హంపి – శిధిలాలలో సవారీ

హంపి పేరు వింటే చాలు వెంటనే మీకు విజయనగర పట్టణ అందచందాలు, వాటిని చుట్టుముట్టిన ప్రఖ్యాత శిధిలాలు గుర్తుకు వచ్చేస్తాయి. హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. ఈ పట్టణంలో హోయసలులనాటి శిల్ప సంపద కనపడుతూంటుంది. రాతి శిల్పాలైనప్పటికి సందర్శకులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి.  హంపి గురించిన కొన్ని వాస్తవాలు  హంపి ప్రాచీన పట్టణమే కాదను. దీనిని గురించి రామాయణంలో కూడా చెప్పబడింది. దీనిని ఆనాటి కాలంలో కిష్కింధ అనేవారని చరిత్ర చెపుతోంది. 13 నుండి 16 శతాబ్దాలవరకు విజయనగర రాజుల పాలనలో ఎంతో ఔన్నత్య స్దితిలో రాణించింది.   కర్నాటకకు ఉత్తర భాగాన బెంగుళూరుకు 350 కిలో మీటర్ల దూరంలో ఉంది. బెంగుళూరునుండి బస్సులు అనేకం. ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అంతర్జాతీయ సంస్ధ యునెస్కో గుర్తించింది. ప్రతి సంవత్సరం వేలాదిమంది పర్యాటకులు దీనిని దర్శిస్తారు. హంపి శిధిలాలు చూడాలంటే, స్ధానికంగా ఒక సైకిల్ అద్దెకు తీసుకొని దనిపై తిరుగుతూ చూస్తే పూర్తిగా వాటిని ఆనందించినవారవుతారు.   హంపి పట్టణం దాని శిధిలాలకంటే కూడా దాని మతపర చరిత్రకు ప్రాధాన్యత కలిగి ఉంది. ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. విరూపాక్ష దేవాలయం, విఠల దేవాలయం, ఆంజనేయాద్రి మొదలైనవి కలవు. కర్నాటకలోని ప్రధాన నదులలో ఒకటైన తుంగభద్ర ఈ పట్టణం గుండా ప్రవహిస్తుంది. ఎంతో ఆనందింపజేస్తుంది. హంపి పట్టణంలోని దేవాలయాల నిర్మాణానికి గాను విజయనగర రాజులు అక్కడి సమీప కొండల రాళ్ళను చక్కగా చెక్కించి నిర్మించారు.

హజరా రామాలయం

2. లక్ష్మీ నరసింహ ఆలయం

3. బాల కృష్ణ ఆలయం

4. అచ్యుత రాయ ఆలయం
5. మరి కొన్ని శివాలయాలు :-1.బడవి లింగ

2. విరూపాక్ష దేవాలయం

విరూపాక్ష దేవాలయం హంపిలో ఉన్నది. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుండి 350 km దూరంలో కలదు. ఇది హంపి వద్ద నిర్మాణ సమూహాలలోఒక భాగం. ఇది యునెస్కో ప్రపంచ హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియాకు ఎంపిక కాబడినది. విరూపాక్ష అనగా శివుని రూపం.

సుమారు పదిహేను వందల ఏళ్లనాటి ఆ ఆలయం అలనాటి అపురూప శిల్పకళావైభవానికి నిదర్శనం. విరూపాక్షాలయంతో బాటు విజయనగర సామ్రాజ్య స్థాపనకు ఆద్యుడైన విద్యారణ్యస్వామి వారి ఆలయం, గణపతి దేవాలయం, కోదండ రామాలయం, అచ్యుతరాయల గుడి, బదివి లింగం, ఉగ్రనరసింహస్వామి ఆలయాలతోపాటు గజశాల, రాణిస్నానపు గది, కమల మహల్, రాతిరథం, రామాయణ మహా కావ్యంలో వర్ణించిన పంపా సరోవరం, రుష్యమూక పర్వతం చూస్తుంటే వేల ఏళ్లనాటి సాంస్కృతిక వారసత్వం కనుల ముందు సాక్షాత్కరించి నట్లనిపిస్తుంది.

విరూపాక్ష దేవాలయం ప్రత్యేకత మొత్తం ఎత్తైన ఆలయ గోపురాలలోనూ, ప్రాకారాలలోనూ, సజీవ శిల్పాలలోనూ కనిపించి కనువిందు చేస్తుంది. విదేశీ యాత్రికులు, చరిత్రకారులు సైతం హంపీ విజయనగర సామ్రాజ్యంలోని విరూపాక్ష దేవాలయపు వైభోగాన్ని గురించి తెలిపారంటే ఈ ఆలయ ప్రాముఖ్యం ఎంతటిదో తెలుస్తుంది…

హంపి వీధి కి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం ఉన్నది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయం లోనికి స్వాగతం పలుకుతుంది. దేవాలయంలో ప్రధాన దైవం విరూపాక్షుడు(శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి గుడి, భువనేశ్వరీ దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7 వ శతాబ్ధం నుండి చరిత్ర ఉన్నది. విరూపాక్ష-పంపా ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్ధంకు చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా.

చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయసళులు పరిపాలనలో మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగ రాజుల కాలంలో నిర్మించారని అంటారు. విజయనగర రాజులు పతనమయ్యాక, దండయాత్రల వల్ల 16 వ శతాబ్ధానికి హంపి నగరం లోని అత్యద్బుత శిల్ప సౌందర్యం నాశమైపోయింది. విరూపాక్ష-పంపా ప్రాకారం మాత్రం 1565 దండయాత్రల బారిన పడలేదు. విరూపాక్ష దేవాలయంలో దేవునికి ధూప,దీప నైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. 19 వ శతాబ్ధం మొదలులో ఈ ఆలయం పైకప్పు పై చిత్రాలకు, తూర్పు , ఉత్తర గోపురాలకు జీర్ణోద్ధరణ జరిగింది.

ఆలయానికి ఉత్తర దిక్కున రత్నగిరి గోపురం, ఆ గోపురాన రత్నగర్భ వినాయకుడితో సహా మరికొన్ని సన్నిధులున్నాయి. విరూపాక్షాలయానికి వెనుకవైపున విద్యారణ్యస్వామివారి సన్నిధి ఉంది. ఇక్కడ ఒక చిత్రమేమిటంటే… విద్యారణ్యస్వామి ఆలయం ముందువైపున ఉన్న రాతిగుహలో శ్రీ విరూపాక్షస్వామి ముఖద్వార గోపురం తలకిందులుగా కనపడుతుంది. సూర్యుడెక్కడున్నా, ఏ వేళప్పుడైనా గోపుర బింబం మాత్రం చెక్కుచెదరకుండా స్థాణువులా అలాగే నిలిచి కనిపిస్తుంది.

ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురములోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి. మిగతా 7 ఖానాలు ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఈ తూర్పు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే బయటి నుండి ఆలయంలోకి వెళ్ళే మొదటి ప్రాకారం స్తంభాలు లేకుండా ఆకాశం కనిపించేటట్లు ఉంటుంది. ఈ ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్తే స్తంభాలతో కూడి కప్పబడిన వసారా ఉంటుంది. స్తంభాలతో కూడి ఉన్న వసారాలో చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. వీటిని కూడా దాటి లోపలి ప్రాకారంలోకి వెళ్ళితే గర్భ గుడి వస్తుంది.

తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెడుతుంది. ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీ కృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్తంభాల వసారాకూడా.

దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి బెంగళూరుకు రైళ్లు, విమానాలు ఉన్నాయి. అక్కడినుంచి హోస్పేటకు బస్సులు, రైళ్లు ఉన్నాయి. కొన్ని బస్సులు, రైళ్లు నేరుగా హోస్పేటకు వెళ్లేవి ఉన్నాయి. హోస్పేటనుంచి హంపీకి క్యాబ్‌లు లేదా ట్యాక్సీలలోలేదా . ప్రైవేటు వాహనాలలో వెళ్లవచ్చు. హంపీలో వసతి ఖరీదైనది.కానీచిన్న హోటళ్లు, లాడ్జీలు కూడా ఉన్నాయి.
ఈ లోపలి ప్రాకారంలోని స్తంభాల వసారాన్ని 1510 సంవత్సరములో కృష్ణదేవరాయలు కట్టించాడని కూడా శిలాశాసనాలు చెబుతున్నాయి. విరూపాక్ష దేవాలయంలోని బయటి ప్రాకారంలో ఏకశిలలో చెక్కబడిన నంది ఒక కి.మీ. దూరం వరకు కనిపిస్తుంది.  

పాతాళ శివాలయం

మరి కొన్ని విరూపాక్ష దేవాలయం చుట్టు పక్కలే 3, 4 కి.మి దూరంలో పైన చెప్పిన 4 విష్ణు ఆలయాలు ఉన్నాయి. అవి మొత్తం చాలా వరకు ధ్వంసమయ్యాయి. బహుమనీ సుల్తానులు దండయాత్ర చేసినపుడు 6 నెలల పాటు హంపిలో దొరికినంత దోచుకుని వీలైనంత వరకూ ఆలయాలను కూలగొట్టి, తగలపెట్టారని విన్నాను. చుట్టూ ఉన్న ఆలయాలను ధ్వంశం చేసినా మధ్యలో ఉన్న విరూపాక్ష ఆలయానికి ఏం నష్టం జరగలేదంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఎక్కడ వెతికినా థియరీలు మాత్రమే దొరుకుతాయి కానీ సరైన సమాధానం దొరకడం కష్టం. అలాంటి థియరీలు మూడు ఉన్నాయి. 1వ థియరీ విరూపాక్ష దేవాలయం 8,9 శతాబ్దాలలో బాదామి చాళుక్యుల చే నిర్మించబడిన ఆలయం. ఈ ఆలయాన్ని 14, 15వ శతాబ్దంలో రాజ్యాధికారంలోకి వచ్చిన తుళువ రాజులు బాగా అభివృద్ధి పరిచారు. ముఖ్యంగా శ్రీ కృష్ణ దేవరాయల పాలనలో ఈ దేవాలయాలు బాగా అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత కృష్ణదేవరాయల పాలనలో మిగతా ఆలయాలు నిర్మించబడ్డాయి. 1565 లో తల్లికోట యుద్ధం జరిగినప్పుడు బహుమనీ సుల్తానుల దండయాత్రలో ఆ ఆలయాలు, నగరమూ ధ్వంసం చేయబడ్డాయి. కానీ విరూపాక్ష దేవాలయం తుళువ రాజులు నిర్మించ లేదని అది వారికి చెందినది కాదని దానిని నాశనం చేయడం వలన వారికి ఒరిగేది ఏమీ లేదని అనిపించి బహుమనీ సుల్తానులు ఆ ఆలయాన్ని వదిలేసి ఉండొచ్చు. ఈ ఆలయం పక్కనే ఉన్న కడలేకలు గణపతి 15 అడుగుల విగ్రహాం యొక్క పొట్ట భాగాన్ని చెక్కి వేశారు. అటు పక్కనే ఉన్న లక్ష్మీ నరసింహ విగ్రహాన్ని ధ్వంసం చేసి, ఆయనకు ఎడమ వైపుగా ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని వేరు చేశారు. వీరి దాడిలో బాలకృష్ణ ఆలయం చాలా వరకు ధ్వంసమైంది. అయితే అక్కడి ప్రజలు, ఆలయ నిర్వాహకులు ముందుగా జాగ్రత్తపడటం వల్ల ఆ గుడిలోని మూర్తిని వేరేచోట భద్రపరిచారు. ఇప్పుడు ఆ మూర్తి మద్రాస్ మ్యూజియంలో ఉన్నట్లు చెబుతారు. ఇక్కడ కూడా నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే లక్ష్మీ నరసింహ ఆలయం బడవిలింగ ఆలయం రెండు పక్కపక్కనే ఉన్నాయి. రెండు ఆలయాలు ధ్వంసమైనా లక్ష్మీ నరసింహ మూర్తి ని ధ్వంసం చేశారు కానీ బడవిలింగా శివలింగంపై ఎటువంటి గీత పడలేదు !. ఇప్పటికీ అక్కడ పూజలు కోనసాగుతున్నాయి. 2వ థియరీ ఒక్కసారి కింద ఉన్న చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి.

మొదట అర్థచంద్రుడు , తర్వాత ఖడ్గము, తర్వాత వరాహము (పంది) , ఆ తర్వాత సూర్యుడు. ఇది విజయనగర సామ్రాజ్య జెండా. అంతేకాదు ఈ చిహ్నాన్ని ఆలయం పై కూడా చెక్కించారు. విధ్వంస కారులు మహమ్మదీయులు. వారికి అర్థచంద్రాకారం పవిత్రమైనది. ఇంకా పందిని చూడటం, దాని గురుతులు ఉన్న ప్రదేశంలో కాలు పెట్టడం వారు మహా అపరాధంగా భావించేవారు. కాబట్టి ఆ గుర్తులు ఉన్న విరూపాక్ష ఆలయం లోకి వెళ్లి ఉండరు. ఇది ఒక థియరి. కానీ అలా అనుకుంటే హంపి లో తుళువ రాజులు కట్టించిన మిగతా ఆలయాల దగ్గర కూడా ఇలాంటి జెండాలు ఎగురుతూ ఉండవచ్చు కానీ వాటికి ఎందుకు నష్టం వాటిల్లిందో అంతుచిక్కని సమాధానంగా ఉంది.   3వ థియరీ   పై రెండు థియరీలు సరైన వాటిగా తీసుకోలేని పక్షంలో ఇంకా ఒక్క థియరీ మాత్రమే ఉంటుంది. 1565 లో జరిగిన తల్లికోట యుద్ధం లో విజయనగర సామ్రాజ్యం పతనం ఐంది కానీ విరూపాక్ష దేవాలయం విషయంలో మాత్రం అప్పటి రాజులు ఏమైనా సంధి చేసుకుని ఉండవచ్చు. లేదా అక్కడి ప్రజలు, సైనికులు ప్రాణాలు ఒడ్డి బహుమనీ సుల్తానుల సైన్యానికి ఎదురునిలిచి గుడిని సంరక్షించుకుని ఉండవచ్చు. ఇది ఒక ఊహాజనితమైన థియరీ మాత్రమే. ఎందుకంటే ఆరు నెలల పాటు రాజ్యంపై పడి దొరికినవి దోచుకుంటూ ధ్వంసం చేసుకుంటూ పోయిన బహుమనీ సుల్తానులను అక్కడి ప్రజలు అయినా సైన్యం అయినా ఎంతకాలం అడ్డుకోగలదు ?!. ఇలా ఒక సమాధానం దొరికినట్టే ఉంటుంది వెంటనే దానికి ఇంకో ప్రశ్న పుట్టుకొస్తుంది. నాకు అనిపించింది ఏంటంటే 2వ థియరీలో చెప్పినట్లుగా విరూపాక్ష ఆలయం చెక్కుచెదరకుండా నిలవడానికి కారణం విజయనగర సామ్రాజ్య ముద్ర అయినా అయి ఉండొచ్చు, లేదా 3వ థియరీలో చెప్పినట్లుగా బహుమనీ సుల్తానులు విరూపాక్ష ఆలయాన్ని ఏం చేయకుండా ఉండడానికి ఏదైనా సంధి చేసుకుని ఉండవచ్చు, లేదా వారికీ వారుగానే ఆ ఆలయాన్ని వదిలేసి ఉండవచ్చు అని.   దేవాలయాలు, సహజ అందచందాలే కాక అక్కడ అనేక సరస్సులు కూడా ఉన్నాయి. అందమైన భవనాలను నర్మించారు. ఈ పట్టణ నిర్మాణంలో విజయనాగర రాజుల ఎంతో నేర్పరితనం ప్రణాళిక కనపడతాయి. 13 నుండి 15 శతాబ్దాలలోనే ఈ పట్టణంలో అనేక నేటి ఆధునిక నీటి ప్రణాళికా విధానాలు ఆచరించారు.   పర్యాటకులకు ఈ పట్టణంలో చూడాలంటే 500 ప్రదేశాలకు పైగా ఉన్నాయి. వాటిలో సుమారు 100 ప్రదేశాలు పర్యాటకులను అమితంగా ప్రతి ఏటా ఆకర్షిస్తున్నాయి. విఠల దేవాలయం వద్ద గల రాతి రధం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. విజయనగర రాజుల సాంప్రదాయాలను వెల్లడిస్తూంటుంది. దీనినే రాష్ట్ర టూరిజం శాఖ తన పర్యాటక చిహ్నంగా ఆమోదించింది.   తుంగభధ్రా నది ఒక వైపు, మూడు వైపుల కొడలు గల హంపి పట్టణాన్ని విజయనగర రాజులు ఎంతో ప్రణాళికగా తమ రాజ్య రాజధానిగా చేసుకొని పాలించారు. ఈ పట్టణాన్ని జయించటం శత్రురాజులకు అసంభవంగా భావించి వారు దీనిని ఎంపిక చేశారు. నేడు ఈ కొండ ప్రాంతాలు, చక్కటి నదీ ప్రవాహం పర్యాటకులకు ఎంతో ఆనందాన్నిస్తోంది. దక్షిణ భారత దేశానికి వచ్చిన పర్యాటకులు హోయసల శిల్ప సంపదలకు ప్రధానమైన హంపి పట్టణాన్ని తప్పక దర్శించి తీరాల్సిందే.  

ఎలా వెళ్లాలి?
కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిజిల్లా హోస్పేటకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది హంపీ. అంటే బెంగళూరు నుంచి 350 కిలోమీటర్లు పైగా ఉంటుంది. హైదరాబాద్‌ వాసులు బెంగళూరు నుంచి వెళ్లేబదులు నేరుగా అక్కడి నుంచే హోస్పేట వెళ్లడమే సులువు.

The By Air : Nearest airport is at Bellary and this is located 60 km away from Hampi. Hampi is well connected by roads and railways.
People in Andhra Pradesh can go by train rout : Vijayawada-Guntur-Vinukonda-Nandyala-Guntakal-Bellary-Hospet.
Hyderabad-deccan -Raichur- Bellary- Hospet

Related posts

%d bloggers like this: