కాంచేన్ జంగా – ఒక విహంగ వీక్షణం కోసం

కాంచేన్ జంగా ప్రపంచంలోని మూడో అతి పెద్ద పర్వతం. సముద్ర మట్టానికి 8586 మీటర్ల ఎత్తున ఇండియా – నేపాల్ సరిహద్దులో హిమాలయాల్లో వుంది ఈ పర్వతం. కాంచేన్ జంగా అంటే “అయిదు మంచు నిధులు’. ఇక్కడే ఉండే 5 శిఖరాలలో ఒక్కోటీ బంగారం, వెండి, జాతి రాళ్ళు, ధాన్యాలు, పవిత్ర గ్రంధాలకు నిదిగా వుంటాయి. కాంచేన్కాంచేన్ జంగా లో వుండే అయిదు శిఖరాలలో మూడు – ప్రధాన, మధ్య, దక్షిణ శిఖరాలు భారత దేశం లోని ఉత్తర సిక్కిం తోనూ, నేపాల్ లోని తప్లేజంగ్ జిల్లా తోనూ సరిహద్దును కలిగి వుంటాయి. మిగతా రెండు శిఖరాలు పూర్తిగా నేపాల్ లోనే వున్నాయి. అయినా కాంచేన్ జంగా ప్రాంతం లో 23000 అడుగుల ఎత్తున్న మరో 12 శిఖరాలు వున్నాయి. భూటాన్, చైనా, భారత్, నేపాల్ దేశాలు పంచుకు౦టున్న కాంచేన్ జంగా భూ భాగంలో మొత్తం 2329 చదరపు మీటర్లు వుండే 14 రక్షిత ప్రాంతాలు వున్నాయి. చాలా రకాల గన్నేరు చెట్లు, పూదోటలు, మంచు చిరుత లాంటి అరుదైన జాతులకు ఇది ఆలవాలం. ఆసియా లోని నల్లటి ఎలుగు బంటి, హిమాలయన్ కస్తూరి జింక,   ఎర్రటి పాండా, ఎర్రటి ఫీసంట్, గోధుమ వర్ణపు రోమ్మున్న పక్షి లాంటివి కూడా ఇక్కడ వుంటాయి.చరిత్ర కాంచేన్ జంగా కు చాలా ఆసక్తి కరమైన చరిత్ర వుంది. 1852 వరకు కాంచేన్ జంగా ను ప్రపంచంలోని ఎత్తైన శిఖరం అనుకునేవారు. 1849 లో భారతీయ త్రికోణమితి సర్వే జరిగిన తరువాత వివిధ కొలతలు, ప్రమాణాల ప్రకారం ఎవరెస్ట్ శిఖరాన్ని ప్రపంచం లోని అతి ఎత్తైన శిఖరంగా ప్రకటించారు. 1856 లో అధికారికంగా కాంచేన్ జంగా ను మూడో స్థానానికి మార్చారు.పర్యాటకండార్జీలింగ్ నుంచి కనపడే అద్భుతమైన దృశ్యాలకు కాంచేన్ జంగా సుప్రసిద్ధమైంది. కొండ పైకి ఎక్కడానికి అనుమతి చాలా అరుదుగా ఇస్తారు కనుక, ఈ పర్వత శ్రేణుల అందం ఇంకా అలానే కాపాడ బడుతూ వుంది. అలాగే రోజులోని వివిధ సమయాల్లో వివిధ రంగులు ధరిస్తుందని కూడా ఈ పర్వత శ్రేణి ప్రసిద్ది పొందింది.డార్జీలింగ్ యుద్ధ స్మారకం నుంచి కాంచేన్ జంగా శ్రేణుల అధ్బుతమైన దృశ్యాలు చూడవచ్చు. తెరిపిగా వున్న రోజున చూస్తె ఈ పర్వతాలు ఆకాశం నుంచి వేలాడుతున్న తెల్లటి గోడగా కనిపిస్తాయి. సిక్కిం వాసులు దీన్ని చాలా పవిత్ర స్థానంగా భావిస్తారు.పర్వతారోహకులకు అనుమతించిన మార్గాల్లో గోయేచా లా మార్గం, గ్రీన్ లేక బేసిన్ కు వెళ్ళే మార్గం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం లోకి వస్తున్నాయి.కాంచేన్ జంగా సందర్శనకు ఉత్తమ సమయం కాంచేన్ జంగా లో వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగానే వుంటుంది.

%d bloggers like this: