పెళ్లి – భవిష్యత్తు బాధ్యతలు

పెళ్లి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే తంతు అయినా, ఇద్దరి కుటుంబాలు, ఆ సభ్యుల భవిష్యత్తు కూడా వీరు ఇద్దరి పై ఆధార పడి ఉంటుంది. అమ్మాయి కేవలం భర్తను మాత్రమే దృష్టిలో పెట్టుకుని లేదా భర్తకు మాత్రమే చెందినది భావించడం ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నాం. అమ్మాయికి తన తల్లిదండ్రులు ఎంత ముఖ్యులతో, వారు శారీరకంగా , మానసికంగా బాగుండాలని ఎంతగా కోరుకోరుకుంటుందో, అబ్బాయి కూడా అంతే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అత్తమామల సేవ కోసమే అమ్మాయిజీవితం గడపాలని కోరుకునే వారి ఆలోచన లో ఎంత తప్పు ఉందో, పెళ్లి చేసుకున్న అబ్బాయి పట్ల తప్ప మరెవరి బాధ్యత తనది కాదని భావించడం కూడా అంతే తప్పు. అటువంటి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం లో తన బాధ్యత, అవసరం ఉందని అమ్మాయి తెలుసుకోవాలి.

అమ్మాయి అత్తవారింటికి ఎంత కొత్తో అత్తవారికి అమ్మాయి కూడా అంతే కొత్త కనుక కొన్ని అభిప్రాయ బేధాలు, అలవాట్ల లోని తేడాలు వల్ల, ఇరు వైపుల జరిగే చిన్న చిన్న తప్పుల్ని ఇద్దరు వదిలేస్తూ ఉండాలి. అమ్మాయి తన అమ్మగారింట్లో ఉండే వ్యక్తుల్ని ఎలా అయితే వారి ఇష్టాయిష్టాలు, గుణ దోషాలతో వారిని వారుగా స్వీకరిస్తూ ప్రేమించిందో అదే విధంగా అత్తవారింట్లో వారిని స్వీకరించే దృక్పథాన్ని అలవరచు కోవాలి. అలా స్వీకరించే మనస్తత్వం లేక పోవడం వల్లనే ఎన్నో కుటుంబాలలో చిన్న విభేదాలు ఆధారంగా అత్తమామలకు , కోడలికి పొసగక కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది.

క్రమంగా వారు శారీరికంగా బలహీనులు అయ్యాక వృద్దాశ్రమాలకు చేరే అగత్యం వస్తోంది. కుటుంబ కలహాలు ,వాటి కారణాలు నివారణ పై దృష్టి పెట్టిన న్యాయవాదులు, మానసిక శాస్త్రవేత్త లు ఈ విషయం తెలియజెప్పడం కోసమే పెళ్లికి ముందు కౌన్సిలింగ్ జరగాలని సూచిస్తున్నారు అంటే స్వీకరించడం అనే ఒక గుణం ఎంత తక్కువ గా ఉందో దాని తాలూకు పర్యవసానాలు ఎంత బాధాకరం గా ఉన్నాయో ఊహించ వచ్చు.

%d bloggers like this:
Available for Amazon Prime