మాటలు – విలువలు

” నిండు కుండ తొణకదు” అని వినే ఉంటారు. మన మాటలు ఎంతో విలువైనవి అది మనం తక్కువ గా మరియు ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోవాలి , లేదంటే మన మాటలకు విలువ ఉండదు.

మనం అందరం విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం. , కాని సరిగ్గా చూసినట్టు అయితే ఆయన అవతారమే మనకి ఎన్నో నేర్పిస్తుంది. పెద్ద చెవులు , చిన్న నోరు కి అర్ధం – మనం ఎక్కువ విని తక్కువ మాట్లాడాలి అని. అందుకే కొందరు అంటారు. ఆ దేవుడు మనకి రెండు చెవులు ఇచ్చి ఒకటే నోరు ఇచ్చారు అని. బహుశా అది నిజమేనేమో. పైగా, మనం ఎంత తక్కువ మాట్లాడితే మన శక్తి ( energy) ని కూడా అంత తక్కువ ఖర్చు అవుతుంది. తక్కువ మాట్లాడడం అనే కంటే అర్థవంతంగా మాట్లాడగలిగితే ఎక్కువ విలువ. ఇలా అయినప్పటికీ, మనం మంచి మాటలు మాట్లాడటానికి, లేదా మన ముందు ఏదైనా చెడు జరిగేటప్పుడు , దాన్ని ఆపటానికి మాత్రం కచ్చితంగా మాట్లాడాలి. మన ఖర్మ మన మాటల ద్వారా కూడా ఉంటుంది . మరి అలాంటప్పుడు ఎందుకు మనం ఉచితంగా మాటలు వదిలేయటం ?

మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మూడింటిని దృష్టి లో పెట్టుకొని మాట్లాడాలి.

నా మాటలకు ఎవరైనా బాధ పడతారా ?

నా మాటల వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా ?

నేను మాట్లాడేది నిజమేనా. ?

మన మాటలు ఎక్కడ అవసరమో అక్కడ కచ్చితంగా మాట్లాడాలి. కానీ ఆ మాటలు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు మూడు ముక్కల్లో మాట్లాడడం కంటే అవతలి వారికి విషయం అర్ధం అయ్యేటట్టు కాస్త వివరించి చెబితే ఆసక్తికరంగ ఉంటుంది. అంతే కాని డైలీ సీరియల్ లా సాగదిస్తే సోది అని సగం సగం వినడమో లేదా ఇంట్లో పాల కింద స్టవ్ ఆఫ్ చేసామా, ఇంటికి తాళం సరిగ్గా వేశామా అని ఆలోచిస్తుంటారు. రెండవది, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సంబంధంలేని లేదా మన గురించి మనమే కొట్టుకునే డప్పు చప్పుళ్ళకి విలువ ఉండదని గుర్తించుకోవాలి. మనం చేసాం అని చెప్పడం వేరు, మనమే చేసాం అని చెప్పుకోవడం వేరు. అర్థవంతమైన మాటల నుండే అర్థవంతమైన ఆలోచనలు కలుగుతాయి. అవే జీవితం యొక్క గెలుపు బాటలో పూల తివాచీలు.

%d bloggers like this:
Available for Amazon Prime