మనిషి జీవితానికి పరమావధి

మనిషి జీవితానికి పరమావధి: జ్ఞానం.

జ్ఞాని ఎలా అవుతాడు?

సత్యం తెలుసుకున్నపుడు.

ఏది సత్యం?

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ

విశుధ్ధపరం స్వతస్సిధ్ధం

నిత్యానందైకరసం ప్రత్యగభిన్నం

నిరంతరం జయతి.

(తైత్తిరీయోపనిషద్ నుండి)

బ్రహ్మము సత్యము, అదియే జ్ఞానస్వరూపము, అది అనంతము. అలాగే అది శుధ్ధము, నిత్యము, పరము, స్వతసిధ్ధము అయినది. ఆనంద స్వరూపమైన బ్రహ్మము అభిన్నమైనది. బ్రహ్మము ఎల్లప్పుడూ ఉండేది, ఎల్లప్పుడూ జయము కలిగి ఉండేది.

సత్యం: ఆది, మధ్యాంతములు లేనిది, శాశ్వతమైనది, సర్వ వ్యాపి, సర్వ శక్తివంతమైనది, నిర్వికారం, నిరాకారం, నిర్మోహం, నిరామయం, నిత్య చైతన్యం, అనంతం –

ఆ సత్యమే దైవం.

సత్యం తెలుసుకున్నాక ఏమవుతుంది?

జ్ఞాని అవుతాడు.

తరువాత?

జ్ఞాని తనను తాను తెలుసుకుంటాడు.

తెలుసుకొని, తనను తాను సాధన ద్వారా జయిస్తాడు.

జయించినాక ఏమవుతుంది?

తాను, సత్యం వేరు కాదని గ్రహిస్తాడు.

గ్రహించి?

అహం బ్రహ్మాస్మి, అని తెలుసుకుంటాడు.

తరువాత?

సత్యమే దైవం, తనే సత్యం.

జ్ఞాని దైవం లో ఐక్యమవుతాడు.

మోక్షం సాధిస్తాడు.

మనిషి పరమావధి: జ్ఞాన సముపార్జన ద్వారా మోక్ష సాధన.

ఇది మనిషికి తప్ప, మరే ప్రాణికి సాధ్యం కాదు.

%d bloggers like this: