అండమాన్ మరియు నికోబార్ ద్వీపాల భౌగోళికత పరిశీలిస్తే……
ఈ ప్రదేశం సుమారు 8000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం కలిగి అనేక ప్రకృతి దృశ్యాలతో మీ రాకకై ఎదురు తెన్నులు చూస్తూ ఉంటుంది.
ఈ ప్రదేశం భారతదేశానికి దక్షిణ దిశగా చివరి భాగంలో ఉండటమే కాదు, బంగాళా ఖాత సముద్రంలో మనకు ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటూ అతి పెద్ద కోస్తా తీరం కలిగి ఉంది.అండమాన్ మరియు నికోబార్ అనే ఈ రెండు ద్వీపాలు పది డిగ్రీల ఉత్తర అక్షాంశంచే వేరు చేయబడుతూ రెండు విడి విడి ద్వీపాలుగా ఉన్నాయి. మరి ఈ ద్వీపాలను చేరాలంటే, పోర్ట్ బ్లెయిర్ లోని ప్రత్యేక విమానాశ్రయం ద్వారా వెళ్ళవలసిందే. ద్వీపాలన్నిటిలోను పోర్ట్ బ్లెయిర్ అధిక జనసాంద్రత కలిగి ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్ నుండి మీరు ఏ రకమైన రవాణా అయినా సరే చేపట్టవచ్చు. ఉత్తరం నుండి దక్షిణ దిశగా ఈ ద్వీపాలు నీటిలో ఎత్తైన పర్వత శ్రేణులతో సుమారు 800 కిలో మీటర్ల వరకు వ్యాపించి ఉంటాయి. పోర్ట్ బ్లెయిర్ కు వెళ్ళాలంటే, తూర్పు కోస్తాలో కల భారతీయ ఓడరేవులైన చెన్నై లేదా మద్రాస్ మరియు కోల్ కటా లేదా కలకత్తాలనుండి కూడా ఫెర్రీలో చేరుకోవచ్చు.
అండమాన్ మరియు నికోబార్ దీవులు సందర్శనలో మీరు ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు
అండమాన్ మరియు నికోబార్ దీవులు ఒక అంతు లేని పరిశుభ్రమైన ఇసుక కల బీచ్ ల సముదాయాలుగా ఉంటాయి. మీరు స్కూబా డైవింగ్ లేదా నీటి లోపలి లోతులను అన్వేషించాలన్నా లేదా అక్కడ కల మొక్కలు, జంతువుల సంపదలను అన్వేషించాలన్నా ఈ దీవులు సందర్శించి అంతులేని ఆనందాలు, ఎన్నో ఆశ్చర్యాలు పొందాల్సిందే. మీకు మరో లబ్దిగా ఈ దీవులు ఇటీవలే, పర్యావరణ స్నేహప్రదేశాలుగా గుర్తించబడి ప్రకటించబడ్డాయి.
మీకు లభించే ఆకర్షణలు అంతూ పొంతూ లేని బీచ్ లు చూడటంతో ముగిసిపోవు. లేదా స్కూబాతో సరిపోవు. ఈ దీవులలో అతి విశాలమైన దట్టమైన అరణ్యాలు కూడా ఉన్నాయి. వీటిలో వందలాది విభిన్న జాతుల పక్షులు, పూలు వంటివి ప్రత్యేకించి జంటలకు హనీమూన్ ఆనందాలు మరింత పెంచుతాయి. పర్యాటకుల కొరకు స్ధానికులు చేసే ఏర్పాట్లు పర్యావరణ స్నేహపూరితంగా ఉండి, నగరాలనుండి దూరంగా మీరు పొందగల కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, వెలుతురు, నీరు మొదలైనవి అందిస్తాయి. అండమాన్ మరియు నికోబార్ దీవులు ఎంత ప్రత్యేకం అని పర్యాటకులకు తెలుపాలంటే, ఇప్పటికి ఇక్కడి అడవులలో సుమారు 2200 మొక్క జాతులు గుర్తించబడ్డాయి. వీటిలో సుమారు 1300 జాతులవరకు మన భారత ప్రధాన భూభాగం కలిగి ఉంది.
అండమాన్ మరియు నికోబార్ దీవులు అలంకరణకు ప్రసిద్ధి గాంచిన షెల్ ఫిష్ లేదా ఓస్టర్లకు అతి పెద్ద మార్కెట్.ఇక భవిష్యత్తులో వేసవి సెలవులకు ఈ ద్వీపాలు ప్రధాన విశ్రాంతి నిలయాలుగా భారత దేశంలో పేరు తెచ్చుకోనున్నాయి. హేవ్ లాక్ ద్వీపంలోని రాధానగర్ బీచ్ ను పేరొందిన టైమ్ మేగజైన్ వారు ఇటీవల ఆసియాలోనే అతి గొప్పదైన బీచ్ గా వర్ణించారు. హేవ్ లాక్ బీచ్ తన సుందరమైన నీలను నీటి ప్రవాహాలతో అనేక జలచరాలతో ఎంతో ఆకర్షణీయంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.
అండమాన్ లో విశ్రాంతి సెలవులు అంటే చాలు పర్యాటకులు జాలీబాయ్ చూసేందుకు ఇష్టపడతారు. జాలీబాయ్ ద్వీపం పక్కనే కల హేవ్ లాక్ దీవి మరియు సింకే దీవి లతో కూడా కలిపి మహాత్మ గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ గా చెపుతారు. ఈ పార్క్ నే వాండూర్ మెరైన్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. కాలుష్యం ఏ మాత్రం లేకుండా నియంత్రణ చేయటం వలన, స్వచ్ఛమైన మరియు నిర్మలమైన వాతావరణం కారణంగా ఈ ప్రాంతాన్ని పర్యాటకుల స్వర్గంగా చెప్పవచ్చు. ఇక్కడి జలచరాల జీవనం, స్వచ్ఛమైన అనేక పగడపు దిబ్బలు, మొక్క మరియు జంతు శ్రేణులు వంటివి ఈ ప్రాంతంలో మరెక్కడా లభించవు.
మరి ఇంత అందమైన, అనేక విశిష్టతలు కల ఈ ద్వీపాలను చేరుకోవటం ఎలా?
అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలను చేరుకోవటం చాలా తేలిక. భారతదేశంలోని అనేక ఎయిర్ లైన్ సంస్ధలు పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం అయిన వీర సావర్కార్ విమానాశ్రయానికి కోల్ కటా, భుమనేశ్వర్ మరియు చెన్నై లనుండి తమ విమానాలను నడుపుతున్నాయి. ఖ్యాతిగాంచిన ఓడ రవాణా సంస్ధ షిప్పింగ్ కార్బోరేషన్ ఆఫ్ ఇండియా ఎం.వి. నాన్కోవరీ అనే ఓడను చెన్నై మరియు పోర్ట్ బ్లెయిర్ ల మధ్య నెలకు రెండు సార్లు మరియు విశాఖ పట్లణం నుండి పోర్ట్ బ్లెయిర్ కు మూడు నెలలకు ఒక సారి నడుపుతోంది.
పోర్ట్ బ్లెయిర్ – అండమాన్ రాజధాని
పోర్ట్ బ్లెయిర్, కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలకు రాజధాని. ఇది దక్షిణ అండమాన్ ద్వీపంలో కలదు. పోర్ట్ బ్లెయిర్ లో సంవత్సరం పొడవునా ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటూ వర్షాలు పడే సరికి మంచి సెలవుల విశ్రాంతి ప్రదేశంగా మారిపోతుంది. ఈ ప్రదేశాన్ని దేశీయులే కాక విదేశీయులు సైతం బాగా ఇష్టపడతారు. ఈ దీవిలో కొన్ని ప్రాంతాలు విదేశీయులకు రిజర్వు చేయబడి ఉంటాయి.
పోర్ట్ బ్లెయిర్ అనేక కారణాలుగా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది భారతీయ త్రి సేవా దళాలకు ప్రధాన కార్యాలయంగా పని చేస్తుంది. అంటే, ఇక్కడ భారతీయ వైమానిక దళం, నౌకాదళం మరియు కోస్ట్ గార్డులు అధికంగా కావలి ఉంటారు. ఆహ్లాదకరమైన కొన్ని బీచ్ లకు, సెలవుల ప్రదేశాలకు నిలయంగా ఉండి పర్యాటకులకు ఆనందం కలిగిస్తుంది. అంతేకాక, ప్రసిద్ధి చెందిన కాలా పాని జైలు కూడా కలిగి ఉంది. కాలా పాని అంటే నల్లని నీరు జైలు అని అర్ధం . ఇది 1800 ల సంవత్సరంనుండి ప్రసిద్ధి చెందినది.
కాలాపాని జైలును 1800 ల సంవత్సరంలో బ్రిటీష్ వారు భారతీయ రాజకీయ ఖైదీలను, స్వతంత్ర పోరాటంలో బంధించేందుకు నిర్మించారు. ఈ జైలులో ఆనాటి బ్రిటీష్ అధికార్లు ఖైదీలను వివిధ రకాలుగా హింసించేవారని ప్రజలు చెప్పుకొనే వారు.
పోర్ట్ బ్లెయిర్ లో ఉన్నపుడు మీరు ప్రఖ్యాత మెరైన్ పార్క్ తప్పక చూడాలి. సముద్ర కార్యకలాపాలు, సముద్ర జీవితం, సుమారు 150 చిన్న చిన్నదీవులకు తిరగటం మొదలైనవి ఉంటాయి. సముద్ర జీవితంపై మీకు గల ఆసక్తిని బట్టి మీ టూర్ మరింత పెంచుకోవచ్చు లేదా కొద్ది గంటలకు తగ్గించుకోవచ్చు కూడాను.
జాలీ బాయ్
జాలీ బాయ్ దీవి పోర్ట్ బ్లెయిర్ ఓడరేవుకు సమీపంలో కలదు. చాలామంది పర్యాటకులు చెప్పినట్లు భూమిపై కల స్వర్గంలా ఉంటుంది. ఇది మహాత్మ గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ లో భాగంగా ఉండి వాండూర్ మెరైన్ నేషనల్ పార్క్ గా పిలువబడుతుంది. ఈ ప్రదేశం పర్యాటకులకు అధిక ఆనందాన్నిస్తుంది.. అక్కడకల పగడపు మరియు అందమైన తెల్లని మరియు పచ్చటి బీచ్ లతో వ్యక్తిగత బంధం ఏర్పరుస్తుంది. కొన్ని మార్లు ఒకటి లేదా రెండా డాల్ఫిన్ లను కూడా చూసే అదృష్టం కలుగవచ్చు.
జాలీబాయ్ దీవికి వెళ్ళటమే ఒక మరచిపోలేని అనుభవం. ఈ దీవికి వెళ్ళాలంటే అటవీ శాఖ అనుమతి కావాలి. ఫెర్రీ ప్రయాణానికి టికెట్లు కొనాలి. ఈటికెట్ కు రూ. 50 మరియు అనుమతి కి రూ.550 అవుతాయి. అయినప్పటికి మీ ఖర్చుకు తగ్గ ఆనందం లభిస్తుంది. ఫెర్రీ ప్రయాణం పోర్ట్ బ్లెయిర్ వద్ద మొదలవుతుంది. మీ వెంట గైడ్ లు ఉండి వివరిస్తూ అందమైన ప్రదేశాలు చూపుతూ అనేక శబ్దాలు, జలచరాలను చూపుతూ ప్రయాణింపజేస్తారు..
జాలీ బాయ్ దీవి చేరే సమయంలో పర్యాటకులను గ్లాసు అడుగు కల చిన్న చిన్న బోట్లలోకి చేరుస్తారు. ఈ గ్లాసు ద్వారా పర్యాటకులు పగడపు రాళ్ళను సముద్రంలో దీవి చేరుతున్న సమయంలో అడుగున చూడవచ్చు.
జాలీ బాయ్ దీవి లో నిబంధనలు అధికం. అక్కడకు పర్యాటకులు తమ స్వంత ఆహారం నీరు తీసుకు వెళ్ళటానికి లేదు. పోర్ట్ బ్లెయిర్ వద్ద భారత ప్రభుత్వం ఇచ్చే ఆహారం, నీరు మాత్రమే తీసుకు వెళ్ళాలి. ఇక జాలీ బాయ్ బీచ్ చేరితే చాలు మీకు అందమైన బీచ్ లు, పరిశుభ్రమైన ష్యాక్ లు కల్తీ లేని పరిసరాలు అక్కడ కనపడతాయి.
ఇందిరా పాయింట్, గ్రేట్ నికోబార్గ్రేట్ నికోబార్ ద్వీపాలలోనికోబార్ ద్వీపంలో దక్షిణ దిశలో చివరగా ఉండే ప్రదేశం ఇందిరా పాయింట్. అంతేకాక, భారతదేశానికి కూడా ఇది దక్షిణ దిశలో చివరి భాగం అవటంతో పర్యాటకులలో ప్రత్యేకించి స్ధానికులలో మరింత ఆసక్తిని కలిగిస్తుంది. 1972 నుండి పర్యాటకులు ఇందిరాపాయింట్ కు అధిక సంఖ్యలో వస్తూనే ఉన్నారు.
ఈ ప్రదేశానికి ఇందిరా పాయింట్ అని భారత దేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ పేరుతో పెట్టారు. ఇక్కడకల లైట్ హౌస్ అతి పెద్దది కావటమే కాదు, ఎంతో అందంగా కూడా ఉంటుంది. ఎర్రని మరియు తెల్లని చారలు కలిగి ఒక హెలిప్యాడ్ కూడా కలిగిన ఈ లైట్ హౌస్ చూచేందుకు ఎంతో బాగుంటుంది.
2004 లో వచ్చిన సునామి కారణంగా ఈ లైట్ హౌస్ కొంత నష్టపోయింది. అయితే, తర్వాతి కాలంలో బాగుచేయబడి మలేషియా, మలాక్కా ఇండియా మార్గంలో వచ్చే ఓడలకు సేవలందిస్తోంది. దీని రేంజి సుమారుగా 16 నాటికల్ మైల్స్ కలిగి ఉంది. పర్యాటకులకు అనుమతినిచ్చేది ఈ లైట్ హౌస్ వద్ద మాత్రమే. అక్కడకు వచ్చిన పర్యాటకులు అండమాన్ మరియు నికోబార్ దీవుల అందాన్ని తనివితీరా చూసి ఆనందిస్తారు.
అండమాన్ మరియు నికోబార్ దీవుల వాతావరణం ఎలా?అండమాన్ మరియు నికోబార్ దీవుల వాతావరణం, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలైన ధాయ్ లాండ్ మరియు సింగపూర్ ల వలెనే పెద్ద మార్పులు లేకుండా సంవత్సరమంతా ఒకే విధమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఈ దీవులను సందర్శించాలంటే అక్టోబర్ నుండి మే వరకు అనుకూలం. ఈ సమయంలో ఇక్కడ వార్షిక పర్యాటక ఉత్సవాలు జరుగుతాయి. అంతే కాక ఈ సమయంలో చక్కటి వర్షాలు పడి నీరు స్వచ్ఛంగా ఉంటుంది. బీచ్ లో ఒక రోజు గడపాలంటే ఏ మాత్రం వేడిగా ఉండదు.
ఈ ప్రాంత ఉష్ణోగ్రతలు సాధారణంగా 24 డిగ్రీలనుండి 32 డిగ్రీ సెల్షియస్ వరకు మారుతూంటాయి. చలికాలంలో ఒకటి లేదా రెండు డిగ్రీలు తగ్గుతాయి. వాతావరణం ఏదైనప్పటికి అండమాన్ నికోబార్ దీవులలో తేమ అధికంగా ఉంటుంది.
North Sentinel Island
North Sentinel Island is an island in the union territory in Andaman & Nicobar Island in the Bay of Bengal. It’s home to Sentenelese, who have continuously and violently rejected any kind of contact from the outer world. The Senteneles have attacked every ship or boat approaching North Sentinel Island. Indian Government has banned any kind of visit to this island as Sentenelese don’t want any contact with the outer world. This is the most dangerous place in India as Sentenelese have killed many people who visited this island and attacked even helicopters or drones flying above this island.(Information Credit: Wikipedia)
North Sentinel Island: Image
A tropical island forming a portion of the Andaman Islands in the Bay of Bengal area, the North Sentinel Island is a habitat of a tribe that has existed for about 60, 000 years. Below, some related incidents.
• In 1967, the Indian government initiated contact with Sentinelese in association with anthropologist T. N. Pandit. They tried extending a hand of friendship by leaving gifts for the tribe and beckoning them. However, the tribesmen would turn their backs on the government delegates and sit on their haunches in a defecating posture.
• Again, in March 1970, when Pandit’s team made another attempt to befriend the Sentinelese, the tribesmen hurled cryptic words at them. When the group signalled and spoke to make them believe they wish to buddy up, the tribe threw another shocker at the unassuming party. A woman from the tribe joined a warrior man and sat on the shore in a cosy embrace; other women of the tribe followed suit.
• After the 2004 Tsunami which wreaked havoc in South Indiaand parts of the Indian Ocean, the government had sent helicopters from the Indian Coast Guard to render aid to the Sentinelese and drop food packets. At this sight, a member of the Sentinelese tribe reacted by shooting arrows at it.
• In 2006, they showed their strong aversion to foreign contact by killing two Indian fishermen who accidentally went too close to the island in their boat while hunting for mud crabs.
Now the Indian government remotely monitor the island and declared that if you are visiting this island (within 3 km radius) it is a criminal offense.
Credit and little more information::
When I visited Andaman and Nicobar Islands in 2018, people complained about poor internet. A 2300 kms long submarine cable inaugurated today on 10-08-2020 changes that! In quick time and challenging geographies, the cable is all set to transform lives.
You must log in to post a comment.