పూరీ – ఇక్కడ విశ్వానికి ప్రభువు యొక్క ప్రస్థానం

పూరీ ఒరిస్సా రాష్ట్రంలో భారతదేశంలో తూర్పు వైపు బంగాళాఖాత తీరంలో ఉన్నది. ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది. పూరి నగరం చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నది. జగన్నాథ ఆలయాన్ని జగన్నాథ్ పూరీ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ప్రజలు హిందూ మత తీర్ధయాత్రను పూరీను సందర్శించినప్పుడు మాత్రమే యాత్ర పూర్తి అయినదని భావిస్తారు. జగన్నాథ ఆలయం భారతదేశంలో ఉన్న దేవాలయాలల్లో ప్రముఖమైనది. ఇక్కడ రాధా, దుర్గ, లక్ష్మి, పార్వతి, సతి, మరియు కృష్ణ తో శక్తి నిలయాలు ఉన్నాయి. జగన్నాథుని యొక్క పవిత్ర భూమిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి, పురుషోత్తమ క్షేత్ర, పురుషోత్తమ ధర్మ, నీలాచల,నీలాద్రి, శ్రీక్షేత్ర, శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలేచేవారు.   ప్రతి సంవత్సరం పర్యాటకులు అధిక సంఖ్యలో రథయాత్ర లేదా రథం ఫెస్టివల్ సమయంలో సందర్శిస్తారు. పండుగ సమయంలో దేవతలైన జగన్నాథ్,బలభద్ర మరియు సుభద్రల విగ్రహాలను బాగా అలంకరించిన రథాల్లో ఉంచి గుండిచ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చితిరిగి జగన్నాథ ఆలయానికి తీసుకువస్తారు. ఈ ఉత్సవము సాధారణంగా జూలై నెలలో జరుగుతుంది. ఈ ఉత్సవము పూరీ పర్యాటక క్యాలెండర్ లో అత్యంత ముఖ్యమైన ఆకర్షణగా చెప్పవచ్చు.

జగన్నాథ స్వామి దేవాలయం

ఒరిస్సా రాష్ట్రంలో, పూరీ పట్టణంలో బంగాళాఖాతం సముద్రతీరాన ఉన్న ప్రముఖ వైష్ణవాలయం పూరీజగన్నాథ దేవాలయం. ఇది విష్ణుభక్తులకు, కృష్ణభక్తులకు ఎంతో ప్రియమైనది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు తన చెల్లెలు సుభద్ర మరియు అన్న బలరామునితో కలసి దర్శనమిస్తారు.

దేవాలయ చరిత్ర:
అత్యంత ప్రాచీనమైన ఆలయం పూరీ జగన్నాధాలయం. ఇప్పుడు ఉన్న దేవాలయం గంగ వంశానికి చెందిన కళింగ రాజు అనంతవర్మ చోడగంగ (క్రీ.శ 1048-1148) ప్రారంభించాడు. ప్రస్తుతం కనబడుతున్న నిర్మాణాలు మాత్రం క్రీ.శ. 1174 సంవత్సరంలో అనంగ భీమదేవుడిచే నిర్మించబడ్డాయి. ఆలయం 14 సంవత్సరాల పాటు నిర్మించబడి క్రీ.శ.1198 సం॥లో ప్రాణప్రతిష్ట జరిగింది.

ఆలయం గురించి విభిన్న కధనాలు ప్రచారంలో ఉన్నాయి.
అందులో ఒకటి : ఇంద్రద్యుమ్న మహారాజు గొప్ప దైవభక్తుడు. నీలాచలం అనే పర్వతం మీద జగన్నాధస్వామి సుభధ్రా, బలదేవునితో పాటు వెలసిఉన్నాడని తెలుసుకొని స్వామి దర్శనం కోసం అక్కడకు వెళతాడు. కాని స్వామి ఇంద్రద్యుమ్న మహారాజును పరీక్షించ కోరి అక్కడనుండి అదృశ్యమవుతాడు. రాజు అక్కడ నుండి నిరాశతో తిరిగి వెళతాడు. ఒకరోజు స్వామి ఇంద్రద్యుమ్న మహారాజుకు కలలో కనపడి సముద్రపు అలలలో రెండు కొయ్యదుంగలు కొట్టుకు వస్తాయని వాటినుంచి తమ విగ్రహాలు చెక్కించమని ఆదేశిస్తాడు. రాజు ఆ దుంగలను తన రాజ్యానికి తీసుకువస్తాడు. సాక్షాత్తు విశ్వకర్మ శిల్పిరూపంలో వచ్చి తాను ఆ దుంగలను విగ్రహాలుగా చెక్కుతానని చెప్పి ఒక షరతు పెడతాడు. దాని ప్రకారం దుంగను, తనను ఒకగదిలో పెట్టి తలుపు బంధించమని చెపుతాడు. తనంతటతాను బయటకు వచ్చేదాకా తలుపు తెరవకూడదని చెబుతాడు.

