బ్రిటిష్ వారు ఇక్కడ ఉన్నపుడు ఈ ప్రాంతం యొక్క తీరు, రూపు రేఖలు కెనడా ని పోలి ఉండడం తో co-canada అని పెట్టారు. Co-canada కో-కెనడ కాస్త కాల క్రమేణా కాకినాడ అయ్యింది. ఈ ఊరి పట్టణ ప్రణాళిక మరియు రోడ్లు మద్రాస్ ఇప్పటి చెన్నై ని పోలి ఉండడం తో దీనిని రెండవ మద్రాస్ అని కూడా అంటారు. ప్రశాంతం గా ఉంటుంది అని, విశ్రాంత ఉద్యోగులకు స్వర్గధామం అంటారు(pensioners paradise) అంటారు. చాలా మంది రిటైర్ అయ్యాక తమ శేష జీవితాన్ని ఇక్కడ గడపాలని అనుకుంటారు. ఇంకా fertilizers city అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ nfcl,gfcl అని పెద్ద fertilizer సంస్థలు ఉన్నాయి. ఇప్పటికీ లింగంపల్లి నుండి కాకినాడ వెళ్లే ఒక రైలుకు పేరు co-canada ఎక్స్‌ప్రెస్ అనే ఉంటుంది.
భళా బుట్ట భోజనం.. కమ్మని విందుకు కేరాఫ్ అడ్రస్ సుబ్బయ్యగారి హోటల్!
కాకినాడ వెళ్తే తప్పకుండా సుబ్బయ్యగారి హోటల్లో భోజనం చేయాలని చెబుతారు.

సుబ్బయ్యగారి హోటల్’కు దాదాపు 68 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ప్రకాశం జిల్లా నుంచి కాకినాడకు వలస వచ్చిన సుబ్బయ్య 1950లో పది మందితో కలసి కాకినాడలో చిన్న మెస్ ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్లేటు భోజనం కేవలం 50 పైసలకు విక్రయించేవారు. 1955లో ఈ మెస్‌ను ‘శ్రీ కృష్ణ విలాస్’ పేరుతో హోటల్‌గా మార్చారు.
ఉభయ గోదావరి జిల్లా్ల్లోనే కాదు ఫేమస్ శాఖాహార హోటల్‌గా పేరొందిన ఈ హోటల్..

ఈ హోటల్‌ను ఏర్పాటు చేసిన సుబ్బారావు కస్టమర్లను ఎంతో మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తూ కడుపు నిండా భోజనం పెట్టేవారు. దీంతో కస్టమర్లు ఆ హాటల్‌ను ‘సుబ్బయ్య హోటల్’ అని పిలిచేందుకే ఇష్టపడేవారు. చివరికి ఆ పేరే బ్రాండ్‌గా మారింది. ‘సుబ్బయ్యగారి హోటల్’గా ఆహార ప్రియుల మనసు దోచుకుంటోంది.
You must log in to post a comment.