ఈ నైపుణ్యం నేర్వనందువల్లనే, ఎన్నో జీవితాలు మొగ్గలోనే మాడిపోతున్నాయి. నిజానికి లౌకికంగా చూసినా, అలౌకికంగా చూసినా మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. ఏజీవికీ లేని మాట్లాడటం అనే నైపుణ్యం మానవుడి సొంతం. మిగతాజీవులకూ తెలివితేటలు ఉన్నా, మానవుడి తెలివి అద్భుతం.
ఆదిమ మానవుడి నుంచి ఇప్పటిదాకా జీవన విధానం ఎంతో మారిపోయింది. విద్యా, వైద్య , శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనూహ్యంగా అభివృద్ధి చెందాయి.
కాబట్టి, బతికివుంటే ఎన్నో అద్భుతాలు చూస్తాం. అందుకే కరుణశ్రీ గారు…
చచ్చిపోయినట్టి సార్వభౌమునికంటే
బ్రతికి ఉన్న చిన్న చీమ మేలు
బ్రతుకుకన్న వేరు స్వర్గమ్ము లేదురా
లలిత సుగుణజాల! తెలుగు బాల! అన్నారు.
జీవించడం.. అనే గొప్పవిషయాన్ని బాల్యం నుంచి చెప్పకపోవడం వల్ల ఎందరో క్షణికావేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఆ కుటుంబాలలో చీకటి మిగులుతోంది. అందుచేత, సమస్యలు వస్తే, తట్టుకుని జీవించగలిగే నైపుణ్యాన్ని ఇంటివద్ద నేర్పాలి.
You must log in to post a comment.