మన గుణాలే మనకు ఆస్తి

ఆత్మసంతృప్తి:

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు.

పైన సామెతలో చెప్పినట్లు మనకుకొన్ని సార్లు అన్నీ ఉన్నప్పటికీ మనకి ఇష్టమైన పని చేయలేక పోవడం వల్లనో లేక మరే ఇతర కారణాల వల్లనో మన జీవితంలో ఏదో మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ లో పడి ఉన్న ఆనందాలను చూడలేము.

అలా కాకుండా మన మనసుకు నచ్చిన పని చేస్తూ, ఎవరినీ బాధ పెట్టకుండా అలా అని వారి చెప్పు చేతుల్లోనే నడవకుండా మనల్ని మనం హ్యాపీ గా ఉంచుకున్నంత కాలం మనం అదృష్టవంతులమే.

పాజిటివ్ ఆటిట్యూడ్:

జీవితంలో మనం పుట్టడమే పూల పాన్పు పై పుట్టుక పోయినా మన ఆలోచనా విధానం పాజిటివ్ గా ఉంటే మన జీవిత లక్ష్యాన్ని కొంచెం ఇష్టంతో కష్టపడి అయినా సాధించవచ్చు.

ఆత్మ విశ్వాసం:

మనం జీవితంలో చేయాలి అనుకున్న పనులు చేసే ప్రయత్నంలో చాలా మంది వారి మాటలతోనే మనల్ని వెనక్కు లాగే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారిని పట్టించుకోకుండా ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తే మనం గెలిచినట్లే.

%d bloggers like this: