మహాబలిపురం – సముద్రతీర సుందర దృశ్యాలు

మహాబలిపురంను నేడు అధికారికంగా మామల్లాపురం అని పెర్కొంటున్నారు. ఈ ప్రదేశం తమిళ్ నాడులోని కాంచీపురం జిల్లాలో కలదు. ఈ రేవు పట్టణం 7 వ శతాబ్దం లో ఖ్యాతి గాంచిన పల్లవ రాజుల పాలనలో కలదు. ఈ పట్టణం 7 వ మరియు 9 వ శాతాబ్డాల మధ్య కల అనేక స్మారకాలు కలిగి వుంది. దీనిని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. మహాబలిపురం బంగాళా ఖాతానికి అభిముఖంగా కోరమండల్ తీరంలో కలదు. పల్లవుల పాలనలో అంటే క్రి.శ.650 నుండి 750 వరకూ ఈప్రదేశంలో అనేక కళలు, పురావస్తు,శిల్ప సంపద,సాహిత్యం, డ్రామాలు మరియు అనేక ఇతర సాంస్కృతిక రంగాలు అభివృద్ధి చెందాయి. నేటికాలంలో అంటే 2001 నాటి జనాభా లెక్కల మేరకు మహాబలిపురంలో సుమారు 12,345 కుటుంబాలు నివసిస్తున్నట్లు వెల్లడైంది. అయితే సంవత్సరం అంతా ఇక్కడి ఆకర్షణలు దర్సించేందుకు వచ్చే పర్యాటకులతో ఈపట్టణం కిట కిట లాడుతూ వుంటుంది.   మహాబలిపురం చుట్ట పట్ల ఆకర్షణలు పల్లవులకాలంలో ఈ పట్టణం ఎంతో వైభవాన్ని చవిచూసింది. పల్లవ రాజులు ఇక్కడ కల సహజ వనరలను గ్రహించి వాటినిపూర్తిగా వినియోగించారు. వారు ఈ నగర నిర్మాణం కొరకు ఎంతో శ్రమించారు. పల్లవ రాజుల కళా తృష్ణకు మహాబలిపురం ఒక నిదర్సనంగా వుంటుంది. సుమారు 18 వ శతాబ్దం వరకూ మహాబలిపురం ప్రాంతం గురించి బయట ప్రపంచానికి తెలియదు. దండయాత్రల భయం తో పల్లవ రాజులు తమ పట్టణ అభివృద్ధిని అంతా రహస్యంగా ఉంచేవారు. పల్లవరాజులలో నరసింహ 1 మరియు రాజసింహలు ఈ నిర్మాణాల శిల్ప నైపుణ్యతను కాపాడేందుకు అభివృద్ధికి ఎంతో శ్రమించారు.   ఆకర్షణలు కొండరాతి గుహలు, వెండి రంగు ఇసుక బీచ్, సరివి చెట్లు, ఇక్కడకల దేవాలయాలు అన్నీ ఈ చారిత్రక టవున్ లో అద్భుతాలుగా వుంటాయి. చారిత్రాత్మక పుణ్య క్షేత్రాలు, దేవాలయాలు, స్మారకాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కృష్ణ మండపం, అయిదు రధాలు, వరాహ మండపం సముద్ర తీర టెంపుల్, వంటివి ఎన్నో కలవు. టవున్ నుండి 30 కి.మీ.ల దూరంలో చోళ మండల ఆర్టిస్ట్ విలేజ్ కలదు. ఇక్కడ మీరు అనేక పెయింటింగ్ లు కళా వస్తువులు, శిల్పాలు చూడవచ్చు.

సముద్ర తీర టెంపుల్

ఈ సముద్ర తీర టెంపుల్ ను క్రి.శ.700 నుండి 728 వరకూ నిర్మించారు. ఈ నిర్మాణం బంగాళాఖాత సముద్ర తీరాన్ని పర్యవేక్షిస్తూ వుంటుంది. గ్రానైట్ రాళ్ళతో నిర్మించబడిన ఈ టెంపుల్ మహాబలిపురంలోని స్మారకలాలలో ఒకటి. దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా యునెస్కో సంస్థ గుర్తించింది. దేశపు దక్షిణ భాగం లో ఇది ఒక పురాతన దేవాలయంగా పేర్కొనబడింది. ఈ టెంపుల్ లో ఒక శివ లింగం మరియు విష్ణు మూర్తి విగ్రహం కూడా వుంటాయి. దుర్గ అమ్మవారు తన సింహ వాహనం పై కూర్చుని దర్శనమిస్తుంది. ఇక్కడ బహు దేవాతరాధన వుండటం విశేషం. వివిధ మతాలవారిని త్రుప్తి పరచినట్లు కనపడుతుంది. దీని నిర్మాణ సమయంలో కల పాలకుల పరమత సహనానికి ఉదాహరణగా కనపడుతుంది.

అయిదు రథాలు
అయిదు రథాలు లేదా స్థానిక భాషలో పంచ రథాలు అని చెప్పబడే ఈ నిర్మాణం ఏక శీలా శిల్పశైలి కి అద్దం పడుతుంది. తీర సముద్ర టెంపుల్ వలెనె, పంచ రథాలు కూడా ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్. రాజు మహేంద్రవర్మ – 1 మరియు అతని వారసుడు నరసింహ వర్మన్ -1 పాలనలలో నిర్మించబడిన ఈ నిర్మాణ రహస్యం చరిత్రకారులకు ఇంతవరకు అంతు పట్టడం లేదు.

నేటికి వీటి నిర్మాణం లో కొన్ని భాగాలు అసంపూర్ణంగా మిగిలివున్నాయి. దీని నిర్మాణంలో ఉపయోగించిన గ్రానైట్ రాయి దీనిని ఇక్కడి సముద్ర ఉప్పు గాలుల నుండి, తీరం లో 13వ శతాబ్దంలో వచ్చిన పెను సునామి ల నుండి చక్కగా రక్షిస్తోంది. ఈ నిర్మాణంలో కల అయిదు ఏకశిలా క్షేత్రాలకు అయిదుగురు పాండవుల మరియు ద్రౌపది పేరు పెట్టారు. ద్రావిడుల శిల్పశైలికి ఈ నిర్మాణం అద్దం పడుతుంది.

అర్జునుడి తప్పస్సు ప్రదేశం

అర్జునుడి తపస్సు అనేది అతిపెద్ద బహిరంగ ఏకశిల. దీనిని 7 వ శతాబ్దం మధ్య భాగంలో నిర్మించారు. సుమారు 43 అడుగుల ఎత్తులో వుంటుంది. దీనినే దిగివచ్చిన గంగ అనికూడా అంటారు. కొంతమంది ఇది అర్జున పేరుపై నిర్మాణం జరిగిందని అనగా మరికొందరు రాజు భగీరథుడు తన పూర్వీకుల ఆత్మలను శుద్ధి పరచేందుకు ఇక్కడ గంగను స్వర్గం నుండి నేల మీదకు తీసుకు రావటానికి ఇక్కడ తపస్సు చేసాడని చెపుతారు.

ఇక్కడ చెక్కిన శిల్పాలు ఆనాటి శిల్పుల పని తనానికి ధ్రువపత్రాలు గా వుంటాయి. సుమారు వందకు పైగా దేముల్ల విగ్రహాలు, ఎగిరే ఖగోళ జీవాలు మరియు వైల్డ్ లైఫ్ చిత్రాలు ఇక్కడ కనపడతాయి. రెండు కొండల నడుమ గంగ నది భూమిపై కిందకు పడటం కనపడుతుంది. ఇది ఏక శిలను రెండు సగాలకు చేసినట్లు చూపుతుంది.

