ప్రేమ ఓ ఊహ – పెళ్ళి రియాలిటీ

9 , 10 వ తరగతి చదువుతున్న అమ్మాయిల దగ్గరనుండి ఇంటర్ , డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు కూడా కొంతమంది ఇలానే ఆటో డ్రైవర్లతోనూ , బైక్ మెకానిక్ లతోనూ లేదా తమతోపాటే చదువుకునే వ్యక్తితో ప్రేమలో ఉన్నామనుకొని ఇలా ఇంట్లో వాళ్ళకి చెప్పాపెట్టకుండా పెళ్ళిళ్ళు చేసేసుకోవడం , మరలా రెండంటే రెండే వారాల లోపు ” వాడితో కలిసి నేనుండలేనని ” తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేయడం.

ప్రేమకి ఓ అమ్మాయి , ఓ అబ్బాయి ఉంటే చాలు – కానీ పెళ్ళికి కుటుంబం ” కూడా ” ఉండాలి – వివాహానంతరం జీవితంలో చాలా అంశాలుంటాయి – అవి పెద్దల సపోర్ట్ లేకుండా ఇద్దరూ సమన్వయం చేసుకు జీవించడం చాలా కష్టం ” – కనుక తాత్కాలిక ఆవేశాలతో ఇటువంటి అనాలోచిత చర్యలు చేయకండి

ఇద్దరికీ తమకంటూ ఓ సొంత వ్యక్తిత్వం , జీవితం ఏర్పడ్డాక ఉండే జీవితం వేరు – అసలు మీ జీవితం పట్ల మీకే ఓ అవగాహన రాకుండా ఇంకోకరిని జీవితంలోకి ఆహ్వానించడం నిజంగా అర్ధం లేని చర్య , మహా మూర్ఖత్వం – జీవితం ఊహించినంత గొప్పగా అయితే ఉండదు ఇటువంటి చర్యలతో

ప్రేమలో ఉన్నప్పుడు ఆకర్షణ రియాలిటీని కప్పేస్తుంది – ఆకర్షణ పొరని పక్కనపెట్టి మనసును సమర్ధించుకోకుండా ఎదుటి వ్యక్తిలో మంచి చెడూ రెండూ సహేతుకంగా బేరీజు వేసుకొని కానీ రిలేషన్ లోకి వెళ్ళకండి

ప్రేమలో ఉన్నప్పుడు నచ్చిన అంశాలే పెళ్ళయ్యాక నచ్చకపోవడానికి ప్రధాన కారణాలవుతాయి కొన్నికొన్ని విషయాలలో

అవతలి వ్యక్తి ” ఇలా ఉంటున్నాడు / ఉంటుంది కాబట్టి ప్రేమిస్తున్నాను ” తరహా ఆలోచనతో బంధంలోకి ఎంటర్ అవ్వద్దు – అలా ఎదుటి వ్యక్తి ఇలా ఉంటే నచ్చుతాడని అనుకొని ఆ తర్వాత తర్వాత అలా లేకపోతే మీ expectation దెబ్బతిని అవే కారణాలు ఎదుటివ్యక్తిని ద్వేషించడానికో లేక మీరు బాధపడడానికో కారణాలవుతాయి – కనుక ఏవో కొన్ని గుణాలు ఎదుటి వ్యక్తిలో చూసి రిలేషన్ లోకి ఎంటర్ కావడం కన్నా ఎదుటి వ్యక్తి బలాలూ , బలహీనతలపై ఓ స్పష్టత ఏర్పడి ” రియాలిటీని కూడా సమన్వయం చేసుకోగలను ” అనే సన్నద్ధత ఉంటే కానీ బంధంలోకి వెళ్ళకపోవడమే మంచిది

ఇద్దరు ఒకే చూరు కింద నివసించాల్సి వస్తే ఎదురుకోవాల్సిన ” రియల్ లైఫ్ ” అంశాలు అనేకముంటాయి – వీటికన్నిటికీ ఆర్ధికపరమైన స్థిరత్వం చాలా అవసరం – మిమ్మల్ని మీరు పోషించుకునే స్థాయి కూడా కలగకుండా బంధంలోకి అప్పుడే వెళ్ళడం భవిష్యత్తులో చాలా ఇబ్బందులకి దారితీస్తుంది

మన ఆలోచనలు , మన చేతల ప్రతిఫలమే మన జీవితం.

%d bloggers like this:
Available for Amazon Prime