వివాహం vs సహజీవనం

వివాహం అనేది ఒక వ్యవస్థ- ఏ దేశంలో అయినా దాని మూలాలు, భూమికి, గొడ్డుకీ ప్రతిగా వారసుడిని ఇచ్చి, పనికి వచ్చే పిల్లలను కనిచ్చే ఒక ఆడమనిషిని ఇవ్వడంతో మొదలయ్యింది. కాల క్రమేణా ఆ వ్యవస్థ రూపాంతరం చెందింది. ఒక ఇరవై సంవత్సరాల క్రితం వరకు ఆడవారికి ఆర్థిక స్వాతంత్ర్యం లేదు కాబట్టి, నచ్చినా నచ్చకున్నా, వివాహాలలో ఉండేవారు. విడాకులు అనే చట్టం మన దేశానికి వచ్చి గట్టిగా 75 ఏళ్ళు కాలేదు, అంత మాత్రం చేత మన వ్యవస్థ అద్భుతమని, న భూతో న భవిష్యత్ అని 90ల లో వచ్చిన తెలుగు సినిమా డైరెక్టర్ లాగా మనం భుజాలు తట్టేసుకో అక్కర్లేదు.

సహజీవనం అనగానే ప్రతి ఒక్కరూ ఊహించుకునేది, ఇవాళ ఒకరితో, రేపు ఇంకొకరితో అని, మన ఆలోచన అక్కడితో ఆగిపోతుంది, అటువంటి ఆలోచన ఉన్న వారు పెళ్ళి చేసికొని, సమాజానికి భయపడి ఉంటారే తప్ప తమకీ తమ మనసుకు విలువ ఇవ్వరు. నేను పెళ్ళి చేసుకున్నాను కాబట్టి నేను గొప్ప, వాళ్ళు నాకంటే భిన్నంగా ఉన్నారు కాబట్టి వారు కుక్కలతో సమానం.. ఇలా ఉంటాయి మాటలు..

ఏ వ్యవస్థ అయినా, అందులోని మనుషులని బట్టే ఉంటుది… అది పెళ్ళైనా, సహజీవనం అయినా..

పెళ్లికి, దానంతట దానికే ఏ గొప్పతనం ఉండదు మనం ఆపాదిస్తే తప్ప.. అలాగే సహజీవనానికి కూడా.. దానంతట దానికి ఏ అవలక్షణం ఉండదు మనం ఆపాదిస్తే తప్ప! మన వివాహ వ్యవస్థలో లోపాలు— ప్రేమ రాహిత్యం, వర కట్నం, ఆడవారిని తక్కువగా చూడడం, గృహహింస

అలానే, సహజీవనం లో కూడా లోపాలు ఉంటాయి.. అని మనం ఉండదలచిన వ్యక్తిని బట్టి, మనని బట్టి ఉంటాయి.. అంతే కానీ, భారతీయులు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని పెళ్ళి గొప్పదైపోదు.. పాశ్చాత్య దేశాల వారు సహజీవనం చేస్తున్నారు కాబట్టి అది చెడ్డదీ అయిపోదు.