Krishna’s Butter Ball
దీనికి దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర ఉంది… 20 అడుగుల పొడవు వెడల్పు, ఎత్తులు కలిగి చాలా ప్రదేశాలలో దాదాపు గోళాకృతిని కలిగి కేవలం రెండు చదరపు గజాల స్థలంలో నిలచి ఉంటుంది… ఈ రాయి ఉన్న కొండ ప్రదేశం చాలా జారుడుగా ఉండి మనం జాగ్రత్తగా నడిచేవిధంగా ఉంటుంది… దాదాపు 250 టన్నుల బరువు వున్న ఈ రాయి అక్కడ చెక్కు చెదరకుండా ఉండడమే ఒక మిస్టరీ… జాగ్రత్తగా రాయిని పరిశీలించండి…   దాని క్రింద ఉన్న జనాల పరిమాణం చూస్తుంటే అర్థమవుతుంది అది ఎంత పెద్ద రాయోనని… 1908 సంవత్సరంలో ఈ ప్రదేశాన్ని పరిశీలించిన ఆర్థర్ లాలీ అనే బ్రిటిష్ దొర ఈ ప్రదేశం చాలా అపాయకరంగా ఉంది.. దీనిని తొలగిస్తేనే మంచిది లేకపోతే ఎవరికైనా ప్రాణాపాయం సంభవించవచ్చు అని తలచి… ఒక ఏడు ఏనుగులను తెప్పించి పెద్ద పెద్ద గొలుసులను ఉపయోగించి ఎత్తునుండి పల్లానికి దొర్లించడానికి ప్రయత్నించారట… కానీ వారు కొంచెం కూడా ఆ రాయిని జరుపలేక వెనుదిరిగారని ఒక కథనం… కొంతమంది ఈ రాయిని ఏదో ఆలయం కోసం తయారీకి ప్రారంభించి మధ్యలో వదిలేసారని భావించారు.. కానీ ఆ రాయి మూలం అలా కొండ నుండి బయటకు వచ్చినట్ట్లు లేదు… ఆ రాయికి కొండకు వర్ణాలలో చాలా వ్యత్యాసం గమనించారట… అందుకే ఈ రాయి బయటనుండే వచ్చిందని ఒక భావన… ఒక వేళ ఏదో గుడికై నిర్మాణం ప్రారంభించి మధ్యలో వదిలేసేదైతే ఇక్కడ కొండలలో చాలా శిల్పాలు డైరెక్ట్ గా కొండలలోనే మరల్చారు.. కానీ ఈ రాయిని ఒక్కరు కూడా ముట్టలేదు.. అందుకే ఇది ఇక్కడ ఒక ప్రత్యేకత అయింది.. ఈ ప్రదేశంలో అనేక ఆలయాలను కట్టించిన పల్లవరాజు నరసింహ వర్మన్ ఈ రాయిని దేనికీ ఉపయోగించవద్దని ఇది ఆకాశదేవుని రాయని ఏ శిల్పీ ముట్టకూడదని శాసించాడని ఒక కథనం…   ఇలాంటి రాళ్ళు పెరూ లోని మాచుపిచు లో, కొన్ని మెక్సికన్ నగరాలలో ..అదీను గ్రహాంతర వాసులు(ఎలియన్స్-ఎగిరేపళ్ళాలు) పరిభ్రమిస్తున్నారనే ఊహాగానాలు ఉన్న ప్రదేశాలలోనే ఉండడం గమనార్హం… 250 టన్నుల రాయిని అంత పైకి తీసుకురావాలంటే ఎన్ని క్రేన్ లు అవసరమో… ఆ రోజుల్లో ఆ సాంకేతికత ఎలా సాధ్యమైందో… అందుకే ఇది ఎప్పటికీ అంతుపట్టని మిస్టరీ జాబితాలో చేరి పోయింది..

మహిషాసుర మర్థిని గుహాలయము
Mahishasuramardhini temple in mahabalipuram information in telugu క్రీ.శ. ఏడవ శతాబ్థంలో ఎటువంటి హైటెక్ టెక్నాలజీ లు అసలు ఇనుమును కూడా శాస్త్రీయంగా కనిపెట్టని కాలంలో.. కొండను తొలచి నిర్మించిన ఈ గుహాలయము మహాబలిపురం, తమిళనాడు లో ఉంది.. ఈ ఆలయం ఏడవ శతాబ్థంలో పల్లవరాజు నరసింహ వర్మన్ చే నిర్మించబడింది.. మహాబలిపురం శిల్పకళకు కాణాచే అని చెప్పవచ్చు. ఇనుము.. అనే పదార్థము కనిపెట్టక(అంటే బ్రిటిష్ వాడు కనిపెట్టక) ముందే మనవారు నిర్మించిన ఈ ఆలయం.. తప్పనిసరిగా చూపరులను కళ్ళూ త్రిప్పనివ్వదు.. ఏఏ వస్తువులను ఉపయోగించారో.. ఇంత ఇక్కడ ఆదిశేషునిపై పవళించిన శ్రీ మహావిష్ణువు ఆలయం.. మరియు… మహిషాసుర మర్థిని అమ్మవారి ఆలయం ఉన్నాయి.. అయితే.. ఇక్కడ ఆలయ వాతావరణం కంటే వేరేవిధమయిన వాతావరణమే గోచరిస్తుంది.. ఈ కొండ ఒక సబ్ మెరైన్ ఆకారంలో ఉండడం.. ఈ ఆలయ ప్రదేశం లైట్ హౌస్ కు దగ్గర ఉండడం.. వేర్వేరు ఆలోచనలు రేకెత్తించక మానదు.. ఇది అప్పటి రాజుల ఒక టెక్నికల్ పాయింట్… దీనికి సంబంధించిన ఎన్నో విషయాలు అక్కడి మహాబలిపురంలోని వేర్వేరు ఆలయాలలో మనకు తెలుస్తాయి.. అయినప్పటికీ ఇది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడి.. యునెస్కో వారి సంరక్షణలో ఉంచబడింది..

మహాబలిపురం చరిత్ర పరిశీలిస్తే ఇప్పటి మహాబలిపురాన్ని మహాబలి అనే ఒక క్రూర రాజు పాలించేవాడు. ఆయను భగవంతుడైన శ్రీ మహావిష్ణువు వధించాడు. కనుక ఈ పట్టణానికి ఆయన పేరుతో మహాబలి వూరు లేదా మహాబలిపురం అనేపేరు వచ్చింది.

%d bloggers like this: