టెన్నిస్ – ఆసక్తికరమైన విషయాలు

ఇది ముఖ్యంగా individual sport. అంటే ఇద్దరు లేదా గరిష్టంగా నలుగురు ఆడే ఆట. అందువల్ల ఒక్కో ఆటగాడి/ఆటగత్తె ప్రతిభ స్పష్టంగా తెలుస్తుంది. చాలా ఇతర ఆటలు గుంపుగా ఆడేవి కాబట్టి సమిష్టి కృషి వల్ల నెగ్గుతారు. ప్రత్యేకంగా ఒకరి ఆట బాగానే ఉన్నా ఆ ఒక్క కారణం వల్లే నెగ్గడం చాలా అరుదు.

టెన్నిస్ ఆట చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. క్రికెట్ ని gentleman’s sport అంటారు గానీ నిజానికి టెన్నిస్ ని అలా అనాలనిపిస్తుంది. ఇది చాలా ఖరీదైన ఆట. కానీ ఒకసారి నేర్చుకుని ఒక స్థాయికి ఎదగగలిగితే తర్వాత జీవితానికి ఢోకా ఉండదు.

టెన్నిస్ 12 వ శతాబ్దంలో ఫ్రాన్స్ లో మొదలైందట. అప్పట్లో దీన్ని అరచేతులతో (బాట్లు కాకుండా) ఆడేవారట. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా పాతవైన టెన్నిస్ పోటీలు వింబుల్డన్ టోర్నమెంట్. మొదటగా వింబుల్డన్ పోటీలు 1877 లో ఆడారు. అదే మొదటి గ్రాండ్ స్లామ్ కూడా. (ఆ పేరు మొదట దానికే వాడారు.)

తర్వాత యుఎస్ ఓపెన్ 1881 లోనూ, ఫ్రెంచ్ ఓపెన్ 1891 లోనూ, ఆస్ట్రేలియన్ ఓపెన్ 1905 లోనూ మొదలయ్యాయి. ఈ నాలుగింటినీ గ్రాండ్ స్లామ్ లు అని పిలుస్తారు. ఈ నాలుగు పోటీలు విడివిడిగా, అంటే వేరే వేరే సంవత్సరాల్లో నెగ్గితే కెరీర్ గ్రాండ్ స్లామ్ నెగ్గారని అంటారు. అన్నింటినీ ఒకే ఏడాదిలో నెగ్గితే గోల్డెన్ స్లామ్ నెగ్గారని అంటారు.

ప్రొఫెషనల్ టెన్నిస్ లో ‘ఓపెన్ ఎరా’ 1968 లో ఫ్రెంచ్ ఓపెన్ తో మొదలైంది. వింబుల్డన్లో ఆటగాళ్లకి ప్రైజ్ మనీ ఇవ్వడం కూడా అదే ఏడాది మొదలైంది.

ఆడవాళ్ల మాచ్ లకి, మగవాళ్ల మాచ్ లకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య సమానమే అయినా, అంటే టికెట్ డబ్బులు అంతే వచ్చినా ఆడవాళ్లకి ప్రైజ్ మనీ మాత్రం చాలా ఏళ్ల పాటు తక్కువగా ఇస్తూ వచ్చారు. దీని గురించి బిల్లీ జీన్ కింగ్ నించి చాలా మంది నిరసనలు తెలుపుతూ వచ్చిన తర్వాత చివరికి 2007 లో వింబుల్డన్లో ప్రైజ్ మనీ సమానం చేశారు. మిగిలినవి కూడా కొంచెం అటూఇటూగా అదే కాలంలో చేశారు.

ఆడవాళ్లలో అత్యధికంగా గ్రాండ్ స్లామ్ లు నెగ్గిన వ్యక్తి మార్గరెట్ కోర్ట్ – 24. మగవాళ్లలో మొదట రోజర్ ఫెదరర్ – 20. 20 వది 2018 లో నెగ్గాడు. తర్వాత ఈ మధ్యనే నాదల్ కూడా ఈ రికార్డు సమం చేశాడు.

టెన్నిస్ బంతులు మొదట్లో తెల్ల రంగులో ఉండేవి. 1986 లో వింబుల్డన్లో మొదటగా పసుపు రంగు బంతులు వాడడం మొదలుపెట్టారు. టెన్నిస్ కోర్టులు మొత్తం అయిదు రకాలు ఉంటాయి. గ్రాస్, క్లే, హార్డ్, కార్పెట్, వుడ్.

%d bloggers like this:
Available for Amazon Prime