అమ్మాయి కి తొందరగా ఎందుకు పెళ్లి చెయ్యాలి

అమ్మాయికి త్వరగా వివాహం చేయాలని సమాజంలో ఎక్కువమంది తల్లిదండ్రులు ఆతృత పడుతుంటారు. దీనికి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, సంప్రదాయాలు కారణం.

సామాజికం

మనిషి సంఘజీవి. సంఘానికి భయపడతారు. గౌరవిస్తారు. నిత్యం వచ్చే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మీకెంతమంది పిల్లలు. ? ఇద్దరాడపిల్లలా. ఇంకా పెళ్లి చేయక పోవడమేమిటి.రోజులు బాగోలేదు. త్వరగా చేసేయండి. ఉచిత సలహా ఇచ్చి, వెళ్లిపోయారు. ఆ యజమానికి కంగారు మొదలవుతుంది.

ఇంట్లో పెద్దవాళ్ళ సలహాలు

నీ కాలంలో, మా కాలంలో చిన్నప్పుడే పెళ్ళిళ్ళయి పోయేవి. మీరెందుకు చేయరు. అమ్మాయి పెళ్లి చూసి చనిపోదామని ఉంది. నా కోరిక తీర్చవా?

చుట్టాల రొద

ఏమిటమ్మా వదినా! మన బంధువుల్లో. మీ అమ్మాయి వయసున్న వారందరికీ వివాహాలయ్యాయి. మీరేమో చదువులు, చట్టుబండలంటూ ఆలీశ్యం చేస్తున్నారు. ప్రమాదం సుమా.

ఇలా సామాజికంగా రకరకాల వత్తిళ్లతో అమ్మాయికి తొందరగా పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు.

సంప్రదాయం

ఏ దేశమైనా ప్రజలు సంప్రదాయానికి విలువిస్తారు. మన దేశంలో ఇది మరీ ఎక్కువ. పూర్వకాలం నుంచి భారత దేశంలో చిన్నతనం నుంచే వివాహాలు చేయడం పరిపాటిగా వస్తోంది. శాస్త్రీయ దృక్పథం పెరగడం, స్త్రీ విద్య వికాసం, చట్టాల వల్ల యుక్త వయసులో పెళ్లిళ్లు చేయడం పెరిగింది. హిందూ వివాహ మంత్రాలు గమనిస్తే చిన్నతనంలోనే వివాహాలు జరిగిన తీరు అర్ధమవుతుంది. అందులో ఒకటి చూద్దాం. కన్యాదాన సమయంలో..

‘ అష్ట వర్షా భవేత్ కన్యా.’

కన్యాదాత, చిన్న వయసులో ఉన్న తన కుమార్తెను జాగ్రత్తగా చూసుకోమని అప్పగిస్తాడు. కన్యాశుల్కం ఎక్కువగా వున్న రోజుల్లో కడుపులో వున్న శిశువును ఆడపిల్లగానే భావించి అమ్మేసే వారు. ఈ విషయం ‘ కన్యాశుల్కం’నాటకం ఆనాటి బాల్యవివాహాలకు అద్దం పడుతోంది.

ఆర్ధిక పరిస్థితులు

నిజానికి ఓ ఆడపిల్ల కన్న తల్లిదండ్రులకు పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో, అంతకు మించి తర్వాత ఖర్చు చేయాల్సి వస్తుంది. పండుగలు, పురుడు, కాపురానికి పంపడం వంటి ఎన్నో ఖర్చులు అమ్మాయి తల్లిదండ్రులను కుంగదీస్తాయి. అందుచేత తమకు ఓపిక, ఆర్ధిక పరిస్థితి బాగుండగానే అమ్మాయికి వివాహం చేయాలని తల్లిదండ్రులు తొందర పడుతుంటారు.

%d bloggers like this:
Available for Amazon Prime