10 రోజుల తరువాత రాజమాత లోపల ఉన్న శిల్పి 10 రోజులుగా ఆహారం లేకుండా ఉన్నాడని తలుపు తెరిపిస్తుంది. శిల్పి అదృశ్యమవుతాడు. విగ్రహాలు అసంపూర్తిగా చెక్కబడి ఉంటాయి. వాటిని అలాగే ప్రతిష్టించాలని రాజుకు అదృశ్యవాణి ఆజ్ఞాపించటంతో విగ్రహాలను అలాగే ప్రతిష్టిస్తారు.

ఇంకొక కధనం ప్రకారం నీలమాధవుడనే పేరుతో స్వామి దట్టమైన అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో గిరిజనుల దైవంగా పూజలందుకునేవాడట. గిరిజన రాజు విశ్వావసుడు మూడో కంటికి తెలియకుండా వెళ్ళి పూజు చేసేవాడట. ఈ సంగతి తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు రహస్నాన్ని తెలుసుకోవటానికి విద్యావతి అనే యువకుడిని నియమిస్తాడు.br/> విద్యావతి విశ్వావసుడి కూతుర్ని ప్రేమించి పెళ్ళాడతాడు. ఒకసారి మామ వెంట గుడికి వెళతానని పట్టుబడతాడు. విశ్వావసుడు అల్లుడి కళ్ళకు గంతలు కట్టి తనతో తీసుకు వెళ్తాడు. విద్యావతి తెలివిగా ఆ మార్గంలో ఆవాలు చల్లుకుంటూ వెళ్తాడు. కొన్నాళ్ళ తరువాత ఆవాలు మొలచి దారి చూపిస్తాయి. ఈ సంగతి తెలుసుకున్న ఇంద్రుమ్మ మహారాజు గుడికి వెళ్ళేసరికి విగ్రహాలు మాయమవుతాయి. ఓరోజు రాజుకు జగన్నాధుడు కలలో కనిపించి సముద్రంలోనుంచి వేపదుంగ కొట్టుకు వస్తుంది. దానితో విగ్రహాలు చేయించమని చెబుతాడు.తరువాత పై కధలోనిదే.

ఆలయ విశేషాలు : ఈ ఆలయం వేయి ఎకరాల సువిశాల ఆవరణలో ఉండి చుట్టూ ప్రాకారంతో ఉంటుంది.శంఖాకృతి ఉండటంతో శంఖక్షేత్రమని పేరు వచ్చింది. లోపల సుమారు 120 దాకా ఆలయాలు ఉన్నాయి. ఒరిస్సా సాంప్రదాయ రీతిలో కట్టబడిన ఈ ఆలయం భారతదేశంలో పేరుపొందిన ఆలయాలలో ఒకటి. ఆలయానికి నాలుగు సింహద్వారాలున్నాయి. సింహద్వారాలకు ఇరువైపులా భారీ సింహాల విగ్రహాలున్నాయి. సింహద్వారం నుండి లోనికి ఒక అడుగు వేయగానే సముద్ర ఘోష వినపడదు. ఒక అడుగు వెనుకకు వేస్తే సముద్ర ఘోష వినపడుతుంది.

పూరీజగన్నాథ దేవాయం – ఏడు అద్భుతాలు :
1. ఆలయం జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దశలో ఉంటుంది.  2. ఆలయంపై ఉండే సుదర్శన చక్రం పూరీలో ఎక్కడ ఉన్నా మనవైపే చూస్తున్నట్లుగా ఉంటుంది.  3. మామూలు సమయాలలో సముద్రం నుండి గాలి భూమిదిశగా వస్తుంది. సంధ్యావేళలో దానికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ పూరీ పట్టణంలో దీనికి విరుద్ధంగా ఉంటుంది. 4. పక్షులు గాని, విమానాలుగాని ఈ ఆలయం మీదుగా వెళ్ళవు. 5. గుమ్మానికి ఉండే కప్పునీడ ఏ సమయంలో ఐనా, ఏ దిశలోనైనా కనపడదు. 6. ఆలయంలో ఉండే ప్రసాదం సంవత్సరమంతా అలానే ఉంటుంది. దాదాపు 20 లక్షలమందికి పెట్టవచ్చు. ప్రసాదం వృధా అవ్వదు, తక్కువ కాదు. 7. జగన్నాథుని వంటశాలలో కట్టెల పొయ్యి మీద వండే ప్రసాదం 7 మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కింద ఉన్న పాత్రలో ఉండే ప్రసాదంతో సమానంగా పైన ఉన్న పాత్రలోని ప్రసాదంకూడా సమానంగా ఉడుకుతుంది. పూరీ జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రధయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహరాజు పూరీ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కధనం. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాధ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. సైన్స్ కు కూడా అంతుచిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు.

​ఆలయంపై జెండా

samayam telugu

పూరీ జగన్నాధ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏం ఉంది అనుకోకండి. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు.

​సుదర్శన చక్రం

samayam telugu

20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరీ జగన్నాధ్ ఆలయ పై భాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయంపైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజినీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం.

​ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరవు

samayam telugu

ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు. ఏ ప్రభుత్వమూ దీనిని నో ప్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణింపబడుతుంది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది.  

​ఆలయ నిర్మాణం

samayam telugu

పూరీ జగన్నాధ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజినీరింగ్ అద్భుతమా లేక దైవ శక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతుచిక్కని విషయం.

​సింఘద్వారం రహస్యం

samayam telugu

జగన్నాధ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి. వీటిలో సింఘ ద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ధ తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్ధం మీకు వినిపించదు. ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది.  

సముద్రం రహస్యం

samayam telugu

సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది. కానీ పూరీ సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం. ఇది సైన్స్ కు కూడా అంతుచిక్కని మిస్టరీ.  

​1800 ఏళ్ల నుంచి జరుగుతున్న ఆచారం

samayam telugu

45 అంతస్తుల ఎత్తు గల ఈ ఆలయంపైకి ప్రతి రోజూ ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్క రోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకూ ఆలయం మూతపడుతుందని నమ్ముతారు.

​ప్రసాదం రహస్యం

samayam telugu

పూరీ జగన్నాధ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతి రోజూ 2000 నుంచి 20,000 వరకూ భక్తులు వస్తుంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం, భక్తులకు సరిపోకపోవడం చోటుచేసుకోకపోవడం ఆశ్చర్యకర విషయం. ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం.  

పూరీ  బీచ్

పూరీ బీచ్ మరొక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఉంది. వార్షిక పూరీ బీచ్ ఫెస్టివల్ పూరీ పర్యాటకంలో ఆకర్షణగా ఉంటుంది. ఈ బీచ్ ను హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాక ఈ బీచ్ సుందరమైన వీక్షణ నిజంగా మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది.    ఉదయిస్తున్న సూర్యుడి చూడటం లేదా అస్తమిస్తున్న సూర్యుడి చూడటంతో తీర్థయాత్ర ముగుస్తుంది అనుకుంటున్నారా? కానేకాదు పర్యాటకులు బలిఘి బీచ్ వద్ద కోణార్క్ సముద్ర డ్రైవ్ చేయవచ్చు. పూరీ మతసంబంధ ఆసక్తికరమైన మరొక ప్రదేశం హిందూ మత శ్మశానం స్వర్గాద్వర్ ఉంది. పూరీ నుండి 14 కిమీ దూరంలో భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధాని రఘురజ్పూర్ ఉన్నది.

ఈ ప్రదేశాన్ని దర్శించడానికి ఉత్తమ సమయం జూన్ నెల నుండి మార్చి వరకు ఉంటుంది.   ఎలా వెళ్లాలి ?…..
ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం వుంది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి.

భువనేశ్వర్లోని బిజూపట్నాయక్ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో వుంది.
కోల్కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్ రైల్వేస్టేషన్ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో వుంది.
భువనేశ్వర్, కోల్కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.

%d bloggers like this: