హైదరాబాద్ – తెలుగు దేశం యావత్తూ గర్వించదగిన నగరం

తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ దక్షిణ భారత దేశంలో పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. మూసీ నది ఒడ్డున ఉండే ఈ సుందరమైన నగరం ప్రఖ్యాత ఖుతుభ్ షా రాజవంశీయుల లో ఒకరైన మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా చేత 1591 లో ఏర్పాటయింది. స్థానిక స్థల పురాణం ప్రకారం భాగమతీ, మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా ల ఆసక్తి కరమైన ప్రేమ కథ నుండి ఈ నగరానికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఆస్థాన నర్తకి అయిన భాగమతి తో సుల్తాన్ ప్రేమలో పడతాడు. వారి ప్రేమకి గుర్తుగా ఖులీ ఖుతుబ్ షా ఈ నగరానికి భాగ్యనగరం అన్న పేరు పెట్టాడు. ఆమె ఇస్లాం మతం లో కి మారి  హైదర్ మహల్ గా పేరు మార్చుకున్నాక సుల్తాన్ ని వివాహమాడారు. తదనుగుణంగా ఈ నగరం పేరు కూడా హైదరాబాద్ గా మారింది.   దక్షిణ భారత దేశం పై దండయాత్ర చేసిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేత ఈ నగరం ఆక్రమించబడే వరకు హైదరాబాద్ నగరం ఖులీ ఖుతుబ్ షా రాజవంశీకుల చేతిలోనే దాదాపు ఒక శతాబ్దం వరకు ఉంది. 1724 లో ఆసిఫ్ జహి రాజవంశాన్ని స్థాపించిన తరువాత మొదటి ఆసిఫ్ జా హైదరాబాద్ ని, చుట్టు పక్కల ప్రదేశాలని అధీనం లోకి తీసుకున్నాడు. హైదరాబాద్ నిజాములు గా ఆసిఫ్ జా రాజవంశీకులు పేరొందారు. వైభవోపేతమైన నిజాముల శకానికి సంబంధించిన ఈ సుందరమైన ప్రాంతం యొక్క ఘనమైన చరిత్ర వలసవాదుల కాలం వరకు విస్తరించింది. బ్రిటిష్ రాజులతో పరస్పర లబ్ది దార సంది కుదుర్చుకుని నిజాం వారు హైదరాబాదుని దాదాపు రెండు వందల సంవత్సరాలు పాలించారు. 1769 నుండి 1948 వరకు ఈ ప్రాంతం నిజాముల రాజధానిగా వ్యవహరించింది. ఆపరేషన్ పోలో నిర్వహించిన తరువాత ఆఖరి నిజాం పాలకుడు ఇండియన్ యూనియన్ తో జరిగిన పట్టాభిషేక ఒప్పందం పై సంతకం చేసి హైదరాబాద్ ని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా, స్వతంత్ర భారత దేశం లో ని భాగం గా చేసారు. సాంస్కృతిక గుర్తింపు, విలక్షనీయత హైదరాబాద్ సొంతం. తెలుగు దేశం యావత్తూ గర్వించదగిన నగరం హైదరాబాద్ నగరం.   భౌగోళికంగా హైదరాబాద్ మంచి ప్రదేశం లో ఉంది. ఉత్తర భారత దేశ భాగం పూర్తయ్యి, దక్షిణ భారత దేశం భాగం మొదలయ్యే ప్రదేశం హైదరాబాద్. అందువల్ల, హైదరాబాద్ లో రెండు విభిన్న సంస్కృతుల సమ్మేళనం కనిపిస్తుంది. ఈ కలయిక ఎంతో  అందంగా ఉంటుంది. పూర్వపు రోజుల నుండి సాహిత్యం, సంగీతం, కళలకు హైదరాబాద్ రాజధానిగా వ్యవహరించేది. నిజానికి, నైజాముల ఆదరణవల్ల ఈ నగరంలో లలిత కళలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. లలిత కళ లపై అమితమైన ఆసక్తి కలిగిన నైజాములు, అర్హత కలిగిన కళాకారులని ప్రోత్సహించడంలో వెనకడుగు వేసేవారు కాదు. అంతే కాదు, ఈ రాజవంశీకులు భోజన ప్రియులు కూడా. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వంట వాళ్ళని రప్పించి ఎన్నో రుచులని వారిచేత విభిన్న రకాల వంటకాలను చేయించుకుని ఆస్వాదించేవారు. ఈ రోజు, హైదరాబాద్ లో కనిపించే విభిన్న రుచుల సమ్మేళనం దేశంలో ని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చినదే. అయినా స్థానిక వంటల రుచులు మాత్రం అన్నిటికంటే ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ తయారు చేసే హైదరాబాద్ దం బిర్యాని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. వారసత్వ సంపద వారసులకి ఇచ్చినట్టు, హైదరాబాద్ లో ఉండే ప్రతి కుటుంబం ఈ వివిధ వంటకాల తయారీ విధానాన్ని తమ తరువాతి తరాలకి తెలియచేస్తున్నారు.  

ఆకర్షణీయమైన పురాతన ప్రపంచపు నగరం
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల ప్రస్తుతం భారత దేశం పటం లో హైదరాబాద్ నగరం అత్యుత్తమ స్థానాన్ని పొందింది. హై టెక్ కార్పొరేట్ ఆఫీసుల లోని జీవనోపాధి కోసం దేశం లోని వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ కి తరలి వచ్చి ఎంతో  మంది ఇక్కడ స్థిరపడుతున్నారు. ఎన్నో టెక్నో పార్క్స్ ఏర్పాటయినా, పురాతన ప్రపంచపు ఆకర్షణలైన మినార్స్, గాజుల మార్కెట్లు, ఖావో గలీస్ మరియు ఫోర్ట్స్ ని కాపాడుకుంటూ ఎంతో మందిని ఇక్కడికి ఆకర్షిస్తోంది. ఈ ప్రదేశాలన్నీ పురాతన కాలంలో నైజాం రాజుల మరియు ఆస్థాన నర్తకిల వైభవాలని మీకు కథలు గా చెబుతాయి. హైదరాబాద్ లోని పాత బస్తీ లోని ఒక చిన్న నడక ద్వారా చరిత్ర పుస్తకంలో కూడా ఈ ప్రదేశం గురించి కనిపించే ఎన్నో అంశాలు ఎదురవుతాయి. ఇప్పటికి, భాగమతీ, ఖులీ ఖుతుబ్ షా ల ప్రేమ కథని గోల్కొండ కోట ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ, గాంభీర్యం మరియు దయలని స్థానిక ప్రజలలోగమనించవచ్చు .  

హైటెక్ సిటీ
సాంస్కృతిక అస్థిత్వాన్ని కాపాడుకుంటూనే సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నఒకే ఒక్క నగరంగా ఈ హైదరాబాద్ నగరాన్ని చెప్పుకోవచ్చు. నానాటికి దేశంలోని ఇంజినీర్ల డిమాండ్ ని తట్టుకోవడానికి గత రెండు దశాబ్దాలలో ఈ నగరంలో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వివిధ రంగాలకి సంబంధించిన ఇంజినీర్లని ఉత్పత్తి చేయడంలో హైదరాబాద్ నగరానికి సాటి ఏ  నగరమూ లేదు. ఎన్నో బహుళ జాతి కంపెనీలు అభివృద్ధి సాధించడానికి ఇక్కడ శాశ్వతంగా ఆఫీసులని ఏర్పాటు చేయడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ ఏర్పాటయిన ఎన్నో ఐటి మరియు ఐటిఇయస్ కంపెనీలు దేశవ్యాప్తంగా యువతకి ఎన్నోఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. విద్యా ఉద్యోగ సంబంధిత విషయాలకోసం దేశం నలు మూలల నుండి ఎంతో మంది యువత ఇక్కడికి తరలి వస్తున్నారు. ఆధునిక సౌకర్యాలన్నీ ఇక్కడ లభ్యమవుతాయి. నగరం లో ని శాంతి భద్రతలని కాపాడి ప్రజలకి సురక్షిత ప్రదేశంగా రక్షణ కలిపించడంలో సామర్థ్యం కలిగిన పోలీసు బలగాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సాంస్కృతిక ప్రత్యేకతని కాపాడుకుంటూనే నూతన మార్పులని అంగీకరిస్తున్న స్థానిక ప్రజల వల్లే ఈ అభివృద్ధి సాధ్యం అవుతోంది.   చరిత్రకారులు మరియు బ్యాక్ పాకర్స్ కోసం ఎన్నో వింతలు దాచి ఉంచడంతో పాటు పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటోంది  ఈ హైదరాబాద్ నగరం. చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, సాలార్ జంగ్ మ్యూజియం మరియు హుస్సేన్ సాగర్ వంటివి హైదరాబాద్ లో ఉన్న ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణలలో కొన్ని.

చార్మినార్

క్రి.శ. 1591  లో మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా చేత చార్మినార్ నిర్మించబడినది. ఇప్పటికీ హైదరాబాద్ నగరానికి ఈ చార్మినార్ ముఖ్యమైన కట్టడం గా పేరొందింది. హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ చారిత్రక నిర్మాణం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. చార్మినార్ పేరు ‘చార్’ మరియు ‘మినార్’ అనే రెండు ఉర్దూ పదాల నుండి వచ్చింది.

చారిత్రాత్మకమైన ఈ కట్టడం క్రీ॥శ॥ 1591 సంవత్సరంలో కట్టబడినది. 56 మీటర్ల ఎత్తున్న ఈ కట్టడం నాలుగు ప్రక్కలా నాలుగు మినార్లతో కట్టబడినది.ఈ మినార్ల లోపల నుండి పైకి ఎక్కుటకు మెట్లు కలవు. ఈ ప్రాంతం గాజులకు ప్రసిద్ధి. మరియు బిర్యానీ, హలీమ్‌ వంటకాలకు ప్రసిద్ధి. సంక్రాంతి పండుగ రోజులలో గాలిపటాల అమ్మకాలతో సందడిగా ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు చార్మినార్‌ను ఎక్కవచ్చు.

చార్మినార్ సుల్తాన్ కుతుబ్ షాహి వంశస్థుడైన మహ్మద్ కులి కుతుబ్ షాచే నిర్మించబడింది.హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న చార్ మినార్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. చార్మినార్ అప్పటి నిర్మాణ శైలికి మచ్చుతునకగా చెప్పవచ్చు. కట్టడం పైకి వెళ్లటానికి ప్రతి మినార్‌లోను మెట్లు ఉన్నాయి. ఆ మెట్లను చేరుకోవటానికి నాలుగు ఆర్చ్‌లు ఉన్నాయి. ప్రతి మినార్‌లోను 140 మెట్లున్నాయి.ప్రతి మినార్‌ అందమైన డోమ్‌ ఆకారంలో ఉంటుంది. మెదటి, రెండవ అంతస్తలలో 16 చిన్న, పెద్ద ఆర్చ్‌లు ఇరువైపులా ఉన్నాయి. మూడవ అంతస్తులో 16 ఆర్చ్‌లు ఉన్నాయి. ఎంతో అందమైన పనితనంతో జాలీ నిర్మించబడింది. ఈ అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది. నమాజు చేసుకోవటానికి వీలుంది. ఈ మసీదుకు కూడా నాలుగు మినార్‌లు ఉన్నాయి. అనేక ఆసక్తికరమైన అంశాలు చార్మినార్‌ కట్టడంలో చూడవచ్చు.

ఎలా వెళ్ళాలి
చార్మినార్‌ వెళ్ళుటకు హైదరాబాద్‌, నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుండి మరియు మహాత్మా బస్‌ స్టాండ్‌ నుండి, బాలానగర్‌, టోలీచౌక్‌, సనత్‌నగర్‌, గోల్కొండ నుండి బస్‌లో వెళ్ళవచ్చు.ఆటోలలో కేబ్ లలో వెళ్లవచ్చు

చార్మినార్, లైటింగ్ వెలుగులలో

Visiting hours : 9:30 AM to 5:30 PM, all days of the week
Entry Fee: Rs.20/- for Indians and Rs.100 for Foreign tourists

గోల్కొండ ఫోర్ట్

హైదరాబాద్ నగరానికి 11 కిలో మీటర్ల దూరంలో ఉన్న గొల్కండ ఫోర్ట్ లేదా గొల్ల కొండ ఫోర్ట్, గొర్రెల కాపరుల పర్వతాన్ని తెలుపుతుంది. 15 వ శతాబ్దంలో గోల్కొండ ఎంతో కళకళ లాడేది, కానీ ఇప్పుడు శిధిలమవుతున్న పురాతణ వైభవం మాత్రమే కనిపిస్తుంది. 1512 నుండి నగరాన్ని పాలించిన ఖుతుబ్ షా వంశీకుల చేత గోల్కొండ ఫోర్ట్ నిర్మించబడినది.

ఇభ్రహిం ఖులి ఖుతుబ్ షా వాలి నుండి ఈ ఫోర్ట్ నిర్మాణానికి ప్రధాన సహకారం అందించారు. ఉత్తరం నుండి మొఘలుల దాడి నుండి నగరానికి రక్షణ కోసం ఈ ఫోర్ట్ ని నిర్మించారు. ఈ ఫోర్ట్ కున్న ముఖ్యమైన లక్షణం శబ్ద లక్షణ శాస్త్రం. ఈ ఫోర్ట్ వరండాలో నిలుచుని మీరు చప్పట్లు కొడితే ఆ శబ్దం ప్రధాన రహదారి నుండి 91 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశానికి స్పష్టంగా వినబడుతుంది.

గోల్కొండకు 8 ప్రవేశద్వారాలు మరియు 70 ఋజువులు కలవు. ప్రసిద్ధి చెందిన వజ్రాలు రీజెండ్‌, నూర్‌-ఉల్‌-ఏన్‌, కోహినూర్‌ ఇక్కడ దొరికినవే అని చెబుతారు. 17వ శతాబ్ధంలో ఢిల్లీ షాదూషా ఔరంగజేబ్ ఈ కోటను స్వాధీనం చేసుకుని ఉద్దేశ పూర్వకంగా చాలాభాగం నాశనం చేయించాడు. రామభక్తుడుగా పేరుపొందిన భక్తరామదాసును గోల్కొండ కోట చెరసాలలోనే బంధించబడ్డాడు. ఈ చెరసాలను ఇప్పడు కూడా చూడవచ్చు. ప్రతి రోజూ గోల్కొండ చరిత్ర గురించి మ్యూజికల్‌ షో నిర్వహించబడుచున్నది. వ్యాఖ్యాత ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాత
ప్రతి సోమవారం మ్యూజికల్‌ షోకు సెలవు.
మ్యూజికల్‌ షో సమయాలు : మ్యూజికల్‌ షో ప్రదర్శన కాలం : 55 నిమిషాలు
నవంబర్‌ నుండి ఫిబ్రవరి వరకు సాయంత్రం 6-30 గంటకు
మార్చి నుండి అక్టోబర్‌ వరకు సాయంత్రం 7 గంటలకు
ఆదివారం మరియు బుధవారం : ఇంగ్లీషు భాషలో మంగళవారం, శుక్రవారం మరియు శనివారం హిందీ భాషలో, గురువారం తెలుగులో, మ్యూజికల్‌ షోకు ప్రవేశరుసుము చెల్లించాలి
ఒక రహస్య సొరంగ మార్గం ఈ గోల్కొండ ఫోర్ట్ ని చార్మినార్ తో కలుపుతుందని నమ్ముతారు. అయితే, ఎటువంటి ఆధారాలు ఈ సొరంగ మార్గం గురించి దొరకలేదు.

గోల్కొండకు ఎలా వెళ్ళాలి
నాంపల్లి, కోఠి, మహాత్మాగాంథీ బస్‌ స్టేషన్‌, మెహిదీపట్నం బస్‌స్టాండ్‌ నుండి సిటీ బస్‌లో వెళ్ళవచ్చు. ట్రాఫిక్‌ దృష్ట్యా ఛార్మినార్‌ నుండి గండిపేట దారిలో వెళ్ళటం ఉత్తమం.

Visiting times 09-00 am to 05-30 pm

రామోజీ ఫిలిం సిటీ


హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఈ రామోజీ సిటీ, సినిమా మరియు సీరియల్ షూటింగ్ లకే కాకుండా పిక్నిక్ లకి, థీమ్ బేస్డ్ పార్టీలకి, కార్పొరేట్ ఈవెంట్లకి, వైభవోపేతమైన పెళ్ళిళ్ళకి, సాహస కామ్పులకి, కాన్ఫరెన్స్ లకి అలాగే హనీ మూన్ జంటలకి అనువైన ప్రదేశం గా ప్రాచుర్యం పొందింది.

గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా సర్టిఫై చెయ్యబడిన ఈ రామోజీ ఫిలిం సిటీ సినిమా షూటింగ్ ల కి భారీ స్టూడియోగా విశిష్టత కలిగినది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అలాగే చిత్ర నిర్మాణానికి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ ఈ రామోజీ ఫిలిం సిటీ లో ఉన్నాయి. చిత్ర నిర్మాణానికి కేవలం ఒక స్క్రిప్ట్ తో ఈ రామోజీ ఫిలిం సిటీ లో కి వచ్చి అలాగే పూర్తిగా చిత్రీకరణ అయిన చిత్రం తో బయటికి వేల్లవచ్చని అంటారు. చిత్ర నిర్మాణానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఈ ఫిలిం సిటీ లో ఉన్నాయి. చిత్రనిర్మాణానికే కాకుండా సందర్శకుల కోసం కూడాఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి.

జాయ్ రైడ్స్, ఫన్ ఈవెంట్, సంగీత సంబంధిత కార్యక్రమాలు, ఆటలు అలాగే నృత్యాలు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు సంపూర్ణ కుటుంబానికి వినోదం కలిగించేవి ఎన్నో ఇక్కడ నిర్వహిస్తారు. మీకు కావలసినప్పుడు షాపింగ్ చేసుకునే సదుపాయం అలాగే వివిధ రకాల రుచులని అందించే భోజన సౌకర్యాలు కూడా ఇక్కడ కలవు.

లుంబినీ పార్క్

హుస్సేన్‌ సాగరతీరంలో ఉన్న ఈ పార్కు పిల్లలకు ఇష్టమైనది. ఆహ్లాదకరమైన వాతావరణం, వాటర్‌ ఫౌంటేన్‌, పూలమొక్కలతో రూపుదిద్దబడిన గడియారం ప్రత్యేక ఆకర్షణలు. బిర్లామందిర్‌, హుస్సేన్‌ సాగర్‌, సెక్రటరియేట్‌కు దగ్గరలో కలదు. వారాంతపు సెలవులు గడపటానికి పిల్లలకు, పెద్దలకు మంచి పిక్ నిక్ స్థలం. ప్రత్యేకంగా ప్రదర్శించు లేజర్‌షోను తిలకించవచ్చు
లేజర్‌ షో సమయాలు
ప్రతిరోజూ సాయంత్రం 7-15 నిమిషాలకు
శనివారం మరియు ఆదివారం : సా॥ 7-15 ని॥కు మరియు రాత్రి 8-30 ని.కు
దగ్గరలోగల బస్‌స్టాపు : బిర్లామందిర్‌, సెక్రటరియేట్‌, టాంక్‌బండ్‌ హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాలనుండి బస్‌ సౌకర్యం కలదు.

Hussian sagar lake

కొన్నిసార్లు, శీతాకాలం లో కూడా ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది. కాబట్టి, పర్యాటకులు వాతావరణం అనుకూలంగా ఉన్న సమయం లో నే ఇక్కడ సందర్శించడం ఉత్తమం. రైలు, రోడ్డు మరియు వాయు మార్గం ద్వారా హైదరాబాద్ నగరం అన్ని ప్రాంతాలకి చక్కగా అనుసంధానమై ఉంటుంది. అందువల్ల జాతీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులు ఈ ప్రాంతం తప్పక సందర్శించవలసిన ప్రాంతంగా మారింది.

యన్.టి.ఆర్. గార్డెన్స్

దివంగత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి యన్‌ టి రామారావు గారి పేరు మీద ఈ ఉద్యానవనం అభివృద్ధిపరచ బడినది. పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ పార్కు హుస్సేన్‌సాగర్‌కు దగ్గరలో జంటనగరాల నడిబొడ్డను ఉన్నది. పిల్లలకు ఆటస్థలము, ట్రాయ్‌ రైలుబండి, జపనీస్‌ గార్డెన్‌, పళ్ళదుకాణం, ఇంకా షాపులు కలవు. వివిధ కట్టడాలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వారాంతపు సెలవులలో చూడటానికి చక్కని ప్రదేశం
మధ్యాహ్నం గం.2-30 ని. నుండి రాత్రి గం.9 దాకా తెరచి ఉంటుంది.
హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలనుండి బస్‌ సౌకర్యం కలదు. దగ్గరలోని బస్‌స్టాప్ ఎ.జి. ఆఫీస్‌, బిర్లామందిర్‌, సెక్రటరియేట్‌.

సాలార్ జంగ్ మ్యూజియం

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ మ్యూజియం హైదరాబాద్ కు చెందిన ఓ గొప్ప సంపద. సాలార్ జంగ్-3 చే 40 సంవత్సరాలపాటు దేశ విదేశాల నుండి సేకరించబడిన అనేక అద్భుతమైన కళాఖండాలు, శిల్పాలు, చిత్రాలు, పురాతన వస్తువులు, ఆయుధాలు, కార్పెట్స్, పెయింటింగ్స్, ఇంకా అనేక వస్తువులు ఈ మ్యూజియంలో భద్రపరచారు.
మ్యూజియం విశేషాలు : సాలార్‌జంగ్‌ మ్యూజియం మొత్తం 3 భవనాలలో రెండు అంతస్తులలో కట్టబడినది. మొత్తం 38 గదులతో 3 బ్లాక్స్‌గా విభజించబడి ఉన్నది.

01. భారతీయ బ్లాక్‌
02. తూర్పు బ్లాక్‌
03. పశ్ఛిమ బ్లాక్‌
భారతీయ విభాగం క్రింది అంతస్తులో ప్రదరించబడు వస్తువులు :
2 నెం గది ఫౌండర్స్‌ గ్యాలరి
3 నెం గది భారతీయ చేనేత మరియు కంచు పరికరాలు
5 నెం గది భారతీయ విగ్రహాలు
6 నెం గది దక్షిణాది ఆర్ట్స్‌ విభాగాలు
7 నెం గది భారతీయ చేనేత విభాగం
8 నెం గది దంతాలతో నిర్మించబడ్డ కోచ్‌
9 నెం గది పిల్లల విభాగం
10 నెం గది పిల్లల విభాగం
11 నెం గది దంతంచే చేయబడిన వస్తువులు
12 నెం గది రెబక్కా
14 నెం గది ఆయుధాల గ్యారీ
16 నెం గది భారతీయ మోడరన్‌ పెయింటింగ్స్‌
17 నెం గది భారతీయ సూక్ష్మ చిత్రాలు
మొదటి అంతస్తు : (ప్రధాన భవనం , మెయిన్‌ బిల్డింగ్‌)
18 నెం గది బొమ్మలు
19 నెం గది ఫ్లోరా మరియు ఫానా
24 నెం గది భారతీయ వెండి సామాన్ల గ్యాలరీ
25 నెం గది కార్పెట్స్‌ గ్యాలరీ
28 నెం గది జేడ్‌
29 నెం గది బిద్రి వేర్‌
30 నెం గది కాశ్మీర్‌ గ్యాలరీ
32 నెం గది యుటిలిటి గ్యాలరీ
తూర్పు విభాగం : మెదటి అంతస్తు
1 నెం గది చైనీస్‌ గ్వాలరీ
2 నెం గది పోర్సిలియం
3 నెం గది జపనీస్‌ గ్యాలరీ
4 నెం గది ఈస్టరన్‌ విగ్రహాలు
క్రింది అంతస్తు :
6 నెం గది యూరోపియన్‌ కంచు వస్తువులు
7 నెం గది యూరోపియన్‌ మార్బుల్‌ విగ్రహాలు
ఒకటవ అంతస్తు
1 నెం గది యూరోపియన్‌ పెయింటింగ్స్‌
2 నెం గది యూరోపియన్‌ గ్లాస్‌
3 నెం గది ఫ్రెంచ్‌
4 నెం గది యూరోపియన్‌ గడియారాలు
ఇతరములు :
మొదటి అంతస్తు :
23 నెం గది అరబిక్‌ మరియు పర్షియన్‌ చేతివ్రాత ప్రతులు
26 నెం గది ఈజిప్షియన్‌ మరియు సిరియన్‌
33 నెం గది పశ్ఛిమ దేశాల చెక్క సామాన్లు

పనిచేయు వేళలు :
ఉదయం 10 గంటల నుండి సా.5 గంటల వరకు. ప్రతి శుక్రవారం సెలవు.
మరియు ఈ క్రింది పర్వదినాలలో కూడా మ్యూజియం మూసివేయబడుతుంది.
మిలాద్‌-ఉన్‌-నబి
డా॥ అంబేద్కర్‌ జయంతి
సాలార్‌జంగ్‌ వర్థంతి
రంజాన్‌
దసరా
బక్రీద్‌
మెహర్రం
ఎలా వెళ్ళాలి ?
బస్సులో వెళ్ళేవారు అఫ్జల్‌గంజ్‌ దగ్గరకు బస్సులో వెళ్ళి అక్కడ నుండి నడచి వెళ్ళవచ్చు. దగ్గరలో గల ఇతర ముఖ్య ప్రదేశాలు : చార్మినార్‌, మక్కా మసీద్‌, హైకోర్టు, స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరరీ, ఉస్మానియా జనరల్‌ హాస్పటల్‌

శిల్పారామం

50 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న శిల్పరామం ఆకట్టుకుంటోంది. సాంప్రదాయకంగా తయారుచేసిన హస్తకళలను ఇక్కడ చూడవచ్చు. దేశవ్యాప్తంగా తయారైన కళారూపాలు ఇక్కడ అమ్ముతారు.ముఖ్యంగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉపయోగించే వస్త్రాలు, ఇతర అలంకరణ సామగ్రి కొనుగోలు చేయవచ్చు. హైటెక్ సిటీకి సమీపంలో కలదు. ఉదయం 10-30 నిమిషాలనుండి రాత్రి 08-30 నిమిషాల దాకా శిల్పారామాన్ని సందర్శించవచ్చు.

నెహ్రూ జ్యూలాజికల్ పార్క్

380 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ జంతుప్రదర్శనశాల హైదరాబాద్‌కు తలమానికం. ఈ జంతుప్రదర్శనశాల భారతదేశంలో అతి పెద్ద జంతుప్రదర్శనశాలలో ఒకటిగా పేరుపొందినది. 1963లో ప్రారంభించబడిన ఈ పార్కుకు భారతదేశ ప్రధమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూగారి పేరు పెట్ట బడినది. పిల్లలకు. పెద్దలకు, కొత్త జంటలకు మంచి పర్యాటక స్థలం. ప్రక్కనే ఉన్న మీర్‌ ఆలం చెరువు షుమారు 600 ఎకరాల వీస్తిర్ణంలో ఉండి విదేశీపక్షులకు ఆవాసంగా ఉన్నది. మీర్ ఆలం చెరువులో బోటింగ్ సౌకర్యం కలదు.

ఇక్కడ మనం సెంట్రల్‌ ఆఫ్రికా నుండి తెచ్చిన చింపాంజీలను, రకరకాల కోతులను, ఖడ్గమృగాలను, చిరుతలు, సింహాలు, పులులు ఏనుగులను దర్శించవచ్చు. ఆఫ్రికా సింహం, హిమాయన్‌ బ్లాక్‌ ఎలుగుబంటి, మయన్‌ సన్‌ ఎలుగుబంటి, చిరుతపులులు, తెల్లపులి, భారత దేశవాళి సింహాం,ఇంకా పాములు, కొండచిలువలు, హైనాలు, తోడేళ్ళను చూడవచ్చు.
తాబేళ్ళు, మొసళ్ళు, రంగురంగుల చిలకలు, పావురాళ్ళు, నెమళ్ళు ఇంకా అనేక రకాల పక్షులను కూడా చూడవచ్చును.
సౌకర్యాలు : ట్రైన్‌ రైడ్, బోట్‌, ఎనుగు సవారీ ఇక్కడ ప్రత్యేకత. పలహారశాలలు మరియు అతిధిగృహం కలవు. ప్లాస్టిక్ సంచులు లోపలకు తీసుకువెళ్లటం నిషేధించ బడ్డాయి. మంచినీరు, ఆహారం బయటనుండి తీసుకు వెళ్లవచ్చు.

జూ పనిచేయు వేళలు :
ప్రతి సోమవారం మాత్రమే సెలవు మిగతా అన్నిరోజులలో జూ తెరవ బడుతుంది.
ఏప్రియల్‌ నుండి జూన్‌ వరకు : ఉదయం 8 గంట నుండి సాయంత్రం 5 గంట 30 ని॥ వరకు
జులై నుండి మార్చి వరకు ఉదయం 8 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు.
ప్రవేశ రుసుము : రైలు బండికి, సాధారణ ఏనుగు సవారీ, మహారాజా ఏనుగు సవారీ సఫారీ కార్లకు ( 5 వ్యక్తుల వరకు)
లారీలు/ట్రక్కుల సినిమా షూటింగ్‌ లకు, జూ వారిచే బ్యాటరీ వాహనంకు విడిగా రుసుము చెల్లించాలి
అతిధిగృహం : ఉదయం 9 గంటనుండి సా.5-30 ని.వరకు రూ.200- 10 మందికి, రూ.2000 పదిమందికి మించి
అతిధిగృహం డైరక్టర్‌ ఆఫీసు వద్ద మందుగా బుక్‌ చేసుకొనవలెను
ఫోటోలు తీసుకొనుటకు చెల్లించవలసిన రుసుము
సాధారణ ఫొటోలు తీసుకొనుటకు రూ.20-
వృత్తి నిపుణులకు రూ.500-
వృత్తి నిపుణలకు వీడియో కెమెరాకు రూ.500-
సినిమా షూటింగ్‌కు యూనిమేట్‌ వీడియో/ సీనీ కెమెరాతో : రూ.8500- (ఒక్కో లోకేషన్‌కు) రూ1500- జనరేటర్‌ ఉచితం

హైదరాబాద్లోని ప్రదేశాలు మరియు వీధుల పేర్ల వెనుక చరిత్ర

1) నాంపల్లి: రజా అలీ ఖాన్, 1670 AD లో నిజాం రాజ్యం  యొక్క దివాన్. అతని బిరుదు  ‘నెఖ్ నామ్ ఖాన్’ ఒక జాగీర్ అతనికి ఇవ్వబడింది. అది  నెఖ్-నాంపల్లి గా  పిలువబడేది. క్రమoగా ఇది ‘నాంపల్లి’ గా మారింది.   2) బేగం పెట్: నిజాం II యొక్క కుమార్తె బషీరునిసా బేగం . ఈమె పైగా (Paigah) కులీన వంశజుని వివాహం చేసుకున్నారు. ఆమె కట్నం లో భూములు అందుకుంది. ఈ గ్రామం బెగంపేట్ అని పిలువబడింది.   3) ఖైరతబాద్: ఇబ్రహీం కుతుబ్ షా యొక్క కుమార్తె  ఖైరన్నిసా బేగంకు  మంజూరు చేయబడిన జాగీర్ ఖైరతబాద్ అని పిలువబడింది.   4) బేగం బజార్: వాణిజ్యం కోసం హైదరాబాద్ యొక్క వ్యాపారులకు హమ్దా బేగం (నిజాం అలీ ఖాన్ నిజాముల్ ముల్క్ భార్య) బహుమతిగా ఇచ్చిన భూమి బేగం బజార్ గా  అభివృద్ధి చేయబడింది.   5) సుల్తాన్ బజార్: 1933 తరువాత, రెసిడెన్సీ బజార్ను సుల్తాన్ బజార్ గా మార్చారు, ఈ ప్రాంతాలు బ్రిటీష్ వారు (రెసిడెన్సీ) నిజాంకు తిరిగి ఇచ్చారు..   6) అఫ్జల్ గుంజ్: 5వ నిజాం అఫ్జల్ ఉద్  దౌలా (Afzalud Dawlah) వాణిజ్యం కోసం ధాన్యం వ్యాపారులకు  భూమి బహుమతిగా ఇచ్చిన స్థలం.  ఆ  స్థలం కు  అఫ్జల్ గుంజ్ అని పేరు పెట్టారు.   7) సికింద్రాబాద్: ఈ ప్రాంతం కు సికందర్ ఝా (1806) (III వ నిజం) పేరు పెట్టారు. బ్రిటిష్ దళాలు నివసించిన గ్రామం.   8) మా సాబా కా  తలాబ్: ఖులీ కుతుబ్ షా-VI యొక్క భార్య హాయత్ బక్షి బేగంను మా సాహెబా అని పిలుస్తారు. మల్లెపల్లి గ్రామము యొక్క భూములను సాగుచేయటానికి ఆమె నిర్మించిన చెరువు  మా-సాహబా -కా -తలాబ్ అని పిలిచేవారు. చివరకు ఇది మాసాబ్ ట్యాంక్ అని పిలువబడింది.   9) కడవా  సాహెబ్ కి గల్లి (లేన్): ఎల్లప్పుడూ కోపంతో ఉంటూ ఇతరుల పట్ల చెడు గా మాట్లేడే    ఒక వ్యక్తి పేర ఈ వీధికి ఆ పేరువచ్చింది.  ఈ లేన్ పాత నగరంలో ఉంది.   10) హిమాయత్ నగర్:  7వ నిజాం – ఉన్నస్మాన్ అలీ ఖాన్ (1933 )యొక్క పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ – అజమ్ ఝా  పేరు పెట్టబడిన కొత్త ప్రాంతం   11) హైదర్ గుడా: నిజాం యొక్క భార్య వాహిద్ ఉన్నిసా బేగం పేర గతంలో ఉన్న  జాగిర్ గ్రామం యొక్క  మొదటి తాలుక్ దార్  (జిల్లా కలెక్టర్) హైదర్ ఆలీ పేర మరియు యాజమాన్యంలోని భూములు ఉన్న కొత్త ప్రాంతం ను  హైదర్ గుడా  అని పిలిచారు.   12) బషీర్ బాగ్: సర్ అస్మాన్ ఝా తోట లో బాసిరుద్-దౌలా – అనే పైగా కులీనుడు  ప్యాలెస్ కలిగి ఉన్న ప్రాంతం.   13) సోమాజిగూడ: ఈ గ్రామంలో భూములు మరియు నివాసం కలిగిన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగి సోనాజీ. సోనాజీ క్రమంగా సోమాజీ అయ్యాడు మరియు ఈ గ్రామం ‘సోమాజిగూడ’ అని పిలువబడింది. (గుడా అనేది గూడెం నుండి వచ్చింది అనగా ఒక కుగ్రామం అని అర్ధం).   14) మలక్ పెట్ : అబ్దుల్లా ఖుతుబ్ షా గోల్కొండ రాజు యొక్క సేవకుడు అయిన మాలిక్ యాకోబ్ నివసించిన మార్కెట్ ప్రాంతం. ఆయన పేరు మీద ఆ ప్రాంతం కు మలక్ పెట్  అనే పేరు వచ్చింది.   15) సైదాబాద్: సయీద్ మీర్ మోమిన్ గోల్కొండ యొక్క దివాన్ (1591) యొక్క జాగిర్ గ్రామం.   16) అబిడ్స్ షాప్: ఈ ప్రాంతం లో నిజాం (VI) మహబూబ్ అలీ ఖాన్ యొక్క వాలెట్ మరియు సేవకుడు ఇక్కడ తన మొదటి దుకాణాన్ని కలిగి ఉన్నాడు.    17) సరూర్ నగర్ :  ఈ ప్రాంతం కు అరుస్తు ఝా హైదరాబాద్ దీవాన్ యొక్క ఉంపుడుగత్తె  సర్వారీ అఫ్జల్ బాయ్ పేరు పెట్టారు, అతను ఆమెకు జాగీర్ను మంజూరు చేసి, ఆమె కోసం ఒక ప్యాలెస్ మరియు గార్డెన్ను నిర్మించాడు   18) డెబిర్ పుర : అబ్దుల్ సమాద్ పేరు పెట్టబడినది ఈ గ్రామం; అతని బిరుదులు డబీర్-ఉల్ ముల్క్, ఒక గొప్ప కులీన  వ్యక్తి.   19) నూర్ ఖాన్ బజార్: 2వ నిజాం సమయంలో లక్నో నుండి వచ్చిన నూర్ ఖాన్ అభివృద్ధి చేసిన ఒక మార్కెట్.   20) ఏ.సి. గార్డ్స్ A.C.Guards: లకడి కా పూల్ యొక్క పశ్చిమ ప్రాంతం. వనపర్తి  రాజా యొక్క అబిస్సినియన్ అశ్వికదళ దళాల శిబిరాలు ఉన్న ప్రాంతం. (1910) (అబిస్సినియా ఇథియోపియా యొక్క పురాతన పేరు, ఈస్ట్ ఆఫ్రికన్ దేశం).

%d bloggers like this: