భారత దేశ పర్యటన ఒక మరచి పోలేని అనుభవనం అనుకుంటే, భారత దేశ రాజధాని ఢిల్లీ పర్యటన సందర్శకులకు మరింత అద్భుతంగా వుంటుంది. ప్రతి పర్యాటకుడు జీవితం లో మరచిపోలేని పర్యటన అనుభవాలను కలిగిస్తుంది. ఢిల్లీ నగరం దేశం లోని పెద్ద నగరాల లో ఒకటి మాత్రమె కాదు, దాని వెలుగు జిలుగులతో ఆధునికత మరియు, సాంప్ర దాయకతలకు ప్రతీకగా నిలిచి సందర్శకులకు చెరగని మధురానుభూతులను కలిగిస్తుంది.
ఢిల్లీ పేరును హిందీ లో ‘దిల్లి ‘ అని కూడా వ్యవహరిస్తారు. అధికారికంగా, ఈ నగరం దేశానికి రాజధాని నగరం. ముంబై నగరం తర్వాత అత్యధిక జనాభా కల రెండవ నగరం గా పేరొందింది.పురాతన ఢిల్లీ మరియు కొత్త ఢిల్లీ అనే పేర్ల తో ఢిల్లీ లోని రెండు ప్రదేశాలు వాటి వాటి చరిత్ర, సంస్కృతి, ఎన్నో రకరకాల అద్భుత ప్రదేశాలతో ప్రతి సందర్శకుడిని మంత్రముగ్ధులను చేస్తాయి. అంతే కాదు, దేశ రాజధాని అయిన కారణంగా, దేశం లో జరిగే ప్రతి ఒక్క రాజకీయ కార్యకలాపానికి కేంద్ర బిందువుగా వుండి ప్రతి వారు తప్పక చూడవలసిన ప్రదేశంగా వుంటుంది.
భౌగోళికత మరియు వాతావరణంసముద్ర మట్టానికి సుమారు 0 – 125 మీటర్ల ఎత్తులో కల ఈ నగరం ఇండియా కు ఉత్తరంగా కలదు. తూర్పు దిశగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, దక్షిణపడమర, ఉత్తరం లలో హర్యానా తోను సరిహద్దులు కలిగి వుంది. భౌగోళికంగా ఢిల్లీ రెండు ప్రధాన అంశాలు కలిగి వుంది. ఒకటి ఢిల్లీ కొండ ప్రాంతం కాగా, రెండవది యమునా నది వరద ప్రాంతాలు. యమునా నది రాజధాని నగరం గుండా ప్రవహించే ఒక ప్రధాన నది.
ఢిల్లీ వాతావరణ పరిస్థితులుఢిల్లీ ఆర్ద్ర ఉపఉష్ణమండల వాతావరణంకలిగి వుంది.. వేసవులు అధికంగా వేడిగానూ, పొడిగానూ, చలికాలం అతి శీ తలంగానూ వుంటాయి. చలికాలం లో దేశ రాజధాని పూర్తి పొగమంచు కలిగి వుంటుంది.. వేసవులు ఏప్రిల్ నెలలో మొదలై జూన్ చివరి వరకూ, వర్షాకాలం జూన్ నుండి అక్టోబర్ వరకూ వుంటాయి. నవంబర్ నుండి శీతా కాలం మొదలవుతుంది.
రాజధాని నగర్ సంస్కృతి గొప్పదనంఢిల్లీ కి గల చరిత్ర దాని సంస్కృతి. చాలా విభిన్నం. హిందువుల ప్రధాన పండుగలు దీపావళి నుండి మహావీర్ జయంతి వరకు, హోలీ, కృష్ణ జన్మాష్టమి ల నుండి గురు నానక్ జయంతి వరకూ ఇక్కడ జరుపుతారు. . కుతుబ్ పండుగ, వసంత పంచమి, వరల్డ్ బుక్ ఫెయిర్, ఇంటర్నేషనల్ మంగో ఫెస్టివల్ వంటివి కూడా జరుగుతాయి.
ఢిల్లీ ప్రదేశం మొఘలాయి వంటకాలకు పుట్టినిల్లు. ఇక్కడి ఆహారపుతలవాట్లపై, మొఘలాయి వంటకాల ప్రభావం అధికంగా వుంటుంది. కాని, భారతీయ వంటకాలు కూడా ఇక్కడ కలవు. ఢిల్లీ సాంప్రదాయక వంటకాలు అంటే, కడాయి చికెన్, బట్టర్ చికెన్, చాట్ లు, జిలేబి, కచోరి, లస్సి మొదలైనవి గా వుంటాయి.
వివిధ భిన్న వైవిధ్యం కల ఈ ఢిల్లీ లో మీరు చూడ తగిన ప్రదేశాలు పరిశీలిస్తే…
ఢిల్లీ నగరం పూర్తిగా గతించిన కాల చరిత్రలోని ఎన్నో నిర్మాణ అద్భుతాలు కలిగి వుంది.. కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్, ఇండియా గేటు, లోటస్ టెంపుల్ , అక్షరధాం దేవాలయం వంటివి ఉదాహరణలు. పర్యటనా స్థలాలకే కాక అనేక వస్తువులను తమ అభిరుచి తో కొనుగోలు చేసే వారికి ఢిల్లీ ఒక షాపింగ్ పారడైస్ గా కూడా పేరు పొందింది.
సందర్శకులకు ఇన్ని అంశాలను అందించే ఢిల్లీ నగరం భారతీయ రాజకీయ కార్యకలాపాలకు ఒక ప్రధాన కేంద్రం గా కూడా కలదు. ఈ దేశ రాజధాని లో పార్లమెంట్ హౌస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నివాసమైన రాష్ట్రపతి భవన్, మహాత్మా గాంధి ని సమాధి చేసిన రాజఘాట్, వంటి పర్యాటక కేంద్రాలకు నిలయమై వుంది.
ఇంతే కాదు, మీరు చరిత్ర ప్రియులైతే, ఢిల్లీ ని ఒకసారి తప్పక దర్శించాలి. ఢిల్లీ ఒక రాజధానిగా ఎన్నో సామ్రాజ్యాలకు ఆలంబనగా విస్తారమైన చరిత్ర కలిగి వుంది. ప్రఖ్యాత కుతుబ్ కాంప్లెక్స్ నుండి రెడ్ ఫోర్ట్ వరకు మరియు చాలా గొప్ప సమాధుల నుండి చారిత్రక మెట్ల భావుల వరకు మరియు స్మారక చిహ్నాలు, ఎన్నో స్తూపాలు గతించిన చరిత్రకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
ఎర్ర కోట
నేడు ఎర్రకోట లేదా లాల్ కిలా గా పిలువబడే కోటను గతం లో కిలా ఎ మొహాల్ల అని పిలిచేవారు. ఇది షాజానాబాద్ కు కొత్త రాజధాని నగరంగా వుండేది. ఈ కోటను సుమారుగా 17 వ శతాబ్దపు మధ్య భాగం లో నిర్మించారు. దీనిని ఉస్తాద్ అహ్మద్ నమూనా చేసారు. నిర్మాణం 1639 లో మొదలై, 1648 వరకు కొనసాగింది. అయితే, 19 వ శతాబ్దం లో కొన్ని మార్పులు చేసారు.
ఎర్ర రాతి తో నిర్మించిన ఈ కోట ప్రపంచం లోనే సుందరమైనది. ఇది సుమారు 2.41 కి. మీ. ల విస్తీర్ణం కలిగి రెండు మెయిన్ గేటు లు …లాహోరు గేటు మరియు ఢిల్లీ గేటు …కలిగి వుంది. లాహోరు గేటు రాజ కుటుంబాల ఉపయోగానికి కల బాజార్లు కల చట్టా చౌక్ వైపు వుంటుంది.
ఈ ఎర్ర కోట ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో సంస్థ చే ప్రకటించబడింది. అందమైన ఈ నిర్మాణం ఎన్నో అద్భుత కట్టడాలను కలిగి వుంటుంది. ఈ అద్భుతాలలో దివాన్ యి ఆం ఒకటి. ఈ ప్రదేశం లో రాజు ప్రజల సమస్యలను విని పరిష్కరించే వాడు.
ప్రైవేటు మీటింగుల కు కాన్ఫరెన్స్ లకు దివాన్ యి ఖాస్ అనే భవనం కలదు. తర్వాతి కాలం లో మోతీ మసీదు ని నిర్మించారు. ఈ మసీదు మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ కు వ్యక్తిగత మసీదు గా నిర్మించారు. చట్టా చౌక్ ప్రదేశం ఢిల్లీ లోని రెడ్ ఫోర్ట్ లో ఒక షాపింగ్ ప్రదేశం. ఇక్కడ రాజ కుటుంబాలకు అవసరమైన సిల్క్, ఆభరణాలు, ఇతర వస్తువులను మొగల్ పాలన లో విక్రయించే వారు.
దివాన్ యి ఆం లేదా ప్రజల హాలు అనే ఈ ప్రదేశం లో చక్రవర్తి షాజహాన్ ప్రజల ఫిర్యాదులను వినేవాడు. బాల్కనీ లో ఒక సింహాసనం పై కూర్చొని ఈ ఫిర్యాదులను వినేవాడు.
ఎర్ర కోట లోని ముంతాజ్ మహల్ మహిళల ప్రైవేటు ప్రదేశం. ఇపుడు దీనిని ఒక మ్యూజియం గా చేసారు. రెడ్ ఫోర్ట్ లో షా జహాన్ నిర్మించిన ఆరు భవనాలలో ముంతాజ్ మహల్ ఒకటి.
ఎర్ర కోట లో రంగ మహల్ ప్రవేశాన్ని నక్కర్ ఖాన అంటారు. మూడు అంతస్తులు కల ఈ భవనం రాచ కుటుంబ సభ్యుల సంగీత వాయిద్యాలకు ఉపయోగించేవారు. ఇక్కడకు వచ్చేవారు ఇక్కడే ఏనుగులను దిగే కారణంగా ఈ నిర్మాణాన్ని హాతి పోల్ అని కూడా అంటారు.
రెడ్ ఫోర్ట్ లోని రంగ మహల్ ను పాలస్ ఆఫ్ కలర్స్ లేదా బేగం మహల్ అని కూడా అనేవారు. ఇక్కడ చక్రవర్హి షాజహాన్ తన భార్యలను, ఉంపుడు గత్తె లను ఉంచేవాడు.
ఇపుడు, ప్రతి సంవత్సరం, భారత దేశ ప్రధాన మంత్రి స్వాతంత్ర దినోత్సవం నాడు, దేశ స్వాతంత్రానికి గుర్తుగా జాతీయ పతాకాన్ని ఎగుర వేస్తారు. సాయంకాల లో సౌండ్ మరియు లైట్ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇక్కడే ఒక పురావస్తు మ్యూజియం మరియు, ఇండియన్ వార్ మెమోరియల్ మ్యూజియం కూడా వున్నాయి.
సోమవారాలు తప్ప, వారం లోని మిగిలిన రోజులలో ఉదయం 8 గం. నుండి సాయంకాలం 6 గం. వరకు ఈ కోట తెరిచే వుంటుంది. ఈ కోట సందర్శనకు గాను అవసరమైన సౌకర్యాలుగా గైడ్ లు, ఒక చిన్న కేంటీన్, టాయ్ లెట్లు, వీల్ చైర్ లు , పార్కింగ్ స్థలాలు కలవు.
చాందినీ చౌక్
ఎర్రకోటకు ఎదురుగా ఉన్న చాందినీ చౌక్ ఢిల్లిలో ఉన్న పెద్ద దుకాణాల సముదాయం. కానీ ఈ దుకాణాల సముదాయం కొనుగోలుదారులతో క్రిక్కిరిసి మరియు ఇరుకుగా ఉంటుంది. చాందినీ చౌక్ లోనే పక్షులకు ఆశ్రయం కల్పించే దిగంబర్ జైనదేవాలయం కలదు. చాందినీచౌక్ చివరిలో షాజహాన్ భార్యలచే నిర్మించచేయబడిన ఫతేపురి మసీదు కలదు.
ఇండియాగేట్
ఢిల్లీ లో గల పర్యాటక ప్రదేశాలన్నింటిలో “ఇండీయా గేట్” ప్రముఖమైనది. ఢిల్లీ నగరం నడిబొడ్డున గల 42 అడుగుల ఇండియాగేట్ ఇతర స్థూపాల కంటే ఎత్తులో ఠీవీ గా నిలబడీ ఉంటుంది. ఈ స్థూపాన్ని పారిస్ లో గల “ఆర్చ్-డీ-ట్రయంఫ్” ని పోలిఉండేటట్లు నిర్మించారు. “ఆల్ ఇండియా వార్ మెమోరియల్” గా మొదట పిలవబడ్డ ఈ కట్టడం మొదటీ ప్రపంచ యుద్ధ కాలం లో మరియు 1919 లో మూడవ ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధాలలో ఆంగ్లేయుల తరపున పోరాడుతూ అసువులు బాసిన 70 వేలమంది సైనికుల జ్ఞాపకార్ధం నిర్మించబడినది.
దీనికి మొదట 1921 లో శంఖుస్థాపనని చేసినది కానాట్ డ్యూక్ అయినా, 1931 లో వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ పూర్తి చేసారు. డీని డిజైన్ రూపకర్త ఎడ్వర్డ్ లుట్యెన్స్. ఏరుపు మరియు లేత రంగు ఇసుక రాళ్ళు, గ్రానైట్ తో ఇండియా గేటు ని నిర్మించారు. ఈ కట్టడం కింద 1971 ఇండో పాక్ యుద్ధం లో అమరులైన సైనికుల గౌరవార్ధం నిరంతరం వెల్గుతుండే “అమర జవాన్ జ్యోతి” ని చూడవచ్చు.
ఇండీయా గేటు ముందు గల ఖాళీ మంటపం లో ఇంతకుముందు భారత దేశాన్ని పరిపాలించిన ఆంగ్లేయుడు ఐదవ జార్జ్ విగ్రహం ఉండేది.కానీ దీనిని తరువాత కోరోనేషన్ పార్కు కి తరలించారు. ఇండీయా గేటు 1931 లో నిర్మించబడ్డా కానీ ఇప్పటికీ ప్రముఖ దర్శనీయ స్థలం గా గుర్తించబడుతోంది.
అమర్ జవాన్ జ్యోతి
1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధం తరువాత ఈ కట్టడం క్రిందిభాగాన అమర్ జవాన్ జ్యోతి వెలుగుతోంది. 1971 నాటి యుద్ధంలో అమరులైన భారత జవానులకు కూడా ఇది నివాళులు అర్పిస్తోంది. దీనిని అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించింది.
కుతుబ్ భవనసముదాయం
ఢిల్లీ లోని మెహ్రౌలీ ప్రాంతం లో ఉన్న ఈ కుతుబ్ భవనసముదాయం సుప్రసిద్ధ ఆకర్షణ కుతుబ్ మినార్ మరియు మరెన్నో ఇతర ప్రామాణిక చారిత్రక స్మారకాలకి నిలయం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ( వరల్డ్ హెరిటేజ్ సైట్) గా ప్రకటించబడిన ఈ ప్రాంతం లో అనేక బానిస రాజవంశానికి చెందిన కట్టడాలు ఉన్నాయి. చాలా చక్కగా నిర్వహించబడుతున్న ఈ ప్రదేశం, ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ మరియు ఢిల్లీ లోని ఒక మంచి విహార ప్రదేశం. ఇక్కడి ఆసక్తికరమైన స్మారకాల జాబితా –
సమీప మెట్రో స్టేషన్ కుతుబ్ మినార్
కుతుబ్ మినార్: ఇది సముదాయంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన నిర్మాణం.72.5 మీటర్ల తో ఇది దేశంలోనే అతి పొడవైన మసీదు శిఖరం.కుతుబ్-ఉద్-దిన్-ఐబక్ చే 1193 మరియు 1368 మధ్యలో విజయ గోపురం గా నిర్మించబడింది.చాలా చక్కగా నిర్వహించబడుతున్న ఈ కట్టడం ఒక నిర్మాణ అద్భుతం. భారత దేశం లోనే తప్పక చూడవలసిన కట్టడం.
ఇనుప స్థంభం: మీరు భారత దేశం లోని తుప్పు పట్టని ఇనుప స్థంభం గురించి విని ఉంటే,అది ఈ సముదాయం లోనిదే.చంద్ర గుప్త II విక్రమాదిత్య చేత క్రీ.శ 400 లలో నిర్మించబడ్డ ఈ స్థంభం ఎత్తు ఏడు మీటర్లు. దీని కోసం ఉపయోగించిన తుప్పు రహిత లోహ మిశ్రమం ఢిల్లీ యొక్క కఠినమైన వాతావరణ పరిస్థితులని తట్టుకుంటూ బలంగా నిలబడి ఈ నాటి లోహశాస్త్రజ్ఞులని సైతం ఆశ్చర్యచకితులని చేస్తున్నది.
అలా-ఇ-దర్వాజా: సముదాయంలోని గల కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు కి ప్రవేశ మార్గం గా ఉపయోగించబడిన గుమ్మటం గల చిన్న చతురస్రాకార భవనం అలా-ఇ-దర్వాజా.అందమైన చెక్కిన శిలా తెరలతో,పాలరాయి అలంకరణల తో అలరారుతున్నఈ కట్టడం ఇప్పుడు కుతుబ్ మినార్ కి వెనక భాగం లో ఉంది.
ఇమాం జామిన్ సమాధి: సికందర్ లోడి పరిపాలనా కాలంలో కుతుబ్ ప్రాంగణంలో గల ఈ మసీదు లో నివసించిన టర్కీ దేశస్థునికి ఈ సమాధి అంకితం చేయబడినది. అలా-ఇ-దర్వాజా పక్కనే ఇది ఉంది.
అలా-ఉద్-దిన్-ఖిల్జీ సమాధి మరియు మదరసా:ఖిల్జీ రాజ వంశ పరిపాలకుడు అలా-ఉద్-దిన్-ఖిల్జీ యొక్క సమాధి మరియు అతని చే నిర్మించబడిన మదరసా ఈ ప్రాంగణంలోనే ఉన్నాయి. క్రీ.శ 1296 నుంచి 1316 కాలం మధ్య ఈ ప్రాంతం నుంచి పరిపాలించిన ఈ చక్రవర్తి ఢిల్లీ కి రెండవ సుల్తాన్.
ఇల్తుమిష్ సమాధి: బానిస రాజవంశ పరిపాలకుడు అయిన ఇల్తుమిష్ సమాధి కూడా ఈ ప్రాంగణం లోనే ఉంది. ఈ స్మారక చిహ్నం పాలరాతితో తయారు చేయబడి గది మధ్య లో ఉన్న ఒక ఎత్తైన వేదిక మీద ఉంది.విస్తారమైన అందమైన చెక్కడాలకి ఇది పేరు గాంచింది.
సుల్తాన్ ఘడి: ఇల్తుమిష్ పెద్ద కొడుకు నసీర్-ఉద్-దీన్ కోసం కట్టబడిన మహమ్మదీయ సమాధి సుల్తాన్ ఘడి. క్రీ.శ. 1231 లో నిర్మించబడిన ఇది బానిస రాజవంశం కాలం నాటి మధ్యయుగ ఢిల్లీ లో భాగం. అయితే, ఇప్పుడు ఇది కుతుబ్ ప్రాంగణంలోని భాగం.అసాధారణమైన ఆకృతితో చావళ్ళతో కోటని తలపించే ఈ ప్రదేశం, హిందూ ముస్లిం భక్తుల చే ఒక సమాధి గా మాత్రమే పరిగణించబడక ఒక పవిత్ర దర్గా వలే పూజలు అందుకుంటుంది. ఆ విధంగా,ఈ పురాతన కట్టడం,భారతదేశ పురావస్తు శాఖ వల్ల గాక ముఖ్యంగా భక్తుల రాక వల్ల చక్కని నిర్వహణ కు నోచుకున్నది.
లోటస్ టెంపుల్, కల్కాజీ, న్యూ ఢిల్లీ
సమీప మెట్రో స్టేషన్ కల్కాజీ మెట్రో స్టేషన్.
జామా మసీదు

జామా మసీదు భారతదెశం లోని పురాతన మశీదులలో ఒకటి. దీనిని షాజహాను నిర్మించాడు. ఇది ఆ మొఘలు చక్రవర్తి చే నిర్మించ బడ్డ ఆఖరి వాస్తు నిర్మాణం. దీనిని 1650 లో మొదలుపెట్టి ఆరు సంవత్సరాల తరువాత అనగా 1656 లో పూర్తిచేసారు. చౌడీ బజార్ లో గల ఈ మసీదు పాత ఢిల్లీ లో గల దర్శనీయ స్థలాలలో ముఖ్యమైనది.
ఈ మశీదు ని మొదట “మస్జిద్-ఈ-జహాన్-నుమా” అని పిలిచేవారు. “మస్జిద్-ఈ-జహాన్-నుమా” అనగా మశీదు ని ప్రతిబింబించే ప్రపంచం అని అర్ధంట. తరువాత ముస్లిం మతస్తుల మధ్యాహ్న ప్రార్ధనలైన “జామా” పేరు మీద ఇది “జామా మశీదు” గా మారింది.
ఒకేసారి పాతికవేలమంది కూర్చుని ప్రార్ధించే స్థలం ఉంది ఈ మశీదులో. ఈ మశీదు కి మూడు ద్వారాలు,40 మీటర్ల ఎత్తుతో తెల్ల పాలరాయి మరియు ఎర్ర ఇసుకరాయితో చేసిన నాలుగు స్తంభాలు గల టవర్లున్నయి. ఇంకా హిందూ జైన వాస్తు శాస్త్ర ఆధారం గా అత్యద్భుతం గా చెక్కబడిన 260 స్తంభాలున్నయి.
ఈ మశీదు నేల తెలుపు మరియు నలుపు మార్బుల్ తో ముస్లిం మతస్తులు కూర్చుని ప్రార్ధించే వస్త్రాన్ని పోలి ఉంటుంది. ఐదడుగుల ప్లాట్ఫారం మీద నిలిచి ఉన్న ఈ అందమైన మశీదు భారత దేశ మసీదులలోకెల్ల పెద్దది.
ఈ మశీదులో అనేక ప్రాచీన చిహ్నాలున్నాయి. వాటిలో జింక చర్మం మీద రాయబడ్డ పురాతన పవిత్ర ఖురాను ప్రతి ముఖ్యమైనది. ఈ మశీదు ఉత్తర ద్వారం వద్ద అమర్చబడింది. జామా మశీదు ఎర్ర కోట కి ఎదురుగా ఉన్నది.
హుమాయూన్ సమాధి

హుమాయూన్ సమాధి మొఘల్ నిర్మాణాల సమూహం. ఢిల్లీ లోని తూర్పు నిజాముద్దీన్ లో వున్నది. దీనిని హుమాయూన్ మరణానంతరం, ఇతని భార్య హమీదా బాను బేగం, ఆదేశాన నిర్మాణం జరిగినది. 1562 లో నిర్మాణపు పనులు ప్రారంభమయ్యాయి. దీని ఆర్కిటెక్ట్సయ్యద్ ముహమ్మద్ ఇబ్న్ మిరాక్ గియాసుద్దీన్ మరియు తండ్రి మీరక్ గియాసుద్దీన్. వీరిని ‘హిరాత్’ నుండి రప్పించారు. దీనిని నిర్మించుటకు 8 సంవత్సరాల కాలం పట్టింది. తాజ్ మహల్ నిర్మాణానికి పూర్వం దీనిని భారత్ లోనే అత్యంత సుందరమైన కట్టడంగా పరిగణించేవారు. దీనిని యునెస్కో వారిప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.
సఫ్దర్‌జంగ్ సమాధి, డెల్హి రేస్ కోర్సు, కొత్త ఢిల్లీ
సమీప మెట్రో స్టేషన్ జోర్ బాగ్ మెట్రో స్టేషన్.
జాతీయ జంతుసంరక్షణాలయం (నేషనల్ జూ పార్క్)

హుమయూన్ సమాధి మరియు పురానా ఖిల్లా మధ్యభాగంలో ఉన్న ఈ జూపార్క్ 1959 సం.ల 1 నవంబర్ న జూ పార్క్ పంజాబ్ రావ్ దేశ్ ముఖ్ , కేబినెట్ మంత్రి గారిచే ప్రారంభించబడినది. ఇందులో పులులు, చిరుతలు, ఎలుగు బంట్లు, కోతులు, జింకలు, హిప్పోపోటమస్, చింపాంజీలు, ఆఫ్రికన్ ఎద్దులు,మజిరాఫీలు, జీబ్రాలు, హైనాలు, గిర్ జాతి సింహాలు, బెంగాల్ టైగర్స్, ఇండియా ఖడ్గమృగాలు ఇంకా రకాల పక్షులు ఇంకా రకరకాల జంతువులు కలవు. జూ పార్క్ మొత్తం విస్తీర్ణం 176 ఎకరాలు. బ్యాటరీతో నడిపే కారు అద్దెకు తీసుకొనవచ్చు. జూపార్క్ లోనికి బయటనుండి తెచ్చుకున్న ఆహారపదార్థాలు అనుమతించబడవు. మంచినీరు మాత్రం తీసుకు వెళ్ళవచ్చు.పసిపిల్లలకు పాలు తీసుకు వెళ్ళవచ్చు. కెమేరాలు, ప్రమాదకర వస్తువులు, మ్యూజికల్ పరికరాలు, బ్యాగులు, పోలిధిన్ సంచులు అనుమతించబడవు.
పార్లమెంట్ హౌస్
దేశం యొక్క అత్యున్నత చట్ట సభ – పార్లమెంట్ హౌస్ – కొత్త ఢిల్లీ లోని ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ.సంసద్ మార్గ్ లోని ఈ ఆకర్షణీయమైన వలయాకార నిర్మాణం లో మంత్రివర్గ కార్యాలయాలు, వివిధ సంఘాల గదులు, విస్తృతమైన గ్రంథ సేకరణ తో కూడిన అందమైన గ్రంథాలయం కొలువై ఉన్నాయి.
ఈ వృత్తాకార భవనం లో పైన గోపురం కలిగిన ఒక సెంట్రల్ హాల్ (కేంద్ర మందిరం) ఉన్నది. సామ్రాజ్య శైలి లో కట్టబడిన ఈ భవనం లోని 144 స్తంబాల తో కూడిన వరండా ఉన్నది. సర్ ఎడ్విన్ లుట్యెన్స్ మరియు సర్ హెర్బర్ట్ బేకర్ అనే ఇద్దరు బ్రిటీష్ భవనశిల్పులు రూపొందించిన దీని నిర్మాణం1927 లో ముగిసింది. 1946 వరకు అప్పటి కేంద్ర శాసన సభ యొక్క కేంద్ర గ్రంథాలయం గా పనిచేసింది. తరువాత రాజ్యాంగ సభా మందిరం గా మార్చబడినది. రెండు కారణాలచేత సెంట్రల్ హాల్ భారతీయ చరిత్ర లో ముఖ్య స్థానాన్ని పొందింది –వలస రాజ్య అధికారాన్ని నెహ్రు ఆధ్వర్యం లోని తాత్కాలిక ప్రభుత్వానికి బదిలీ మరియు రాజ్యాంగ రూపకల్పన.
ఈనాడు, సెంట్రల్ హాల్ లోక్ సభ రాజ్య సభ సమావేశాలకి మరియు సభ్యుల మధ్య చర్చలకి, ఇంకా ఇతర ముఖ్య రాజకీయ సందర్భాలకి ఉపయోగించబడుతుంది.
సందర్శకులకి భవనం సందర్శించడానికి అనుమతి లేదు. అయితే, ముందస్తు అనుమతితో, హౌస్ లోపలి వ్యవహారాలను వీక్షించవచ్చు.
అక్షరధామ్ ఆలయం

అక్షరధామ్ భారతదేశ రాజధాని నగరమైన కొత్తఢిల్లీలో, దాదాపు వంద ఎకరాల సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం. నవంబర్ 7, 2005వ తేదీన భారత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదగా ఆవిష్కృతమైంది. 8వ తేదీ నుండి ప్రజలకు దర్శనీయ ప్రదేశంగా తెరిచారు. ఈ భవనం నిజాముద్దీన్ వంతెనకు కొంత దూరంలో “నొయిడా క్రాసింగ్” వద్ద యమునా నది తీరాన మహొన్నంతంగా వెలసి, పర్యాటకుల్ని, ఆధ్యాత్మికవాదులను, ప్రాచీన సంస్కృతీ వారసత్వారాధకులను సమంగా అలరిస్తోంది. అక్షరధాంలో ఆలయంతో పాటుగా, ఒక స్మారక భవన సముదాయం, ఒక విద్యా ప్రభోధ కేంద్రం, జ్ఞాన ప్రకాశ నిలయం ఉన్నాయి. అక్షరధామ్ సంప్రదాయక కళ, భవన నిర్మాణ పరిజ్ఞానం, భారతీయ సంస్కృతీ నాగరికతలు, ప్రాచీన నైతిక విలువలు, విజ్ఞానాల్ని ఉత్తమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సృజనాత్మంకంగా మేళవించిన తీరుకు ప్రతీక. అక్షరధామ్ సముదాయం అంటే పరమాత్ముని శాశ్వత, అవినాశ నిలయం. వేదాలలో , ఉపనిషత్తులలో నిర్వచించబడిన శాశ్వత విలువలు, శాశ్వత సుగుణాలకు నెలవు. ఆ స్మారక భవన సముదాయం యొక్క పూర్తిపేరు “స్వామి నారాయణ్ అక్షరధామ్”. నిర్మాణ కళాశైలిరాజస్తాన్ లోని పిండ్వారా, సికంద్రా పట్టణాల నుంచి సేకరించిబడిన వేలాది టన్నుల కెంపువన్నె ఇసుకరాళ్ళు , పాలరాళ్ళతో నిర్మించబడినటువంటి ఈ కట్టడంలో ఒక అంగుళం మేరకైనా ఉక్కు వాడకపోవడం పెద్ద విచిత్రం. మొదటిదైన అక్షరధామ్ గుజరాత్ కు చెందిన గాంధీనగర్‌లో వెలువగా, ఢిల్లీలోని ఈ అక్షరధామ్ రెండవది. బదరీనాథ్, కేదార్నా థ్, సోమనాథ్, కోణార్క్ ఆలయాల భవన నిర్మాణ కళాశైలి ఈ స్మారక భవన నిర్మాణానికి స్పూర్తి. వైదిక స్థపత్య శాస్త్రాల (భవన నిర్మాణ కళకు సంబంధించిన) నిబంధనలమేరకే ఈ అక్షరధాంని మలచడం ఒక విశేషం.
Murthy Darshan : 09-00am to 07-00 pm.
Exhibition : 09-00am to 07-00 pm. (fees apply)
Musical fountain : 06-45 pm (fees apply)
Food Court : 11-00 am to 10-00 pm
Official Website : www.akshardham.com
నేషనల్ మ్యూజియం

5,000 సంవత్సరాల క్రితం హరప్పా సంస్కృతి నాటి పురాతన వస్తువులు ఉన్న మ్యూజియం ఇది. సూక్ష్మ చిత్రాలు, వస్త్రాలు, సంగీత పరికరాలు, చెక్కతో చేయబడిన వస్తువులు ఇంకా ఎన్నో చూడవచ్చు. హిస్టరీ మరియు కళలకు సంబంధించిన 2,00,000 ల సేకరణలను చూడవచ్చు.
National rail Museum
పెద్దలకు వారాంతపు రోజుల్లో ప్రవేశ టికెట్ 50 రూపాయలు weekend వారాంతాల్లో ప్రవేశం 100 రూపాయలు.
సమీప మెట్రో స్టేషన్ ‘ఎం.విశ్వేశ్వరాయ’ మెట్రో స్టేషన్.
Rajghat and other Samadhulu

1948, 31 జనవరిన మహాత్మా గాంధీ అంత్యక్రియలు జరిగిన చోట నల్లని పాలరాతితో కట్టబడిన స్మారక స్థలము. ఢిల్లీలో యమునానదీ తీరాన ఉన్న ఈ ఆరుబయలు కట్టడము వద్ద ఒక అనంతజ్వాల అవిశ్రాంతముగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. పచ్చికబయళ్ళగుండా వెళ్ళు ఒక రాతి కాలిబాట ద్వారా చుట్టుగోడల మధ్య ఉన్న ఈ స్మారక స్థలాన్ని చేరవచ్చు. మహాత్మా గాంధీ ఆఖరి మాటలుగా భావించబడే హే రామ్ అను అక్షరాలు ఇక్కడి సమాధి పై దేవనాగరి లిపిలో చెక్కబడి ఉన్నాయి. ఆయనకు అంకితమొనర్చబడిన రెండు సంగ్రహశాలలు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి.
భారతదేశ పర్యటనకు విచ్చేసిన విదేశీ అధికారులు రాజ్ ఘాట్ వద్ద పుష్పగుఛ్ఛం ఉంచి నివాళులర్పించటం ఒక సాంప్రదాయంగా మారింది. పర్యాటకులు విధిగా స్మారక స్థలాన్ని సందర్శించబోయేముందు తమ పాదరక్షలను గౌరవసూచకంగా తొలగించాలి. గాంధీ మరణించిన రోజుకు గుర్తుగా ఇక్కడ ప్రతి శుక్రవారం స్మారకోత్సవాలు జరుగుతాయి. ప్రతి గాంధీ జయంతి, వర్థంతుల సందర్భములో రాజ్ ఘాట్ వద్ద భజన కార్యక్రమాలు నిర్వహింపబడతాయి.
రాజ్ ఘాట్ అను మాటకు రాజ్య సదనం అనునది అర్థముగా భావించవచ్చు యమునానదీ తీరంలోనే రాజ్ ఘాట్ సమీపంలో ఇతర ప్రముఖ నాయకుల సమాధులు మరియు స్మారక స్థలాలు ఉన్నాయి. భారత వ్యవసాయ ఉద్యానవన సంఘానికి కార్యదర్శిగా, భారత ప్రభుత్వమందు ఉద్యానవన కార్యక్రమాలకు నిర్వాహకునిగా పని చేసిన ఆఖరి ఆంగ్లేయుడైన సిడ్నీ పెర్సీ-లాంకాస్టర్ ఈ స్మారకస్థలికి రూపకల్పన చేసారు.
రాజ్ ఘాట్ కి ఉత్తరాన శాంతివన్ పేరుతో జవహర్‌లాల్ నెహ్రూ సమాధి ఉన్నది. దేశదేశాల అధ్యక్షులు, అధికారులు నాటిన మొక్కలతో కూడిన ఒక చక్కని ఉద్యానవనం ఇక్కడ ఉన్నది. నెహ్రూ మనవడైన సంజయ్ గాంధీ సమాధి నెహ్రూ సమాధి పక్కనే ఉన్నది.
Other Ghats / ఇతరనాయకుల సమాధులు | ||
నాయకుని పేరు | రాజకీయ స్థానం | స్మారక స్థలం |
జవహర్‌లాల్ నెహ్రూ Jawaharlal Nehr | ప్రధానమంత్రి Prime Minister | శాంతివన్ Santivan |
లాల్ బహదూర్ శాస్త్రి Lalbahudar Sastry | ప్రధానమంత్రి Prime Minister | విజయ్ ఘాట్ Vijay Ghat |
ఇందిరా గాంధీ Indira Gandhi | ప్రధానమంత్రి Prime Minister | శక్తి స్థల్ Sakthisthal |
జగ్ జీవన్ రాం Jagajeevan Ram | ఉప ప్రధానమంత్రి Dy.Prime Minister | సమతాస్థల్ Samatasthal |
చరణ్ సింగ్ Charan Singh | ప్రధానమంత్రి Prime Minister | కిసాన్ ఘాట్ Kisan Ghat |
రాజీవ్ గాంధీ Rajeev Gandhi | ప్రధానమంత్రి Prime Minister | వీర్ భూమి Veer Bhoomi |
జ్ఞాని జైల్ సింగ్ Gnani Jailsingh | భారత రాష్ట్రపతి President | ఏక్తా స్థల్ Ekta Sthal |
శంకర్ దయాళ్ శర్మ Sankar Dayal Sarma | భారత రాష్ట్రపతి President | …….. |
ఇప్పటి వరకూ మీరు చదివినది ఢిల్లీ నగరం గురించి చాలా తక్కువ. ఢిల్లీ నగరం గురించి మీరు వాస్తవంలో తెలుసుకోవాలంటే, తప్పక దానిని దర్శించ వలసినదే. మరి ఒక్కసారి దర్శిస్తే చాలు, మీరు ఆనంద ఉత్సాహాలతో, ఎన్నో మధురానుభూతులతో మరొక్కసారి దానిని పర్యటించ వలసినదే.
What are some unknown amazing facts about Rashtrapati Bhawan, Delhi?
- The Rashtrapati Bhawan also known as the Presidential Palace is the second largest in the world after the Quirinal Palace, Rome , Italy
- It was designed by a British architect named Sir Edwin Lutyens, Its construction started in 1912 and was completed in 1929. It took nearly 17 years and nearly 29000 workers.
- With having a floor space of 200000 sq ft, Rashtrapati Bhavan has four floors and 340 rooms.
- It is said that over 700 million bricks and three million cubic feet of stones were used in the construction of Rashtrapati Bhavan.
- There has been no steel used in its construction
- This lovely and attractive garden has a number of diverse flowers and shrubs, along with fountains which make it more beautiful.
- The Mughal Garden is spread over 15 acres and is open to the public during Udyanotsav. The garden has 159 varieties of roses, 70 types of seasonal flowers, 60 types of bougainvilleas and 50 varieties of trees.
- In the Gift Museum of Rashtrapati Bhavan, the King George V’s silver chair of 640 Kg is there in which he sat at the Delhi Durbar in 1911.
- Amidst tight security, the garden opens for public during the months of February and March.
- Statue of Gautama Buddha which belongs to the golden age of art and culture during Gupta age around 4th-5th Century was there at the back of Durbar Hall of Rashtrapati Bhavan.
- One more impressive thing is the Banquet Hall of Rashtrapati Bhavan in which 104 guests can sit at one time
- EverySaturday at 10 am a ceremonial ‘change of Guard’ ceremony held for 30minutes and open to the public.
Delhi Metro
Before the Delhi Metro ran across every nook and corner of the national capital, commuters had to deal with the DTC bus mania. People would reach their destination pushing and shoving each other in crowded and crumbling buses. Within 16 years of its operation, the Delhi metro network is recognized as the best in the world.
With a total operational length of 327 km with 236 stations en route, the Delhi metro has joined the golden club of London, Shanghai, Beijing and New York metro network that have a metro network length of more than 300 kms.
Around 2.8 million people travel everyday in eight coach metro trains where the first one in the moving direction is always reserved for women. From not only connecting main hotspots in Delhi to NCR like Noida and Gurgaon, its automated train doors open and close more than 25 lakh times everyday!
Many stations even have fine art murals, exhibitions and museums that take the riders through a brief journey of the DMRC.
Hauz Khas On Yellow And Magenta Line Is The Deepest Station In Delhi
Janakpuri West Metro Station Has The Tallest Escalator In India
The height of Janakpuri-West escalators is equal to that of a five-storey building. The horizontal length is equal to 35.3 metres.
Ashram Metro Station On Pink Line Touted As World’s Smallest Station
Dhaula Kuan Is The Highest Point Of The Delhi Metro Network
Located at a height of 23.6 metres, Dhaula Kuan metro station located on the Delhi Airport Express Line is the highest point of the Delhi Metro Network and is as tall as a seven storey building.
Almost nine colors have been used so far for color coding of operational metro lines- Yellow, Blue, Red, Green, Violet, Magenta, Orange, Pink and Grey. More than 18.5 lakh people use smart cards while travelling in the metro everyday.
You must log in to post a comment.