మొబైల్ కొనడానికి ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు

RAM – ఇది మన ఫోన్ లో ఉండే OS ( ఆపరేటింగ్ సిస్టమ్) సాఫ్ట్వేర్, మనము వాడే యాప్ డాటా, మనము ఈ క్షణం ఫోన్ లో ఏం చేస్తున్నామో ఆ డాటా దీనిలో ఉంటుంది. ఇది ROM, SD CARDS, కంటే కూడా చాలా త్వరగా READ చేయబడుతుంది. కాబట్టి ఇది ఫోన్ కి మెదడు లాంటిది. ఎంత పెద్ద బుర్ర ఉంటే అంత వేగంగా పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చేవి అన్ని ఎక్కువగా 4,6,8 GB లు ఉన్నాయి. మామూలు గా వాడటానికి 4GB చాలు. GAMING, EDITING, MULTI TASKING లాంటి వాటికి 8 GB ఉత్తమం.

ROM- ఇది మన ఫోన్ స్టోరేజ్. మన ఫోటోలు, వీడియోలు, యాప్లు, ఫైల్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాము. కాబట్టి ఇది కూడా ఎక్కువగా ఉండాలి. 64/128 GB సరిపోతుంది.

PROCESSOR – మన ఫోన్ పనితనం అన్నింటి కంటే దీని మీదే ఎక్కువ ఆధార పడి ఉంటుంది. కొత్త processor ఐతే వేగంగా పనిచేస్తాయి. SD 660 – SD 855 వరకు మంచివి. (లేదా) HELIO G80/G85 కూడా .

SCREEN DISPLAY FEATURES- 

  • ముందుగా SCREEN SIZE – 5–6 ఇంచులు బావుంటుంది. ఇది ఎవ్వరి వాడకాన్ని బట్టి వారు ఎంచుకోవచ్చు. GAMING కి ఐతే కాస్త పెద్దది బావుంటుంది.
  • తరువాత రిఫ్రెష్ రేట్ – 60–90–120 HZ లలో ఉన్నాయి. ఎంత ఎక్కువ REFRESH RATE ఉంటే అంత స్మూత్ గా ఉంటుంది వాడటానికి.60 HZ అంటే మన స్క్రీన్ నిమిషానికి 60 సార్లు refresh అవ్తుంది. 90 HZ అంటే 90 సార్లు, 120 HZ అంటే 120 సార్లు REFRESH అవ్తుంది.
  • తరువాత DISPLAY STYLE ఇప్పుడు SUPER AMOLED DISPLAY లు బావున్నాయి.
  • తరువాత రిజల్యూషన్ – ఇది ఎక్కువగా ఉంటే క్లారిటీ ఎక్కువగా ఉంటుంది.

BATTERY CAPACITY- ఇది మన ఫోన్ బ్యాటరీ MAh. ఎక్కువగా ఉన్నవి ఎక్కువ సేపు పని చేస్తాయి. 5000–6000 MAh ఇప్పుడు వరకు ఉన్నవి.

BUILD QUALITY – ఫోన్ తయారీ కి వాడినది లేక ఫోన్ నిర్మాణ స్థాయి అనొచ్చు. METAL అయితే బావుంటుంది. వెనకాల GLASS ఐతే గీతాలు పడవు.

OS/UI – ఆపరేటింగ్ సిస్టమ్ మరియు యూజర్ ఇంటర్ఫేస్. ఇవి LATEST UPDATED ఐతే మంచిది.

CAMERA MP – మామూలుగా అయితే ఎంత ఎక్కువ MP ఉంటే అంత మంచి ఫోటోలు వస్తాయి అంటారు. అందులో నిజం లేకపోలేదు, కానీ కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. ఫోటో క్లారిటీ కేవలం MP మీద ఉండదు. ఇంకా చాలా వాటి మీద ఉంటాయి. టూకీగా ఎక్కువ MP, APERTURE SIZE, PHOTO CONVERTING SOFTWARE, PROCESSING SOFTWARE బాగా ఉన్నది చూసి తీసుకోవచ్చు.

COLOUR – ఇది మీ ఇష్టం.

%d bloggers like this:
Available for Amazon Prime