిగి, వేసవులు అధిక వేడి, పొడి గాని, చలి కాలాలు చలి గాను వుంటాయి. ఎన్నో ఆకర్షణలు కల ఈ ప్రదేశం, చారిత్రకులనే గాక పర్యాటకులని కూడా ఆకర్షిస్తోంది.

%d bloggers like this: