యమునోత్రి – యమునా నది పుట్టిన స్థలం

యమునోత్రి అనే ప్రదేశం పవిత్ర యమునా నది పుట్టిన స్థలం. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3293 మీ.ల ఎత్తులో బందర్ పూంచ్ పర్వతం పై కలదు. భౌగోళికంగా యమునా నది చంపసర్ గ్లేసియర్ నుండి పుడుతుంది. ఈ గ్లేసియర్ సముద్ర మట్టానికి 4421 మీ. ల ఎత్తున కలదు. ఈ గ్లేసియర్ యమునోత్రి నుండి ఒక కి. మీ.దూరంలో కలదు. ఇక్కడకు చేరటం చాలా కష్టతరం. ఈ ప్రదేశం ఇండియా -చైనా సరిహద్దు లో కలదు. యమునోత్రి వరకు ట్రెక్కింగ్ చేయాలంటే ఒక రోజు పడుతుంది. మార్గం అంతా అడవుల తో నిండిఎత్తు పల్లాలు గా వుంటుంది. ఈ పవిత్ర క్షేత్రాన్ని చేరేందుకు భక్తులు గుర్రాలు, కంచర గాడిదలు ఉపయోగిస్తారు.  

yamunotritemple

యమునా నది జన్మించిన ఈ ప్రదేశములో యమునాదేవి ఆలయము ఉంది.  ఈ టెంపుల్ లో మాత యమునోత్రి పూజించ బడుతుంది. జానకి చట్టి వద్ద కల వేడి నీటి బుగ్గలు కూడా ఈ ప్రాంతపు ప్రధాన ఆకర్షణలలో ఒకటి. వాటి లో సూర్య కుండ్ వేడి నీటి బుగ్గ ఒకటి. ఇక్కడ ప్రసాదం తయారు చేసేందుకు అవసరమైన రైస్ మరియు పొటాటో లు ఒక తెల్లటి గుడ్డలో పెట్టి ఈ వేడి నీటి బుగ్గ నుండి వచ్చే వేడి నీటి లో ఉడికిస్తారు. ఈ ఆలయం టెహ్రీ గార్వాల్ మహారాజాచే నిర్మించబడినదని కథనం. ప్రస్తుత ఆలయం జయపూర్ మహారాణి గులారియా 19వశతాబ్ధంలో నిర్మించబడింది.పాత ఆలయం వాతావరణం మరియు ఇతర కారణాల వలన శిధిలస్థితికి చేరుకున్న తరువాత జయపూరు రాణిచే ఆలయం పునర్నిర్మించబడింది. కొన్ని చిన్న చిన్న ఆశ్రమాలు మరియు గెస్ట్‌హౌసులు కాక ఆలయసమీపంలో నివసించడానికి వసతులు తక్కువ. యాత్రీకులు సమీపంలోని రాణిచెట్టి తదితర ప్రాంతాలలో బసచేసి ఆలయానికి చేరి నదీమాతను దర్శించి వెనుతిరుగుతుంటారు. ఇక్కడి ఉష్ణకుండ స్నానం యాత్రీకుల శ్రమాంతర ప్రయాణానికి కొంత సేదతీరుస్తుంది.

యమునా నది కథనం
సూర్యుని భార్య అయిన సంధ్యాదేవికి ముగ్గురు సంతానం. వారు శని,యముడు మరియు యమున. సంధ్యాదేవి సూర్యతాపానికి ఓర్వలేక తన ఛాయను తన స్థానంలో తన ఛాయను ఉంచి తపమాచరించడానికి వెళ్ళింది. తరువాత ఛాయాదేవి సంధ్యాదేవి కుమారుల పట్ల కొంత అశ్రద్ధను చూపించసాగింది. ఒక రోజు ఛాయాదేవి తన కుమారులకు ఆహారాన్ని అందించి సంధ్యా దేవి సంతానానికి ఆహారాన్ని అందించడానికి నిరాకరించడంతో శని కోపించి ఛాయాదేవిని కాలితో తన్నాడు. ఛాయాదేవి కోపించి శనిని కుంటివాడివికా శపించింది.ఇది గమనించిన సూర్యుడు శనిని తల్లిని తన్నిన కారణమడిగాడు,శని చెప్పినది విని సూర్యునికి ఛాయా దేవి మీద సందేహం కలిగి కన్న తల్లివైతే ఇలా చేయవు అసలు నీవెవరు అని ఆమెను నిలదీయగా తను సంధ్యను కానని ఆమెచే నియమించబడిన ఛాయాదేవినని నిజం చెప్పింది. ఈ సంఘటన తరువాత శని యముడు ఆప్రదేశాన్ని విడిచి పోతారు. యముడు శివునికి సహాయంగా మరణానంతరం ప్రాణులకు పాపం చేసినందుకు దండననిచ్చే నరకాధిపతి అయ్యాడు. దండన ఇవ్వడంలో సమానంగా వ్యవహరిస్తాడని పురాణ కథనం. అన్నదమ్ముల వియోగాన్ని సహించలేక యమున కన్నీరు మున్నీరుగా ఏడ్వగా ఆమెకన్నీరు నదిగా ప్రవహించినట్లు పురాణ కథనం కొన్నిచోట్ల ప్రచారంలో ఉంది.

గుడికి చేరే మార్గాలు
యమునోత్రి ఆలయం చేరడానికి హనుమాన్ చెట్టి జానకి చెట్టి వరకు వ్యానులు వెళతాయి.అక్కడినుండి గుర్రం,డోలీ ,బుట్ట మరియు కాలి నడకన ఆలయం చేరుకోవాలి.డోలీ,గుర్రం,బుట్టలలో తీసుకు వెళ్ళడానికి భారత ప్రభుత్వం నిర్ణయించిన వెలకు ధనం చెల్లించాలి. అక్కడక్కడ విశ్రాంతి కోసం ఆగినప్పుడు డోలీవాలాలూ గుర్రాలను నడిపే వారు బుట్టలలో గుడికి చేర్చే వాళ్ళ కోరికను అనుసరించి వారికి ఆహార పానీయాల ఖర్చు యాత్రీకులు భరించడం ఒక ఆనవాయితీ. ఇక్కడ యాత్రీకులను ఆలయానికి చేర్చే పనిలో ఘడ్వాల్,మరియు బర్గూరు నుండి పనివాళ్ళు వస్తూ ఉంటారు.ఆలయానికి కొంచందూరం నుండి యాత్రీకులు కాలినడకన గుడిని చేరాలి. డోలీ నడిపే వారిలో ఒకరు యాత్రీకులకు తోడుగా వచ్చి దర్శనానికి సహాయం చేస్తారు.వారు తిరిగి యాత్రీకులను డోలీ వరకు తీసుకు వచ్చి బయలుదేరిన ప్రదేశానికి యాత్రీకులను చేరుస్తారు.అక్కడినుండి తిరిగి హనుమాన్ చెట్టి వరకు వ్యానులలోనూ,జీపులలోనూ చేరాలి.ఇవి బాడుగకు సులువుగానే లభిస్తాయి.     యమునోత్రి సమీపంలో ఖర్సాలి అనేఒక చిన్న గ్రామం కలదు. ఇక్కడ అనేక జలపాతాలు,సహజ నీటి బుగ్గలు, ఒక పురాతన శివాలయం కలవు. ఇక్కడ ఒక పవిత్ర ఫలకం దివ్య శీల పేరుతో యమునోత్రి టెంపుల్ కు సమీంలో కలదు. భక్తులు ఈ యమునోత్రి టెంపుల్ కు వెళ్ళే ముందు ఈ దివ్య శిలను పూజిస్తారు. యమునోత్రి వెళ్ళే భక్తులు చాలామంది ధరసు నుండి 40 కి. మీ. ల దూరంలో కల బద్కోట్ వద్ద విశ్రాంతి తీసుకుంటారు. అందమైన ఆపిల్ తోటలతో పాటు, ఈ ప్రదేశంలో అనేక పురాతన టెంపుల్స్ కూడా కలవు. యమునోత్రి లో హనుమాన్ చట్టి మరొక ఆకర్షణ. ఇది ఒక ట్రెక్కింగ్ సైట్ కూడాను. యమునోత్రి విమానం పై వెళ్ళాలంటే టికెట్ లను డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ లో బుక్ చేసుకోవాలి. ఈ ప్రదేశానికి సమీప రైలు స్టేషన్ లు రిషికేష్ మరియు డెహ్రాడూన్. సమీప నగరాల నుండి యమునోత్రి కి బస్సు సర్వీస్ లు కూడా కలవు. హనుమాన్ చట్టి వరకు చేరటానికి టాక్సీ సర్వీస్ లు కలవు. అక్కడ నుండి యమునోత్రి కి ట్రెక్కింగ్ చేయాలి. యమునోత్రి లో వర్షాలు చాలా తక్కువ. వేసవులు ఏప్రిల్ నుండి జూలై వరకూ వుంటాయి. శీతాకాలం లో ఈ ప్రాంతం లో అధిక హిమపాతం వుంటుంది. ఉష్ణోగ్రతలు జీరో కంటే కూడా తక్కువగా పడి పోతాయి. యమునోత్రి సందర్శనకు మే – జూన్ మరియు సెప్టెంబర్ – నవంబర్ నెలలు అనుకూలమైనవి గా వుంటాయి.   How to go : Yamunotri Temple is in Uttarkashi district of Uttarakhand. No roads to Yamunotri temple, so it has to be reached by trekking for a few kilometers. Nearest places Rishikesh, Haridwar, Dehradun.
13 kms from Hanuman Chatti town and 6 kilometers from janki chetty. Horses and pallakis are available for rent.
The hike from Hanuman Chatti to Yamunotri is very picturesque with beautiful views of a number of waterfalls.

%d bloggers like this: