హరిద్వార్ – ‘దేవతల కు ప్రవేశ ద్వారం

హరిద్వార్ హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో ఉన్నది. హరి అంటే విష్ణువు ద్వార్ అంటే దారి. అంటే హరిని చేరుకునే మార్గం అంటారు. గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకువచ్చే సమయంలో అమృతం చిందిన ప్రదేశాలలో హరిద్వార్ ఒకటి అని అంటారు. మిగతా మూడుప్రయాగ, ఉజ్జయినీ , నాసిక్. హరిద్వార్ ప్రకృతి ప్రేమికలకు స్వర్గసీమ. దీనినే కపిస్తాన్, మాయాపురి, గంగాపురిగా కూడా పిలుస్తారు..   హరిద్వార్ పట్టణాన్ని మాయా పూరి, లేదా, కపిల లేదా మోక్షద్వార్, మరియు గంగా ద్వార్ అని కూడా పిలుస్తారు. ఈ పేర్లు వివిధ పురాతన హిందూ పురాణాలలో పేర్కొనబడ్డాయి. ఈ పవిత్ర ప్రదేశం యొక్క చరిత్ర పరిశీలిస్తే, ఇది సుమారుగా రాజు విక్రమాదిత్యుడు కాలం నాటిది. ఈ ప్రదేశం అక్కడ కల ప్రపంచ ప్రఖ్యాత మత పర కేంద్రాలకు మరియు టూరిస్ట్ ఆకర్షణలకు పేరు గాంచినది. ఇక్కడ కల పవిత్ర ప్రదేశాలు చాలా వరకు గంగా నది ఒడ్డున కలవు.

IRCTC Introduce Uttarakhand Coombs Tour: Know Details - Sakshi

హర కి పురి

ఇక్కడ ప్రధాన ప్రదేశం హర -కి -పురి. దీనిని చాలా మంది బ్రహ్మ కుండ్ అని అంటారు. ఈ స్థలం వద్ద గంగా నది పర్వతాల నుండి వెలికి వచ్చి మైదానాలలో కి ప్రవేశిస్తుంది. ఈ ప్రదేశ నిర్మాణం విక్రమాదిత్య చే గంగా నది ఒడ్డున తపస్సు ఆచరించిన తన సోదరుడు బ్రితారి పేరు పై చేయబడింది. ఇక్కడి స్నాన ఘట్టాలలో భగవానుడు విష్ణు మూర్తి పాద ముద్రలు కూడా చూడ బడతాయి. యాత్రికులు ఈ ప్రదేశంలో అనేక మతపర కార్యక్రామాలు చేస్తారు. అవి సిరోముండనం అంటే తలకు వెంట్రుకలు తీయుట, ‘ఆస్థి విసర్జనం ‘ అంటే చనిపోయిన వారి అస్థికలు లేదా బూడిద నది లో కల్పుట వంటివి. ప్రతి 12 సంవత్సరాలకు ఇక్కడ ‘కుంభ మేలా’ నిర్వహిస్తారు. దీనికి ప్రపంచం నలుమూల నుండి యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు.

కుంభమేళా: హరిద్వార్ లో 12 సంవలత్సరాకొకసారి కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా సందర్భంగా హరిద్వార్ సమీపంలోని జ్వాలాపూర్లో జరిగే భారీ ఊరేగింపులో పాల్గొనేందు వచ్చిన హిందూమత నాయకులకు, సాధు సంతలకు సంప్రదాయం ప్రకారం అంజుమన్ కాం గంథన్ పంచాయత్ కు చెందిన ముస్లిం పెద్దలు భక్తిపూర్వకంగా దక్షిణలు సమర్పించి వారి ఆశీస్సులు పొందుతారు. హిందూ సోదరులు వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని వారిని ఆశీర్వదిస్తారు. ముస్లిం పండుగలకు ఇక్కడి హిందూ నాయకులు శుభాకంక్షలు తెలిపి వారిని సత్కరిస్తారు. తరతరాలుగా ఈ సాంప్రదాయం సాగుతుంది.అలాగే మతసామరస్యం వర్ధిల్లుతుంది.

ఇక్కడ ఇంకా, మాయా దేవి టెంపుల్, మానస దేవి టెంపుల్, మరియు చండి దేవి టెంపుల్ కూడా కలవు. ఈ మూడు టెంపుల్ లు ఇండియా లోని 52 శక్తి పీఠాలలోనివి గా చెపుతారు.

