నవ వదు వరులు – సలహాలు – సూచనలు

సలహాలు

వివాహం అయిన మొదట్లోనే మీ మనసంతా కోసి అవతల వారికి ఇచ్చేయకండి. మెల్ల మెల్లగా ఒక్కో తెర తొలగి, ఒక్కో విషయం తెలుసుకుంటూ తెలుపుతూ ముందుకు సాగండి. మీ ఆవీ జీవీ అంతా పిండుకుని చెప్పినా అవతల వారికి అర్ధం ఔతుందని ఏమీ గ్యారంటీ లేదు. నిరుత్సాహం తప్ప ఇలా చేస్తే ఫలితం ఏమీ లేదు.

పెళ్లికి ముందే మాట్లాడుకున్నాం, నిర్ణయించుకున్నాం కనుక అలాగే జరగాలి జరుగుతుంది అని అనుకోకండి. పెళ్లికి ముందు అమ్మాయి అమెరికా వెళ్దాం అనచ్చు, పెళ్లయ్యాక ఇండియాలోనే ఉందామని అనుకోవచ్చు..పెళ్లికి ముందు పిల్లల ఇప్పుడే వద్దు అనుకోవచ్చు, పెళ్లయ్యాక వెంటనే కావాలి అనిపించవచ్చు. All decisions are and will always be subject to change. మీరు వారితో కలిసి ప్రయాణించడం, కలసిన మీ అభిప్రాయాలు, నిర్ణయాలు వల్ల కాక, కలిసి నడవాలి అనే మీ నిర్ణయం వలన మాత్రమే అయితే మంచిది.

మా అమ్మ ఇలా చేసేది, మా నాన్న ఇలా చేసేవారు లాంటివి మాట్లాడకూడదు. అంటే వాళ్ళని మర్చిపోవాలనో, గుర్తుతెచ్చుకోకూడదనో కాదు. పోల్చకూడదు అని. అమ్మా నాన్నలు చేసినట్టు మనకు ప్రపంచంలో ఎవరు చేయరు భార్య అయినా భర్త అయినా. అందుకే వాళ్ళతో పోల్చి పక్క వాళ్ళ నించి ఆశించకండి.భార్య అమ్మ ఎలా అవుతుంది. భర్త తండ్రి ఎలా అవుతాడు.

సాధారణంగా పెళ్లి అయిన తర్వాత భార్య భర్తలు ఇంట్లో వున్నా సమయంలో తమ ఇంటి వాళ్ళ నుంచి ఫోన్ వస్తే పక్కవారిని ఎక్కడిక్కక్కడే వొదిలేసి బాల్కనీ లోకో, లేకపోతే ఇంటి బయటకి పోయి మాట్లాడుతుంటారు . అలా చేయడం వల్ల మీ భాగస్వామి తాను వేరు మీ కుటుంబం వేరు అని, లేకపోతే తన మీద మీరు ఏమైనా చెప్తున్నారు ఏమో అని ఓ అని ఊహించుకుని బాధపడిపోతుంటారు . ఇలాంటివి వారు బయటకు చెప్పటం బహు అరుదు.

కాబట్టి ఇక మీదట ఇద్దరు ఇంట్లో వున్నపుడు ఫోన్ వస్తే ముందు మీ భాగస్వామిని ఫోన్ ఎత్తి మాట్లాడమని ప్రోత్సహించండి కావాలంటే “తాను స్నానం చేస్తున్నాడు/చేస్తున్నది” అని చెప్పి ఒక పది నిముషాలు మాట్లాడే విధంగా చేయండి. తద్వారా ఇరువురికి తమ భాగస్వామి యొక్క కుటుంబంతో చక్కటి సాన్నిహితం కలుగుతుంది. కలగకపోయిన అధమపక్షం దూరం లేక అపార్థం వంటివి జరగవు. ఒక సదభిప్రాయం కలుగుతుంది.

తల్లి తండ్రులకి ఊరికే రోజుకో పది సార్లు ఫోన్ చేసి మా అయన ఇలా అన్నారు, మా ఆవిడ ఇలా చేసింది లాంటివి చెప్పకూడదు.

స్నేహితులతో పూస గుచ్చినట్టు మన ఇంట్లో విషయాలు అన్నీ చెప్పెయ్యకూడదు.

బంధం నిలవాలంటే

ఒకరి మీద ఒకరికి నమ్మకం విశ్వాసం చాలా అవసరం. ముందు తరాలవారు సాధారణంగా తెలిసిన వారిని బంధుత్వం కలిసిన వారితోనే వివాహాలు జరపడం వలన భార్యభర్తలు ఒకరికొకరు తెలిసి వారి స్వభావం కూడా తెలిసేది. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబాలు కావడం వల్ల ఇబ్బందులొస్తే సర్దుబాటు చేయడం జరిగేది. కాలానుగుణంగా పరిస్థితులను బట్టి ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలయ్యాయి. తల్లిదండ్రులు ఇరువురు సంపాదనాపరులైతే కుటుంబాలుసాఫీగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడిచే పరిస్థితులొచ్చాయి. ప్రేమ వివాహాలు కులమత దేశ భాషల బేధాలను చెరిపి ఇరువురిని ఒకటిగా చేస్తున్నాయి. విద్య ఇరువురి సమానమైతే హక్కుల గురించి పోరాటాలు బలమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో భార్యభర్తలు ఒకరి మీద మరొకరు నమ్మకం కలిగుండడం తమ వైపు నుండి బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం చాలా ముఖ్యం. ఇరువురి వైపు నుండి సర్దుబాటు చేయడానికి మిత్రులు తప్ప మిగిలిన వారి ప్రమేయం లేకపోవడం సున్నితంగా ఆలోచించడం చాలా అవసరం. దానితో బంధం గట్టి పడి తమతమ బాధ్యతలు గుర్తుంచుకునేలా చేస్తుంది.

సూచనలు

పెళ్లి లో ప్రేమ కన్నా బాధ్యత కే ప్రాముఖ్యత ఎక్కువ. నేను జీవితాంతం నిన్ను ప్రేమిస్తాను అని మన మంత్రాలలో ఉండదు..అసలు ప్రేమ అన్న పదం వేదాలలో ఉందో లేదో… నేను నిన్ను ఎప్పుడూ విడువను, అతిక్రమించను అనే ఉంటుంది మన మంత్రాలలో. ప్రేమ ఒక భావన అది ఎప్పుడైనా ఎలాగైనా మారచ్చు. భావనలు, ఉద్వేగాలూ మారిపోతాయి. బాధ్యతలు అంత తేలికగా వదిలేవు కావు.

పెళ్లికి కావలసినది Compatability కాదు, companionship.

%d bloggers like this:
Available for Amazon Prime