
కావలసినవి: పనీర్ తురుము – రెండున్నర కప్పులు, బ్రెడ్ పౌడర్ – అర కప్పు, జీడిపప్పు పేస్ట్ – పావు కప్పు, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు – ఒకటిన్నర టీ స్పూన్లు, పెరుగు – 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్ చొప్పున, ఆమ్‌చూర్ పౌడర్– 2 టీ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు, గుడ్లు – 3, చిక్కటి పాలు – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – అవసరాన్ని బట్టి, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ: ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో పనీర్ తురుము, జీడిపప్పు పేస్ట్, బ్రెడ్ పౌడర్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఆమ్‌చూర్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, పెరుగు, 2 కోడిగుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు వేసుకుని ముద్దగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని, ప్రతి బాల్‌కి సన్నటి పుల్లను గుచ్చి పక్కన పెట్టుకోవాలి. అనంతరం రెండు చిన్న చిన్న బౌల్స్ తీసుకుని ఒకదానిలో మొక్కజొన్న పిండి, మరోదానిలో ఒక గుడ్డు, పాలు వేసుకుని, ఆ బాల్స్‌ని మొదట గుడ్డు మిశ్రమంలో ముంచి, వెంటనే మొక్కజొన్న పౌడర్ పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
You must log in to post a comment.