ప్రేమ – నిర్వచనం

పవిత్రమైనది, అగ్ని లాగా స్వచ్చమైనది, ప్రపంచాన్ని నడిపించేది ప్రేమే.

భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ , అల్లూరి సీతారామరాజు కి ఉన్నది అటువంటి ప్రేమ దేశం మీద

మదర్ థెరిస్సా, డొక్కా సీతమ్మ గారి వంటి వారికి ఉన్నది అటువంటి ప్రేమే – ప్రజల మీద

ప్రతి తల్లి దండ్రులకి ఉండేది కూడా అదే ప్రేమ – పిల్లల ప్రయోజకత్వం మీద

భార్య భర్తలకు ఉండేది అదే ప్రేమ – జీవిత భాగస్వామి మీద

ఇవన్నీ బాగానే ఉన్నాయి అసలైన ప్రేమ ఇద్దరు పెళ్లి కానీ స్త్రీ పురుషుల మీద అంటే మాత్రం ఇక్కడ మనం కొన్ని పచ్చి నిజాలు మాట్లాడుకోవాలి. అది ప్రేమ, ఆకర్షణ, మొహం , లేక కామమా

ఒక అమ్మాయి అబ్బాయి మంచి స్నేహితులుగా ఉన్నారు అనుకుందాం, జీవితాంతం వారు మంచి స్నేహితులుగా ఉండవచ్చు. పెళ్ళే చేసుకొవలసిన పని లేదు. ఒక అమ్మాయి లేదా అబ్బాయి అందంగా ఉంటే చూడటం వేరు. ఎందుకంటే కళ్ల ముందు బిర్యానీ పెడితే ఆ వాసన కి ఎలా నోరు ఊరుతుందో ఎవరయినా కళ్ళముందు నుండి వెళితే మనం తెలియకుండానే చూస్తాం. ఎందుకంటే అవి హార్మోనులు. ఇపుడు ఆ నచ్చిన వారిని చూసి వెంబడించడం, ప్రతి రోజు సైటు కొట్టడం, ప్రేమించమని వేధించడం ఇవన్నీ వెకిలి పనులు తప్ప ప్రేమ కాదు. దురదృష్టవశాత్తు సినిమాలు నవలలు లో అమ్మాయిని లేదా అబ్బాయి వెంట పడటం, ప్రేమించాను అని చెప్పడమే ఫ్యాషన్ లేదా అర్హత లా చూపిస్తున్నారు. మన యువత కూడా అదే గొప్ప విషయం అనుకుంటున్నారు.

ఒకవేళ మనకి లేదా మనం ఎవరికి అయిన నచ్చితే వాటికి కొన్ని లక్షణాలు కూడా చూసుకుంటారు. అందం, ఆస్తి, చదువు, గుణం ఇలా ఏదైనా అయ్యుండొచ్చు. మరి అలా ఉన్న అందరినీ ప్రేమిస్తూ పోతామా?

చాలామంది నేను చాలా సెన్సిటివ్ అండి, వేటికి తట్టుకోలేను అంటారు. నిజానికి వాళ్ళు సెన్సిటివ్ కాదు, భయస్తులు. సెన్సిటివ్ అంటే రోడ్డు మీద ఒక కుక్క పిల్ల చలికి వణుకుటుంటే చిన్న క్లాత్ కప్పుతామా, దానికి రెండు బిస్కట్లు పెడతామా, వృద్ద యాచకులకు పిలిచి ఇంత అన్నం పెట్టామా.

ప్రేమ కి నిజానికి హద్దులు లేవు. అది ఒకరితో ఆగదు. జాలి ఉండే వ్యక్తి ప్రతి జీవి ని ప్రేమిస్తాడు. ప్రేమించుట అంటే ప్రేమని యిచ్చుట అంతే తప్ప తిరిగి ప్రేమించుట కాదు.

కొందరు సచిన్ ని, అమితాబ్ బచ్చన్ ని, మాధురి దీక్షిత్ ని, మహేష్ బాబు ని, స్వామి వివేకానంద ని, రతన్ టాటా ని కూడా ప్రేమిస్తారు. కానీ జీవితం లో ఒక్కసారైనా వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఐ లవ్ యు అని చెప్పి నన్ను పెళ్లి చేసుకో అంటామా లేక ఇద్దరం డేటింగ్ కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని అడుగుతామా ఈ పని మనకి ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళనే అడుగుతూ ఉంటాం. కారణం అందరికీ లవర్స్ ఉన్నారు , మనకి ఉండాలి అని.

ఖచ్చితంగా కొందరు ఉండే ఉంటారు. వాళ్ళది నూటికి నూరు శాతం ప్రేమే. అది కాకుండా ఒక కొత్త జోనర్ లో ఇపుడు అందరూ ఏదైతే ప్రేమ ప్రేమ అనుకుంటున్నారో అది మాత్రం ప్రేమ కాదు అని ఉద్దేశం.

కొందరు నిజాయితీ గా ప్రేమించుకున్నాం, కలిసి బ్రతుకుతున్నాం, పెళ్లి చేసుకున్నాం పెద్దల్ని ఎదిరించి అంటే , మరి మనల్ని ప్రేమించిన తల్లిదండ్రులనే బాధ పెట్టినపుడు వచ్చే వారిని మాత్రం ఏం సంతోషం గా చూసకోగలం.

రాధ కృష్ణులు కూడా ప్రేమికులే కదండీ అంటే ఇక్కడ రాధ కృష్ణుణ్ణి జీవితాంతం ఆరాధించింది తప్ప తననే పెళ్లి చేసుకోలేదు. త్యాగరాజు కూడా రాముణ్ణి అలానే ప్రేమించాడు. రామకృష్ణులవారు కాళీ మాతను అదే విధంగా ప్రేమించారు.

ప్రేమ కి ఉన్న చాలా పేర్లు

అనురాగం – తల్లిదండ్రులతో

భాద్యత – కుటుంబం మీద

కర్తవ్యం – ఉద్యోగం మీద

భక్తి – దేవుడిమీద

స్నేహం – మిత్రులతో

అభివృద్ది – దేశం మీద

రక్షణ – సైనికులకు

%d bloggers like this:
Available for Amazon Prime