మానవునికి కోరిక, ఆశలు చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటాయి. మంచిగ బ్రతకాలి అని తహ తహ లాడుతుo టాడు. ఇది సహజం.
నమ్మకం అనేది ఒక వ్యక్తి పై ఆధార పడి ఉంటుంది. మీ పై మీకు నమ్మకం ఉన్నా ఒక్కోసారి విజయం రుచి చూడలేరు. ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా ఫలితం రాదు. కానీ అలాగని నిరుత్సాహం ఉండొద్దు. ముందుకే పోవాలి.
ఇప్పటి పరిస్థితుల్లో ఒక రోజు ముగిసింది అంటే మనం విజయం సాధించినట్టే.
అడుగడుగునా ఆటంకాలను ఎదిరించి పోరాడాలి. కోరికలు, ఆశలు ఒకరికి చెప్పుకునే వి కావు. అవి స్వతహాగా మనకి మనమే పెట్టుకొని ప్రయత్నించాలి.
మన మంచికి చేసే కోరికలు ఉండాలి కాని చెడుకి ఉపయోగ పడేవి వ్యర్దం.అవి ఎప్పటికైనా నశిస్తాయి.
ప్రయత్నించ కుండా ఏవి జరగవు. ఆశ ఉన్న ప్రయత్నం లేక పోతే వ్యర్థమే. పక్క వాడి విజయం చూసి మీరు అలా అవ్వాలని భావిస్తే నా దృష్టిలో అది తప్పు.అది అత్యాశ అవ్తుంది.
ఒకరి ప్రణాళిక ఇంకొకరితో కలవదు. మీ దారి మీదే. మీ విజయం మీదే. మీ విజయ పయనంలో ఎన్నో సలహాలు సూచనలు వస్తూ ఉంటాయి. అవి పట్టించు కోక పొతే మంచిది. చాలా రకాల సలహాలు మనకి తెలీకుండానే మనలో విశ్వాసాన్ని తీసేస్తాయి.
ముందు నేను నా ఆశల్ని ఎలా నెరవేర్చు కోవాలి అని పలు మార్గాలు మీరే ఎంచుకుంటే , వాటి కోసం ప్రయత్నిస్తే మంచిది. విజయం వస్తుందా లేదా అనేది తరవాత సంగతి. ఎంత బాగా ప్రత్నించాము అన్నది ముఖ్యం. 100% శాతం ప్రయత్నించి ఓడిపోయిన మీరు గెలిచారని అనుకోవాలి.
Desire is the first step to growth. Not every desire yields expected results. Results are arbitrary. Winning doesn’t matter as long as you battle out the best ways to success. Put your heart and soul in what you do, rest doesn’t matter.
You must log in to post a comment.