ఏకాగ్రత

ఏకాగ్రత పెంచుకోవడం అందరికి, ముఖ్యంగా విద్యార్థులకు చాలా అవసరం. అందుకోసం కొన్ని పద్ధతులు పాటించవచ్చు:

మాములుగా అందరూ కంటితో చూస్తూ చదువుతారు. ఒకటి కంటే ఎక్కువ ఇంద్రియాల ప్రమేయం చదివే ప్రక్రియలో మనం భాగం చేయగలిగితే ఏకాగ్రత మెరుగవుతుంది. 1) పైకి చదవడం- చదువుతున్నది చెప్పడమే కాకుండా వింటాం కూడా. 2) చదివేది పుస్తకంలో క్లుప్తంగా రాయడం. 3) ఇప్పుడు చాలా రకాలైన పుస్తకాలు, పిడిఎఫ్ లు చదివి వినిపించే ఆప్స్ ఉన్నాయి. కుదిరితే ఇలా వింటూ, చూస్తూ, ఒక నోటు పుస్తకంలో ముఖ్యమైన వాటిని రాసుకుంటూ చదివితే ఏకాగ్రత కోల్పోవడం తగ్గుతుంది.

మన ఏకాగ్రతకు భంగం కలిగించే వస్తువులు (సెల్ ఫోను), వ్యక్తులను చదువుతున్నప్పుడు దూరం పెట్టాలి.

వీలయినంత వరకు చదవడానికి ఒక ప్రదేశం ( లైబ్రరీ, ఇంటి లో ఒక గది) నిర్ణయించుకుని అక్కడే ప్రతి రోజు చదివితే, మన బుర్రలో అది స్థిరపడి, ఆ ప్రదేశానికి వెళ్లిన వెంటనే వేరే ఆలోచనలు తకువవుతాయి. కొంతమంది ఎక్కువ సేపు ఒక చోట కూర్చోలేరు. అలాంటివారు 3–4 చోట్ల మధ్య మారుతూ మెల్లగా అలవాటు చేసుకోవచ్చు.

చదివే వ్యాసాలను ఫ్లో- చార్ట్స్, డైయాగ్రామ్స్ గా నోటు పుస్తకాలలో రాసుకుంటే బాగా గుర్తుంటాయి.

పైన పేర్కొన్న పద్దతులు చాలా చిన్న విషయాలు అనిపించినా ఇవి పాటించడం వలన ఏకాగ్రత మెరుగుపరచుకోవచ్చు.

ఇక విద్యార్థులు గుర్తుంచుకోవలసిన విషయం మానవులలో సగటు Attention Span (ఒక విషయంపై దృష్టి నిలప గలిగే సమయం) ఇరవై నిమిషాలు. ఒక అధ్యయనం ప్రకారం ‘A’ students కు ‘C’students కు ఉన్న తేడా ఏకాగ్రత కాదు, ఏదైనా distractions (పరధ్యానం ) వచ్చినా ‘A’students తేరుకుని, తిరిగి చదవడం ప్రారంభిస్తే, C students మాత్రం చదివే ప్రయత్నం విరమించారు.చాలా మంది పాఠశాలలో ఒక మోస్తరు విద్యార్థులుగా ఉన్నకూడా తర్వాత మెరుగవ్వడానికి కారణం ఇదే కావచ్చు. చిన్నప్పుడు చదువు ప్రముఖ్యత తెలియక ఏవైనా distractions కి లొంగిపోయి వెనుకబడిన, తరువాత కొంత వయసు వచ్చాక వాటిని ఎలా జయించాలో నేర్చుకుంటారు.

మానసిక ఒత్తిడి ని దూరం చేసుకోడానికి ధ్యానం, యోగా వంటివి ప్రయతించవచ్చు. మరీ ఎక్కువ ఒత్తిడికి లోనయ్యేవారు నిపుణులను సంప్రదించడం మంచిది.

%d bloggers like this:
Available for Amazon Prime