పాండు రాజు మొదటి భార్య అయిన కుంతీ దేవి యొక్క వికృతి నామం గుంతి, గొంతీ. ఆ “గొంతీ” కి గౌరవ వాచకం గొంతి+అమ్మ = గొంతెమ్మ .
కురుక్షేత్ర యుద్ధం సమయంలో , కర్ణుడితో ఆమె మాట్లాడే సమయాన ఆమె “కర్ణుడూ బ్రతకాలి, అర్జునుడూ బ్రతకాలి” అని కోరుకున్నది, కానీ అది అసంభవము, అయితే ఇద్దరిలో ఒకరే ఉండగలరు తప్ప ఇద్దరు ఉండాలి అంటే అది సాధ్య పడని పని అని కర్ణుడు చెపుతాడు. కాబట్టి సాధ్యపడని కోరికలను గొంతెమ్మ కోర్కెలు అని అంటారు
“అవ్వా కావాలి , బువ్వా కావాలి ” అన్న జాతీయం కూడా ఈ కోవకు చెందినదే.
You must log in to post a comment.