వ్యాపారం VS ఉద్యోగం

ఉద్యోగం – వ్యాపారం రెండు సమానమే. కానీ ఉద్యోగులకి వ్యాపారస్తులు – వ్యాపారస్థులకి ఉద్యోగులు అవసరం ఉంది.

ఉద్యోగం లో స్వేచ్చా – స్వాతంత్ర్యం ఉండదు, వ్యాపారం లో ఉంటుంది

ఉద్యోగం లో ఒకరి కింద పని చేయాలి – వ్యాపారం లో ఎవరికింద పని చేయక్కర్లేదు

ఉద్యోగం లో ఎదుగుదల తక్కువ – వ్యాపారం లో ఎదగడం ఎక్కువ ( కొన్ని సార్లు సర్వం ఊడ్చుకుపోతుంది )

ఉద్యోగస్తుడు ఉద్యోగం పోతే కంగారూ , బాధ కనబరుస్తాడు – వ్యాపారస్తుడు కొత్త విధానాన్ని ఆలోచిస్తాడు

ఉద్యోగం లో రిస్క్ తక్కువ – వ్యాపారం లో రిస్క్ ఎక్కువ

ఉద్యోగం జీవితం సాధారణంగా ఉంటుంది – వ్యాపారం లో జీవితం లో ఏ ఒక్కరోజు ఒకేలా ఉండదు.

ఉద్యోగం జీవితాంతం కష్టపడుతూనే ఉండాలి, రిటైర్మెంట్ కి దాచుకోవాలి , టాక్స్ రూపం లో సంపాదన హరించుకుపోతుంది – వ్యాపారం లో గట్టిగా 5 నుండి 10 ఏళ్లు కష్టపడితే చాలు, టాక్స్ తక్కువ పోతుంది, ఆదాయ మార్గాలు ఎక్కువ ఉంటాయి.

ఉద్యోగం ఉన్నవారి ఆలోచనలు పరిధి లో ఉంటాయి – వ్యాపారస్థుల ఆలోచనలు హద్దు ఉండదు.

ఉద్యోగస్తులు ఉద్యోగం తప్ప ఇంకేం చేయలేరు – వ్యాపారస్తులు కుటుంబానికి, సమాజానికి, ట్రావెల్లింగ్ కి, అన్నిటికీ సమయం ఇవ్వగలరు

ఉద్యోగులు జీవితం లో కోటి రూపాయలు చూడగలరా ? ఖరీదైన ఇల్లు, కారు, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలరా ( కేవలం సంపాదన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది – వ్యాపారస్థులు ఇవన్నీ చేయగలరు, ఏదైనా సాదించగలరు.

%d bloggers like this:
Available for Amazon Prime