ప్రేమ – సైకలాజికల్ భావాలు

ప్రేమ ఒక మధురమైన అనుభూతి. ఒక వస్తువు మీద ప్రేమ కలిగింది అంటే దానిని అపురూపం గా దాచుకుంటారు . మనుషుల్ని ప్రేమిస్తే ,సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ప్రేమిస్తున్నారు , ప్రేమని పొంది అనుభవిస్తున్నారు అంటే వాళ్ళు కొంత మంది చాలా హుషారు గా వుంటారు. కొంత మంది నాకేంటి నేను సాధించాను అని చాలా గర్వంతో వుంటారు.

కొంత మంది పెళ్లి కుదిరింది అనుకోండి. రోజంతా మొబైల్ లో మాట్లాడుకుంటూ ,ప్రేమజంట లా ఫీల్ అవుతారు. పెళ్లి కట్నం మూలం గా, లేదా ఉద్యోగం మూలంగా జరుగుతోంది అని అసలు అనుకోరు. అది కూడా ప్రేమ గా భావిస్తారు. ప్రేమించడం వేరు , ప్రేమించుకున్నాం అని ఫీల్ అవ్వడం వేరుగా వుంటాయి.

నిజం గా ప్రేమ వుందా లేదా అన్నది పరిస్థితులు తెలుపుతాయి. ఒకమ్మాయి ఒకబ్బాయి నీ తెలివి తేటలు చూసి ప్రేమిస్తే ,ఆ అబ్బాయి రాంక్ బాగా లేకపోతే, నెమ్మదిగా గా రాంక్ వచ్చిన అబ్బాయిని చూసుకుని , ప్రేమను ఆ అబ్బాయి తో మొదలు పెడుతుంది. ఇక్కడ పరిస్థితులు మీద ఆధారపడింది ప్రేమ. ఒక అబ్బాయి ఒక అమ్మాయి నీ అందం చూసి ప్రేమిస్తే ,ఇంకా అందమైన అమ్మాయి కనుక దొరికితే నెమ్మదిగా ఆ అమ్మాయితో ప్రేమాయణం మొదలు పెడతాడు. మొత్తానికి ఎవరైనా వాళ్ళ కు లభించే విధంగా వుంటేనే ఇలాంటి ప్రేమలు మొదలు పెడతారు.

అందాన్ని ప్రేమించాలంటే ,ప్రపంచ సుందరిని ప్రేమించ వచ్చు.కానీ లభించదు కనుక ఆ ప్రేమను దొరికే వాళ్ళ మీద ప్రయత్నిస్తారు. ప్రేమించారు కాబట్టి ప్రపంచ సుందరి కానక్కరలేదు. ప్రపంచ సుందరి ఎలాగూ దొరకదు అందుకు ప్రేమించడం మానెయ్యరు కదా. ఎవరో ఒకరు గంత కు తగ్గ బొంత అని తృప్తి పడతారు. అందుకే ప్రేమ గుడ్డిది అంటారు. ఏం చూసింది ప్రేమించింది…… అని హాశ్చర్య పోతారు జనాలు.

అంతకంటే అందమైన వాళ్ళు వుండ రా లోకం లో ? వుంటారు కానీ దొరకాలి కదా… సరిపెట్టు కొని ప్రేమిస్తారు. ఈ విధంగా పరిస్థితులు ప్రేమను మారుస్తూ వుంటాయి. ఇవేమీ ఆలోచించకుండా ,ప్రేమించి విఫలం అవుతారు కొంత మంది.

బావా మరదళ్ల ప్రేమ వుండేది.అది అందరికీ ఆమోదయోగ్యం గా వుండేది. నిజానికి బావా మరదళ్ళు సహ జీవనం చేసేవారు. ఒకరి గురించి ఒకరు ముందే తెలుసుకుని వుండేవారు.

బాల్య ప్రేమలు నుండి హైస్కూల్ ప్రేమ, కాలేజీ ప్రేమ, యూనివర్సిటీ ప్రేమ, కొంచెం లేటు గా PhD ప్రేమ, లాండ్ లైన్ ఫోన్ ప్రేమలు నుండి పేజర్ ,మొబైల్, వాట్స్ అప్ , ఫేస్బుక్ , ఇలా ఇంటర్నెట్ ప్రేమల వరకూ, ప్రక్కింటి ప్రేమ నుండీ గ్లోబలింటి వరకూ ప్రేమ విస్తరించింది.

కొంత మంది అమ్మాయిలు కానీ,అబ్బాయిలు కానీ వాళ్ళ అవసరాలు తీరే దాకా చుట్టూ ఏదో వంకన తిరుగు తారు. ప్రపోజ్ చేస్తే ఎలాంటి ఉద్దేశ్యం లేదు అని చెబుతారు. లేదా నాకు ఇష్టమే ,మా ఇంట్లో అడగమంటారు. నిజంగా ప్రేమించిన వాళ్ళు ఇలా చెప్పరు. ప్రేమ చూపించి నప్పుడు ,ఇంట్లో వాళ్ళు గుర్తు వుండరు. ఈ లోగా ఎదుటి వారిని వాడుకుని ,వదిలేస్తారు. ఇది అబ్బాయిలు చేస్తే, అన్యాయం అంటారు. అమ్మాయి చేస్తే, అంత స్పందించరు. ఏది ఏమైనా అలా ఒకరిని ప్రలోభ పెట్టీ,మొహం చాటు వెయ్యడం వల్ల ,ఇంకొకరి తో ప్రేమాయణం మొదలు పెట్టడం వలన, తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఎలా గెలవాలో ప్రేమ కి తెలుసు.

%d bloggers like this:
Available for Amazon Prime