ముంబై నగరం పేరు చెప్పగానే ఫ్యాషన్లు, బిజీగా వుండే జీవన విధానం గుర్తుకొస్తాయి. ఆ వెంటనే బాలీవుడ్ సినిమాలు, ప్రసిద్ధ నటీ నటులు కూడా గుర్తుకు వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రపంచానికి అమెరికా దేశం కల వలే ఎలా ఉంటుందో, భారత దేశానికి ముంబై అలాగుంటుంది. ముంబై నగర ప్రాధాన్యతలు వివరించాలంటే అక్కడకల వివిధ మతాల ప్రజలు, వివిధ ప్రదేశాలు మరియు అక్కడి ప్రజల మతపర పూజలు మరియు స్ధానికంగా లభించే అనేక రకాల ఆహారాలు మొదలైనవాటిపై ఆధారపడి ఉంటాయి. ముంబై నగరం దేశంలోని వివిధ ప్రాంతాలకు రోడ్డు, రైలు, సముద్రం మరియు విమాన మార్గాలద్వారా కలుపబడి ఉంది. మీరు ముంబై నగరం చేరుకోగానే ఆ నగర వేష భాషలు దేశంలోని ఇతర ప్రాంతాలకంటే విభిన్నంగా ఉండటాన్ని గమనిస్తారు. ప్రతి ఒక్కరూ ఎంతో స్నేహ పూరితంగా ఉంటారు. ఒక రకమైన క్రమశిక్షణ ప్రతి అంశంలోను అంటే జనసమ్మర్ద వీధులలో టాక్సీలు సంచరించడం దగ్గరనుండి విమానాశ్రయాలలో విమానాలు విహరించటం వరకు ఎంతో పద్ధతిగా సాగిపోతూంటుంది. ముంబైనగరం ఇంతవరకు భారత దేశంలో ఒక విశిష్ట పర్యాటక ప్రదేశంగా పర్యాటకులచే గుర్తించబడుతోంది. ముంబై నగరంలో మీకు అన్నీ లభ్యమవుతాయి. తినే ఆహారాలు, షాపింగ్ నుండి సైట్ సీయింగ్ నుండి ఎంతో ఘనంగా చెప్పుకునే రాత్రి జీవిత విధానాలవరకు మీకు ఈ నగరం అందిస్తుంది. నగరం అందించే అనేక ప్రసిద్ధ బ్రాండు వస్తువులే కాక మీరు ఫ్యాషన్ స్ట్రీట్ లోను మరియు బంద్రాలోని లింకింగ్ రోడ్ లోను రోడ్ సైడ్ షాపింగులు చేసి ఆనందించవచ్చు. ఎండవేళ మధ్యాహ్నాలు బీచ్ లలో ఆనందించవచ్చు. పిక్ నిక్ లు పెట్టుకోవచ్చు. బీచ్ లలోని ఆహారాలు సిగ్నేచర్ శాండ్ విచ్ లు, కుల్ఫి, ఫలూదా, పానీ పూరి లేదా మహారాష్ట్ర స్వంత వంటకం వడా పావు వంటివి వివిధ రకాలుగా తినవచ్చు. ముంబైలో మొత్తంగా 3 ప్రధాన బీచ్ లు కలవు. జుహూ బీచ్, చౌపట్టీ మరియు గొరాయ్. ప్రకృతి అంటే ఇష్టపడేవారికి అధిక జనాలు ఇష్టపడని వారికి గోరాయ్ బీచ్ మంచి ఆనందం ఇస్తుంది. సిద్ధి వినాయక దేవాలయాలను రద్దీ కారణంగా మంగళవారాలలోను, గురువారాలలోను దర్శించకుండా ఉండటం మంచిది. మతపర విషయాలపట్ల ఆసక్తి కలవారికి, ముంబై లో దేశంలోనే పవిత్రమైన పుణ్య క్షేత్రాలు కలవు. గణేశ భగవానుడు కల సిద్ధి వినాయక దేవాలయం, హాజీ ఆలీ మసీదు వంటి పవిత్ర ప్రదేశాలు ఆధ్యాత్మికులు మరువలేని అనుభవాలు అందిస్తాయి. వీటి కళా నైపుణ్యం మీరు చూస్తే తప్పక ప్రశంసిస్తారు. రెండూ కూడా ఒక దానిని మరొకటి పోలి ఉంటాయి. ఈ ప్రదేశాలు విపరీతమైన రద్దీగా ఉండటం చేత, కొత్తగా సందర్శించేవారు వారి వారి సంబంధిత వ్యక్తులపట్ల జాగ్రత్త వహించాలి. లేదంటే తప్పిపోయే అవకాశం కూడా ఉంటుంది.
సిద్ధి వినాయకా దేవాలయం
సిద్ధి వినాయకా దేవాలయం, ముంబాయి : గణేశునికి అంకితం చేయబడిన ఈ దేవాలయం ముంబాయిలోని (మహారాష్ర్ట) ప్రభాదేవిలో ఉంది. ఈ దేవాలయం 1801 వ సంవత్సరం నబవంబర్ 19న లక్ష్మన్ విటు, దబాల పాటిల్ అనువారిచే నిర్మించబడినది. ఈ దేవాలయం కట్టబడినప్పుడు చిన్న మండపం మరియు చెక్క తలుపులు కలిగి యున్నది. హనుమాన్ మందిరాన్ని కూడా ఇక్కడే దర్శించవచ్చు. కాల్రకమంలో ఈ దేవాలయం వృద్ధి చేయబడినది.
For full details visit official site : www.siddhivinayak.org
గేట్ వే ఆఫ్ ఇండియా ప్రసిద్ధి గాంచిన శిల్పకళా అద్భుతం గేట్ వే ఆఫ్ ఇండియా దాని 8 అంతస్తుల ఎత్తుతో ముంబై లోని కొలబాలో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనిని హిందు మరియు ముస్లిం శిల్పశైలులుగా కలిపి నిర్మాణం చేశారు. 1911 లో ఆ నాటి రాజు సందర్శనలో గుర్తుగా దీనిని నిర్మించారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నిలుచుని మీరు ఒక ఫొటో తీయించుకోకపోతే మీ ముంబై ట్రిప్ వృధాగా భావించాల్సిందే. గోట్ వే ఆఫ్ ఇండియా కొలబా కాజ్ వే కు సమీపంలోనే ఉంటుంది. ఇక్కడకు దక్షిణ ముంబై లో ప్రసిద్ధి గాంచిన రెట్టరెంట్లు బడే మియాస్, కేఫే మండేగర్ మరియు కేఫే లియో పోల్డ్ కూడా సమీపంగానే ఉంటాయి.
మెరైన్ డ్రైవ్
మెరైన్ డ్రైవ్ లో నడుస్తూంటే అది మిమ్మల్ని ప్రపంచ ప్రసిద్ధ చౌ పట్టీ బీచ్ కు చేరుస్తుంది. అక్కడ మీరు ముంబై వీధి ఆహారం అయిన భేల్ పురి, పాని పురి, శాండ్ విచెస్ మరియు ఫలూదాలు ఆరగించవచ్చు. మెరైన్ డ్రైవ్ లో ప్రసిద్ధ బ్రాండ్లు మరియు విశేషమైన హేండ్ లూమ్ స్టోర్సు కలవు. చీకటి పడితే, లైట్లు సముద్రపు ఒడ్డు అందాలను మటుమాయం చేస్తాయి. రాత్రులలో మెరైన్ డ్రైవ్ నుండి ముంబై స్కై లైన్ చూడటం ఎంతో ఆనందం కలిగిస్తుంది.
There are two different hotels – Taj Mahal Tower (New Building) and Taj Mahal Palace (Old One, Heritage Building). For Tower wing, it costs somewhere around INR 9000–15000, excluding the suites. For Palace wing, the price starts from INR 18000–20000 per night, and there are several categories, the maximum can go Upto several lakhs for Lotus suites/TATA suite.
If you are lucky, then you can get an upgrade from Tower to Palace, by the way.
Travel in Mumbai for Employees
ముంబయి మహానగరంలో అన్ని స్థాయిల వారు సరసం గాను, త్వరితం గా ప్రయాణించటానికి లోకల్ రైళ్ళు, మెట్రో రైళ్ళు, బస్సు లు సావకాశం/సౌకర్యము గాను ఉంటాయి.
ముఃబయి లోకల్ రైళ్ళ దారులు (హార్బరు లైను, సెంట్రల్ లైను, వెస్ట్రన్ లైను)
ముంబయి మెట్రో రైలు దారులు
ఇక ఉద్యోగం చేసే ప్రదేశం/చిరునామా ముందుగానే తెలుస్తుంది కాబట్టి, కొంచెం ప్రణాళికబద్ధ యోచన ద్వారా పని చేసే ప్రదేశం బట్టి ఈ లోకల్/మెట్రో రైలు దారుల వెంబట ఒక 45–60 నిమిషాల దూరంలో మనకి అందుబాటు లోను – సరసము గా ఉండే అద్దె ఇళ్ళను చూసుకోవచ్చు. ఇదే గాక, చాలా కంపెనీల వాళ్ళు ఉద్యోగుల సౌకర్యం కోసం కొన్ని నిర్ణయించిన – స్థిర దారులలో కంపెనీ బస్సులను సావకాశంగా నడుపుతారు. దానికి తగ్గట్టుగా కూడ మనకు అందుబాటులో ఉండే అద్దె ఇళ్ళను చూసుకోవచ్చు. ఈ విషయాల గురించి ముందు గానే మానవ వనరుల శాఖ (HR dept) వారిని వివరాలను తెలుసుకోవచ్చు (ఈ విషయం లో చాలా కంపెనీల వాళ్ళు సహాయ-సహకారాలు అందిస్తారు.
ఇక ఉద్యోగ పరముగా, కంపెనీలు – ఉద్యోగులు పని – నాణ్యతా విలువల కి, సమయ పాలనల కు చాలా ప్రాధాన్యత నిస్తారు (అంతెందు కు ఒక ఆటో వాడు, టాక్సీ వాళ్ళు కూడ పాటించే విలువలు-సమయ పాలన ను చూస్తే ఆశ్చర్యమే కాక ముచ్చటేస్తుంది – మొత్తం దేశంలోనే మీటరు పట్టి ఆటో/టాక్సీలని ఒక్క ముంబయి లోనే చూస్తాము – అర్థ రఃపాయి కూడ ఎక్కువ తీసుకోరిక్కడ). చాలా కంపెనీల వాళ్ళు అనువైన/ఫ్లెక్సిబుల్ 8–9 పని గంట ల అవకాశాన్ని కూడ కలిపిస్తాయి.
ఇంకో ముఖ్య విషయం ఆహార-వ్యవహారాల కి వస్తే ముంబయి మహానగరమంతా ఎవ్వరికైనా (దక్షిణ / ఉత్తర భారతీయులకి) సానుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారతీయులకి అనుకూలంగా చాలా వరకు కన్నడ-ఉడుపి భోజనాలయాలు/హోటళ్ళు ముంబయి మహానగరమంతా కనపడతాయి. అయితే, ఎవరైనా వారికి వివిధ నగరాలు / కంపెనీ ల లో వచ్చిన ఉద్యోగ అవకాశాలను నిశితంగాను / కూలంకషముగాను విశ్లేషించుకుని, ఏది / ఎక్కడైతే అన్ని రకాలు అనుకూలంగా ఉంటుందో వారే నిర్ణయించు కోవాలి.
అయితే, ఇక్కడి లోకల్/మెట్రో రైళ్ళ ప్రయాణానికి, వర్షాకాలానికి మొదట్లో కొంత ఇబ్బంది గా ఉండచ్చు – అయితే ఒకసారి అలవాటైతే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బతికేయగలమనే విశ్వాసం వస్తుంది. అసలు ఒకసారి అలవాటైతే ముంబయి ని వదిలి వేరే చోటికా వెళ్ళాలనిపించదనడం లో అతిశయోక్తి లేదంటే నమ్మండి.
అయితే చాలామంది అపోహ పడ్డట్లు అధిక జీవన వ్యయాలు – ప్రయాణ వెతల గురించి అనవసరంగా భయపడక కొంత ప్రణాళిక బద్ధంగా ముందుగా ఆలోచన చేసుకోగలితే అంతా మనకి అందుబాటులో సానుకూలంగా చూసుకోవచ్చు.
You must log in to post a comment.