గంగోత్రి – ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం

గంగోత్రి, ఇది ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 మీ. ఎత్తున, హిమాలయాల పర్వత శ్రేణులలో ఉన్నది. ఈ ప్రదేశం భగిరథి నది ఒడ్డున ఉన్నది. గంగోత్రి ‘చార్ ధామ్’ మరియు ‘దో ధామ్’ ఈ రెండిటి యొక్క పవిత్ర స్థలం. పురాణాల ప్రకారం, గంగా దేవత భగీరథ రాజు, అతని పూర్వీకుల పాపాలను కడిగివేయటానికి నది రూపంలో వొచ్చింది. దీనినే గంగ నది అని పిలుస్తున్నారు. గంగ యొక్క ప్రవాహవేగ ఒరవడి భూమి కొట్టుకుపోకుండా, శివుడు అతని శిఖలో గంగను బంధించాడు. గంగా నది లేదా గాంజెస్ యొక్క మూలం,గంగోత్రి నుండి 19 కి. మీ. దూరంలో ఉన్న గౌముఖ్ . గంగానది ఆవిర్భవించినప్పుడు, దీనిని ‘భగీరథి’ అని కూడా పిలిచేవారు.   భగిరథి నది ఎగువ పరీవాహక ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మంచు పర్వతాలు, హిమానీనదాలు, పొడవైన గట్లు, లోతైన సన్నని త్రోవలు, ఊర్ధ్వ శిఖరాలు మరియు సన్నని లోయలు ఉన్నాయి. దీని యొక్క ఎత్తు 1800 నుండి సముద్ర మట్టానికి 7083 మీటర్ల వరకు ఉంటుంది. పర్యాటకులు ఇక్కడ ఉప ఆల్పైన్ కానిఫేర్ అడవులు, ఆల్పైన్ పొదలు మరియు ఆకుపచ్చ పచ్చిక బయళ్లను చూడవొచ్చు. ఈ అడవిని ఇండో-చైనా సరిహద్దు వరకు విస్తరించిన ‘గంగోత్రి నేషనల్ పార్క్’ గా ప్రకటించారు. గంగోత్రి, పురాతన ఆలయాలు మరియు మతపరమైన నమ్మకాలకు ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంతంలో గంగోత్రి ఆలయం ఒక ప్రధాన హిందూ మతం పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని గూర్ఖా రాజు, అమర్ సింగ్ తాప18 వ శతాబ్దం లో నిర్మించారు. భక్తులు అధిక సంఖ్యలో గంగా దేవతను ఆరాధించటానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. పర్యాటకులు ఇక్కడ ఉన్న గ్యానేశ్వర్ ఆలయం మరియు ఏకాదశరుద్ర ఆలయాన్ని కూడా సందర్శించవొచ్చు. ఇక్కడ జరిగే ‘ఏకాదశ రుద్రాభిషేకం పూజ’ చాలా ప్రశస్తి చెందింది.

భగీరథి శిల మరియు గంగోత్రిలో మునిగినట్లు ఉన్న శివలింగం వివిధ మత విలువలకు సంబంధం కలిగి ఉన్నాయి. ఈ సహజ శివలింగం శీతాకాలంలో నీటి మట్టం తగ్గి ఉండటం వలన, ఈ కాలంలో మాత్రమే కనిపిస్తుంది. భగీరథి శిల, ఈ రాయి మీదే భగీరథ రాజు తపస్సు చేశారని ఒక నమ్మకం. పర్యాటకులు, గంగోత్రి ఆలయానికి దగ్గరలో ఉన్న ‘గౌరికుండ్’ మరియు ‘సూర్య కుండ్’ కూడా సందర్శించ వొచ్చు.

గంగోత్రిలో ట్రెక్కింగ్ అనుభూతిని పూర్తిగా పొందవొచ్చు. ఈ పట్టణం నుండి చిన్న ట్రెక్ ద్వారా ‘పాండవ గుఫా’ చేరుకోవొచ్చు. మహాభారత వీరులు మరియు రాజులు అయిన పాండవులు ధ్యాన ప్రదేశం ఈ గుహ (హిందీలో ‘గుఫా’) అని ఒక నమ్మకం.సముద్ర మట్టానికి 3000 మీ. ఎత్తున ఉన్న ‘దయార బుగ్యాల్’ ను పర్యాటకులు ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవొచ్చు. ఇది చాలా ఎత్తులో ఉన్న అందమైన గడ్డి మైదానం, ఇక్కడ నుండి పర్యాటకులు హిమాలయాల అద్భుతమైన సౌందర్యాన్ని ఆస్వాదించవొచ్చు. దీనిని చేరుకోవాలంటే, రెండు గ్రామాలు, ‘బర్సు’ మరియు ‘రైతల్’ నుండి ట్రెక్కింగ్ దారులనుండి చేరుకోవొచ్చు. ఈ ట్రెక్కింగ్ దారులగుండా వెళ్ళేప్పుడు ‘శేష్నాగ్ ఆలయాన్ని’ సందర్శించవొచ్చు.ఇక్కడ పర్యాటకులు శీతాకాలంలోనార్డిక్ మరియు ఆల్పైన్ స్కైయింగ్ కూడా అనుభూతి చెందవొచ్చు. ఆలి, ముండలి, కుష్ కళ్యాణ్, కేదర్ కాంత, టెహ్రీ గార్వాల్లోని, బెడ్ని బుగ్యల్ మరియు చిప్లకోట్ లోయ దగ్గరలో ఉన్న స్కైయింగ్ కు అనువైన స్థలాలు. గంగోత్రి పట్టణంలో, గంగోత్రి-గౌముఖ్ -తపోవన్ ట్రెక్కింగ్ స్థావర కాంప్ ఉన్నది. ‘కేదార్తల్’ ను కూడా ట్రెక్కింగ్ మార్గానికి అనుసంధించారు. గంగోత్రికి చుట్టుపక్కల ప్రాచుర్యంలో ఉన్న గాంజెస్ హిమనదం, మనేరి, కేదార్ తల, నందనవన్, తపోవన్ విశ్వనాధ్ ఆలయం, దోడి తల్, తెహ్రి, కుటేటి దేవి ఆలయం, నచికేత తల్, గంజ్ఞాని మొదలయిన వాటిని కూడా పర్యాటకులు సందర్శించవొచ్చు.

దీనిని విమానం, రైల్, బస్సు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవొచ్చు. డెహ్రడున్ లో ఉన్న జోల్ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీలను అద్దెకు తీసుకుని ఇక్కడకు చేరుకోవొచ్చు. ఇందిరా గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్,న్యూ ఢిల్లీ నుండి డెహ్రడున్ కు చాలా తరుచుగా విమానాలు అందుబాటులో ఉన్నాయి. రిషికేశ్ రైల్వే స్టేషన్ నుండి కూడా రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. దగ్గరలో ఉన్న నగరాలనుండి గంగోత్రికి బస్సులు కూడా పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి.

%d bloggers like this: