Lakshadweep is a union territory of a group of 36 islands in the Arabian sea which is the most important Geopolitical and strategic location for India and the Indian Navy to consolidate its power in the Indian Ocean and the Arabian sea.
లక్ష ద్వీపాలను గతం లో లక్క దీవులు అని కూడా అనేవారు. ఇవి మొత్తంగా 39 అతి చిన్న దీవులు. ఇవి మారుతున్న ప్రపంచంలో అతి వేగంగా ఒక పర్యాటక ప్రదేశాలుగా మారిపోయాయి. ప్రత్యేకించి బీచ్ ల వెంట షికార్లు కొట్టి ఆనందించాలనుకునేవారికి ఇవి ఎంతో ఆనందాన్ని అందిస్తాయి. సుమారు 132 కి. మీ.ల కోస్తా తీరం కలిగి 4200 చ. కి. మీ.ల సముద్ర భాగం కలిగిన ఈ దీవులు మీకు అనేక వితలు, విశేషాలు, అంటే మీరు కోరే సాహస క్రీడలు, బీచ్ వినోదాలు, ఆనందాలు అందిస్తాయి. తెల్లగా మెరుస్తున్న తెల్లని ఇసుక తిన్నెలు, దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్యాల వృక్షాలు, స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలి, పర్యాటక శాఖ అభివృద్ధి చేసిన అంతర్జాతీయస్థాయి హాలిడే రిసార్టులతో కనువిందు చేస్తున్న ఈ ప్రదేశాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఏర్పడిన ముక్కలు ఈ దీవులు… అని అధ్యయనకారుల అంచనా. లక్షదీవులు పర్యాటక పరంగా పేరు పొందినవి. కొన్ని దీవులను పూర్తిగా టూరిస్టు రిసార్టులు, వాటర్ స్పోర్ట్స్ కోసమే డెవలప్ చేశారు. ఇలాంటి దీవుల్లో నివసించేవాళ్లంతా పర్యాటకశాఖ ఉద్యోగులే.
వలయాకారంగా ఉండే పగడపు దీవుల్లోకి విహారానికి వెళ్లడం ఒర అద్భతమైన అనుభూతి. సముద్రపు నీటి లోపలికి దూసుకెళ్లే స్కూబా డైవింగ్ను తలుచుకుంటేనే కళ్లు మెరుస్తాయి. సముద్రజీవరాశులను దగ్గరగా చూడడానికి పెద్దవాళ్లు ట్యూబ్లో వెళ్లి సంతోషపడుతుంటే… యూత్ మాత్రం అంతరిక్ష చోదకుల్లాగ ఒళ్లంతా కప్పేసే వాటర్ప్రూఫ్ దుస్తులు ధరించి, ఆక్సిజన్ మాస్క్ తగిలించుకుని, కళ్లకు స్విమ్మింగ్ గాగుల్స్ పెట్టుకుని జలచరాల్లా నీటిలో చక్కర్లు కొడుతూ ఆనందిస్తుంటారు. అగట్టి, బంగారం దీవుల్లో స్కూబా డైవింగ్ స్కూళ్లున్నాయి.
ఒక్కో దీవిలో పర్యటిస్తూ ఆ దీవిని చూసిన తరువాత, ఫెర్రీ ఎక్కి మరో దీవిలోకి అడుగుపెడితే అక్కడ పర్యాటకులు వాటర్ సర్ఫింగ్కి సిద్ధమవుతుంటారు. నీటి మీద అలలతో పోటీ పడుతూ ఎగిరి గంతులేయడం, స్వీయానుభవం లేని వాళ్లకు అలలతో ఆడుకోవాలనే సరదా ఉన్నవారికి ట్రైనర్లు ‘సర్ఫింగ్ బోర్డు మీద ఎలా నిలబడాలి, అల వస్తున్న దిశకు అనుగుణంగా ఎలా కదలాలి…’ వంటి ప్రాథమిక విషయాల్లో శిక్షణనిచ్చి నీటి మీదకు పంపిస్తారు. పొరపాటున నీటిలో పడిపోయినా వెంటనే బయటకు తీసుకొస్తారు.
ఒకసారి పట్టుతప్పి నీటిలో పడిపోయిన వాళ్లు బయటకు వచ్చి ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుని ఒడ్డున కూర్చోరు. కొంచెం తేరుకోగానే మళ్లీ నీటిలోకి పరుగులు తీస్తారు. ఆశ్చర్యకరంగా రెండోసారికి ఒడుపు తెలిసిపోయి అలలతో ఆడుకుంటారు. మరో దీవిలోకి అడుగుపెడితే అక్కడ కొంతమంది పర్యాటకులు కేయాకింగ్(తెడ్డు పడవ) తో గాలికంటే వేగంగా నీటి మీద సాగిపోతుంటారు. ఇంతమంది ఇన్ని సాహసోపేతమైన ఆటలు ఆడుకుంటూ సముద్రాన్ని తలకిందులు చేస్తున్నప్పటికీ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అగట్టి, అమిని, అండ్రాట్, బిట్రా, చెట్లాట్, కాడ్మాట్, కాల్పెనీ, కరావట్టి, కిల్టాన్, మినికోయ్… ఈ దీవులన్నింటినీ ఒక రోజులో చుట్టేయవచ్చు.
ఇంకా కామత్ ఐలాండ్లో కానోయింగ్, యాచింగ్, కాయాకింగ్, స్నోర్కెలింగ్, విండ్ సర్ఫింగ్, వాటర్ స్కీయింగ్, స్కూబా డైవింగ్ వంటి చాలా రకాల వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. ఇంకా చూడవలసినవి…. హజ్రత్ ఉబాయిదుల్లా సమాధి, కరావట్టి మసీదు, కరావట్టి అక్వేరియం, బుద్ధిస్ట్ ఆర్కియోలాజికల్ మ్యూజియం, ట్యూనా క్యానింగ్ ఫ్యాక్టరీ ప్రధానమైనవి.
సముద్రంలో ఎన్ని రకాల జీవరాశులుంటాయో కదా! అని చూస్తే చేపలు రకరకాల ఆకారాల్లో కనిపిస్తాయి. చేపల్లో ఇన్ని రకాలుంటాయా అని ఆశ్చర్యపోవడం మన వంతైతే సెప్టెంబరు నుంచి డిసెంబర్ మధ్యలో వచ్చిన పర్యాటకులకు షార్క్ చేపలు కూడా హలో చెప్తాయి.
ఈ కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని కరావట్టి దీవి. అరేబియా సముద్రంలో ఆఫ్రికా – ఆసియా ఖండాల వ్యాపార మార్గంలో ఉన్నాయి లక్షద్వీప్ దీవులు. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారత తీరాన్ని చేరింది కూడా ఈ దీవుల మీదుగానే. వీటి పేరు లక్షదీవులు… అనే కానీ మనదేశంలోని యూనియన్ టెరిటరీల్లో చిన్నది ఇదే. భూభాగం అంతా కలిపితే విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లకు మించదు. ఒక మోస్తరు పెద్ద దీవులు 36 ఉన్నప్పటికీ పది దీవులే జనావాసాలు. పది సబ్ డివిజన్లతో ఒకే ఒక జిల్లా ఇది. జనాభా పది దీవుల్లో కలిసి 65 వేలకు మించదు. స్థానికుల్లో ఎక్కువ శాతం మలయాళీలే. అధికార భాష కూడా మలయాళమే, మినికోయ్ దీవిలో నివసించే వాళ్లు మాత్రం మహిల్ భాష మాట్లాడుతారు. ఇది మాల్దీవుల్లో మాట్లాడే భాష. ఈ దీవి మిగిలిన దీవుల సమూహానికి దూరంగా విసిరేసినట్లు ఉంటుంది. ఇక్కడి ప్రజల జీవనశైలి మిగిలిన దీవులకు భిన్నంగా ఉండదు, కానీ భాష వేరు.
లక్షద్వీప్ దీవుల్లో మనుష్య సంచారం లేని చిన్న చిన్న దిబ్బల్లాంటివి లెక్కలేనన్ని ఉంటాయి. కొన్ని దీవుల్లోకి పగడాల వేటగాళ్లు మాత్రమే అడుగుపెడుతుంటారు. లక్షద్వీప్ దీవుల్లోని స్థానికులకు చేపల వేట, కొబ్బరి తోటల సాగు, కొబ్బరి పీచు తీయడం ప్రధాన వృత్తులు. అత్యంత ఖరీదైన ‘ట్యూనా ఫిష్’ ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో ఎగుమతి అవుతుంది.
లక్షద్వీపాల చరిత్ర పరిశీలిస్తే, భారత దేశం ఆగష్టు 15, 1947 నాడు స్వాతంత్రం పొందిన తర్వాత అప్పటి వరకు బ్రిటిష్ వారి ఆధిపత్యం లో వున్న ఈ దీవులు ఇండియన్ యూనియన్ లో చేరాయి. అయితే, ఈ ద్వీపాలలో ప్రధానంగా ముస్లిం ప్రజలు అధికంగా వుండటం చేత, ఈ దీవుల పై ఆధిపత్యాన్ని పాకిస్తాన్ కోరుతుందని భావించారు. వెంటనే, భారత దేశ హోం మంత్రి భారత నౌకా దళ ఓడలను అక్కడ కు పంపి భారత దేశ జాతీయ జండా ను ఎగుర వేయించారు. దాని తర్వాత పాకిస్తాన్ నౌకా దళం కూడా ఆ ప్రాంతం లో అవకాశాల కొరకు సంచరించింది. నేడు లక్ష ద్వీపాలు , ఇండియన్ నేవీ కి ఒక బేస్ గా వుంది మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుండి ఇండియా కు వచ్చే ముప్పు ను పరి రక్షించేవి గా వున్నాయి.
ఆగట్టి ద్వీపం
ఆగట్టి ద్వీపాన్ని లక్షద్వీప దీవుల గేటు వే గా పిలుస్తారు. భారత దేశం నుండి వెళ్ళే ప్రయాణికులు విమానం లేదా నౌకా ప్రయాణం ఏదైనప్పటికీ తప్పక ఈ ప్రాంతం చేరాల్సిందే. ఇక్కడ కల విమానాశ్రయం కు కోచి మరియు బెంగుళూరు ల నుండి నేరు విమానాలు కలవు. ఆగట్టి దీవి విస్తీర్ణం సుమారు నాలుగు చ. కి. మీ. ల కంటే కొంచెం తక్కువే. ఇక్కడ రెండు రిసార్ట్ లు కలవు. ఒక సన్నని రోడ్డు మార్గం మీకు ద్వీపం అంతా చూపుతుంది. కనుక ఒక మంచి మోటార్ బైక్ పై ప్రయాణించటం మేలు.
కవరత్తి లక్ష ద్వీపాలలో వినోదానికి కవరత్తి ప్రధాన కేంద్రం గా వుంది. ఇండియా లోని కోచి పట్టణానికి 360 కి. మీ.ల దూరం లోను ఆగట్టి ద్వీపానికి 50 కి. మీ.ల దూరం లోను కలదు. ఇండియా నుండి బోటు లో లేదా ఆగట్టి నుండి హెలికాప్టర్ లో చేరవచ్చు. కరవట్టి లక్ష ద్వీప్ దీవుల సముదాయానికి హెడ్ క్వార్టర్స్ గా పని చేస్తుంది.
నీటి క్రీడలకు ప్రసిద్ధి గాంచిన కరవట్టి దీవి లో ప్రజలు సుమారు 10,000 మంది వుంటారు. షాపింగ్ ప్రదేశాలు, కొన్ని హెరి తేజ్ , మ్యూజియం, ప్రదేశాలు కలవు. మసీదులు కూడా కలవు. కరవట్టి బీచ్ లు వేలాది ప్రజలను ప్రతి సంవత్సరం అక్కడ కల చక్కని రెస్టారెంట్ లు షాక్ లు కారణం గా ఆకర్షిస్తాయి. ఈ ద్వీపం సుమారు 4.22 చ.కి. మీ.విస్తీర్ణం కలిగి అతి తక్కువ సమయం లో చూసేది గా వుంటుంది. రోడ్లు బాగుంటాయి. బైక్ లు అద్దెకు తీసి తిరగవచ్చు.
అనుభవజ్ఞులైన డైవర్లు లక్షద్వీపాలలో గల బీచ్ ల డైవింగ్ ఎంతో ఆనందం ఇచ్చేదిగా భావిస్తారు. అందమైన ఇసుక తిన్నెలు, గల గల మనే చేపల గుంపులు, తాబేళ్లు, అక్కడ కల అనుభవం కల డైవర్లు అన్నీ కూడా డైవింగ్ ఆనందింప చేస్తాయి. సాధారణంగా డైవింగ్ ను 30 మీటర్ల తోతు వరకు అనుమతిస్తారు. కొన్ని మినహాయింపు కేసుల లో అంటే మే నెల 15 నుండి సెప్టెంబర్ నెల 15 వరకు టూరిస్టులు డి కంప్రెషన్ చాంబర్ ను వినియోగించుకునేటం దుకు అనుమతిస్తారు. స్కూబా డైవింగ్ లో పూర్తి అనుభవం వున్న వారైతే, ఈ ద్వీపం వారి ప్రయోగాలకు మరింత సహకరిస్తుంది. డైవింగ్ మాస్క్ ల తో మరింత లోతుల లోకి కూడా వెళ్ళవచ్చు. ఇక్కడి సముద్ర భాగాలు నీలి రంగు లో వుండి అందులోని పగడాలు మెరుస్తూ వుంటాయి. లక్షద్వీపాల లోని రిసార్ట్ లు మీకు మరువలేని సౌకర్యా అనుభూతులు కలిగించగా, అక్కడి బీచ్ లు పాల తెలుపు రంగు తో చుట్టూ తాటి చెట్లు, కొబ్బరి చెట్లు కలిగి కన్నుల పండువచేస్తాయి. లక్షద్వీపాల పర్యటన మిమ్మల్ని ఆనంద అనుభూతులతో తేలియాడ చేసి, నిస్సందేహంగా భారత దేశం మీకు అందించే గొప్ప అనుభవంగా భావింప చేస్తుంది.
ఎలా వెళ్లాలి?
విమానంలో… లక్షద్వీప్కు దగ్గరగా ఉన్న తీరం కేరళలోని కొచ్చి నగరం. కొచ్చి నుంచి అగట్టి దీవికి ఇండియన్ ఎయిర్లైన్స్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అగట్టి ద్వీపంలో దిగిన తర్వాత ఇతర దీవులకు వెళ్లడానికి హెలికాప్టర్, ఫెర్రీ, షిప్, మిషన్బోట్ సౌకర్యం ఉంటుంది. దీవిలోపల తిరగడానికి ఆటోరిక్షాలు, క్యాబ్లు ఉంటాయి.
రైలు మార్గం… కొచ్చి వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి విమానం లేదా షిప్లో లక్షద్వీప్ చేరాల్సి ఉంటుంది.
సముద్రమార్గం…
లక్షద్వీప్ పర్యాటక శాఖ కొచ్చి నుంచి అగట్టి దీవికి షిప్ క్రూయిజ్ నడుపుతోంది. ‘ఎం.వి. టిప్పు సుల్తాన్, ఎం.వి. భరత్సీమ, ఎం.వి. ఆమినిదీవి, ఎం.వి. మినికోయ్’ అనే నాలుగు క్రూయిజ్లున్నాయి. వీటిలో ప్రయాణానికి లక్షద్వీప్ అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎయిర్కండిషన్ క్రూయిజ్లే.
వసతి సౌకర్యం?
సీషెల్స్ బీచ్ రిసార్టు, ఐలాండ్ హాలిడే హోమ్, లక్షద్వీప్ హోమ్స్టే, కోరల్ ప్యారడైజ్, కాడ్మట్ బీచ్ రిసార్టు వంటివి చాలా ఉన్నాయి. ఒక రోజుకు ఐదు వందల రూపాయలు వసూలు చేసే గెస్ట్ హౌస్ల నుంచి ఐదు వేలు చార్జ్ చేసే రిసార్టుల వరకు ఉన్నాయి.
ఆహారం…….
ఈ ప్రదేశం కేరళకు దగ్గరగా ఉండడంతో ఆ ప్రభావం ఆహారం మీద కూడా ఉంటుంది. కొబ్బరి వాడకం ఎక్కువ. వంటల్లో సుగంధద్రవ్యాల వినియోగమూ ఎక్కువే. రెస్టారెంట్లలో ప్రధానమైన మెనూలో సీఫుడ్ రకాలు ఎక్కువగా కనిపిస్తాయి. శాకాహారం కూడా దొరుకుతుంది. కేరళ నుంచి టిన్డ్ ఫుడ్ వస్తుంది.
You must log in to post a comment.