
మోటేరా స్టేడియంకు, క్రికెట్ రికార్డులకు అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ నెలకొల్పినన్ని రికార్డులు ప్రపంచంలో మరే క్రికెట్ మైదానంలోనూ నెలకొల్పి ఉండరు.
1983 ఫిబ్రవరిలో అప్పటి భారత రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్.. అహ్మదాబాద్‌కు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న మోటేరా గ్రామం సమీపంలో గుజరాత్ క్రికెట్ అసోసియేన్ స్టేడియంకు పునాదిరాయి వేశారు. తరువాత సరిగ్గా తొమ్మిది నెలలకు, అదే ఏడాది ఈ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ఇండియా, వెస్టిండీస్‌ల మధ్య జరిగింది.
38 ఏళ్ల క్రితం భారత్‌లో తొమ్మిది నెలల్లో ఒక క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకోవడం అనేది ఊహకందని విషయం. శర వేగంతో పనులు పూర్తి చేసుకుని రికార్డ్ టైమ్‌లో మోటేరా స్టేడియం తయారైంది. ఈ స్టేడియం రికార్డుల జాబితాలో అది మొదటి రికార్డ్. అప్పట్లో ఈ స్టేడియం ఇన్ని రికార్డులకు వేదిక అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పుడు 2021లో మనం కచ్చితంగా చెప్పొచ్చు.. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని రికార్డులు నమోదవుతాయని.
2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఫిబ్రవరి 24న ఈ స్టేడియంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గతంలో దీనికి సర్దార్ పటేల్ గుజరాత్ స్టేడియం అని నామకరణం చేశారు. కానీ, అందరూ మోటేరా స్టేడియం అనే పిలుస్తారు. అయితే, తాజాగా ఈ మైదానం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మారుస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
దీని సామర్థ్యం మరొక రికార్డ్. 1,10,000 మంది ప్రేక్షకులు కూర్చోగలిగేలా ఈ స్టేడియంను నిర్మించారు. దీంతో, ఇప్పటివరకూ ప్రపంచంలో అతి పెద్ద స్టేడియంగా ప్రాచుర్యంలో ఉన్న మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం రెండో స్థానానికి వెళ్లిపోయింది.
You must log in to post a comment.