మానసా దేవి టెంపుల్

మానసా దేవి టెంపుల్ హరిద్వార్ నగరానికి సుమారు 3 కి. మీ. ల దూరంలో కలదు. ఈ టెంపుల్ మానస దేవి కి అంకితం చేయబడినది. ఈమె వేదకాలం నాటి మహా రుషి కాశ్యప రుషి మానసిక కుమార్తె. ఈ దేవత నాగుల రాజు అయిన నాగ వాసుకి భార్య. ఈ టెంపుల్ శివాలిక్ కొండలలోని బిల్వ పర్వతంపై కలదు. ఈ టెంపుల్ లో రెండు విగ్రహాలు కలవు. వాటి లో ఒక దానికి అయిదు చేతులు, మూడు నొరులు వుండగా, మరొకదానికి ఎనిమిది చేతులు వుంటాయి

ఇండియా లోని 52 శక్తి పీఠాలలో ఒకటి అయిన ఈ సతి టెంపుల్ సిద్ధపీఠాల త్రిభుజం పై భాగాన కలదు. ఈ త్రిభుజంలో ముగ్గురు అమ్మలు అయిన, మాయా దేవి, చండి దేవి, మానస దేవి గుడులు కలవు. ఈ టెంపుల్ దర్శించే సమయంలో భక్తులు అక్కడ కల ఒక చెట్టుకు పవిత్ర దారాలు కట్టి తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. కోరిక తీరగాని, చెట్టునుండి దారపు ముడిని తీసి వేస్తారు. టూరిస్టులు ఈ టెంపుల్ ను కేబుల్ కార్ లో చేరవచ్చు . ఈ కేబుల్ కార్ ను ‘ దేవి ఉడాన్ ఖటోల ‘ అంటారు .

చండి దేవి టెంపుల్


చండి దేవి టెంపుల్ హరిద్వార్ లోని నీల్ పర్వత పై కలదు. ఇది దేశం లోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఈ టెంపుల్ దేశం లోని 52 శక్తి పీఠాల లో ఒకటి. దీనిని 1929 లో గతం లోని కాశ్మీర్ పాలకుడు నిర్మించాడు. అయితే ఈ టెంపుల్ లోని దేవతా విగ్రహాన్ని సుమారు 8 వ శతాబ్దం లో జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్టించారు.

జానపద గాధల మేరకు చండిక దేవి శుమ్భ మరియు నిశుమ్భ అనే రాక్షసులను వధించిన తర్వాత ఈ ప్రదేశం లో కొద్ది కాలం విస్రమించిందని కూడా చెపుతారు.

ఈ టెంపుల్ చేరాలంటే, హరిద్వార్ పట్టణం నుండి ఆటో లు, రిక్షాలు, తోన్గాలు లలో చేరవచ్చు. చండి ఘాట్ నుండి 3 కి. మీ. ల దూరం లో కల ఈ ప్రదేశానికి ట్రెక్కింగ్ మార్గం లో కూడా చేరవచ్చు. లేదా మరో మార్గం లో కేబల్ కార్ పై కూడా సుమారు 25 నిమిషాల లో చేరవచ్చు.

పురాణాల మేరకు పార్వతి రూపమైన సతి అనే దేవత తన తండ్రి తన భర్త శివుడిని అవమాన పరచడంతో తన జీవితాన్ని ఇక్కడ త్యాగం చేసిందని చెపుతారు. సతి మరణం శివుడిని కలవర పరిచిందని అపుడు శివుడు ఆమె మృత దేహాన్ని తీసుకొని కైలాష్ పర్వతానికి వెళ్ళాడని చెపుతారు. శివుడు ఆమెను తీసుకు వెళ్ళేటపుడు, ఆమె శరీర మృత భాగాలు అక్కడ వివిధ ప్రదేశాలలో పడ్డాయని కధనంగా కలదు. ఆ దేవత బొడ్డు మరియు గుండె పడ్డ ప్రదేశం లో సరిగ్గా మాయా దేవి టెంపుల్ నిర్మిత మైనదని చెపుతారు.   హరిద్వార్ ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం మాత్రమేకాక ఇక్కడ కల భారత్ హెవీ ఎలేక్ట్రికల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ కారణంగా పారిశ్రామిక నగరంగా కూడా చెప్పబడుతోంది. మొట్ట మొదటి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ లేదా ఐ ఐ టి రూర్కీ కూడా ఇక్కడే స్థాపించ బడింది.   పర్యాటకులు వాయు, రైలు, రోడ్డు మార్గాల లో తేలికగా హరిద్వార్ చేరవచ్చు. సమీప ఎయిర్ పోర్ట్ జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్. ఇది సుమారు 34 కి.మీ.ల దూరంలో కలదు. ఢిల్లీ లోని ఇందిరా గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఇక్కడకు తరచు విమాన సేవలు నడుపు తుంది. హరిద్వార్ లో రైలు స్టేషన్ కలదు. ఇక్కడి నుండి ఇండియా లోని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. రోడ్డు మార్గంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు కలవు. న్యూ ఢిల్లీ నుండి బస్సు లు తరచుగా నడుస్తాయి.   హరిద్వార్ లో వేసవులు వేడి గాను, వింటర్ అతి చలిగాను వుంటాయి. వర్షాకాలం తేమ అధికం. సందర్శనకు వర్షా కాలం సూచించ దగినది కాదు. హరిద్వార్ సందర్శనకు సెప్టెంబర్ నుండి జూన్ నెల వరకూ కల ఆహ్లాదకర సమయం సూచించదగినది.

%d bloggers like this: