అత్త – కోడలు

అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. అత్త గారు కోడలి గారికి ప్రధమ విమర్శకురాలు. ఒక రకంగా ఆమె కోడలు చేసిన పనిని విమర్శనాత్మకంగా చూస్తుంది. కోడలు వేరే ఇంటిలో వేరే పద్దతులు నేర్చుకొని వస్తుంది. ఇంకా ఆమె అక్కడ పూర్తి స్వతంత్రురాలు. తల్లి చాటు బిడ్డ. తండ్రికి గారాల పట్టి. అందువల్ల కాఫీ తాగి స్నానానికి వెళ్ళటం, వంట చేసేప్పుడు రుచి చూడటం వగైరాలు. ఇవి తల్లి మందలించి ఊరుకుంటుంది. కానీ అత్తగారికి నచ్చకపోవచ్చు.

అత్తగారికి కోడలు పొద్దున్నే లేచి స్నానం అది చేసి తరువాత పూజ అయ్యాక కాఫీ తాగాలి, వంట చేసేప్పుడు జాగ్రత్తగా చేయాలి గాని, ఉప్పు సరిపోయిందా లేదా అని రుచి చూడటం లాటివి నచ్చవు.

ఆమె చేస్తే అది అవసరం అనుకోండి. ఎందుకంటే ఉప్పు కషాయం అయితే ఆమె కొడుకు అలుగుతాడు కదా. దాంతో ఆమె సహజంగా ఇవేమీ పద్ధతులు అని విమర్శిస్తుంది.

అంతటితో ఊరుకోకుండా పక్క వాళ్లకు ఎదురు వాళ్లకు చెప్తుంది. దాంతో కోడలు గారు పద్ధతి తెలియని మనిషి అని గడుగ్గాయి అని ఇరుగు పొరుగు అనుకుంటారు.

అదే అత్తగారు లేరనుకోండి, కోడలు గారు పక్కవాళ్ల కు ఆమె చేసిన స్వీట్, హాట్ ఇచ్చి రుచి చూడండి అంటుంది. వాళ్ళు అబ్బా ఈమె ఎంత మంచిది, ఎంత ఉత్తమురాలు అందరికి అన్ని ఇస్తుంది, అరమరికలు లేకుండా ఉంటుంది. అని ప్రశంసా పత్రం ఇస్తారు. వాళ్లకు కోడలు స్నానం చేసి స్వీట్ చేసిందా లేక పూజ అయ్యాక దేవుడికి నైవేద్యం పెట్టిందా అనే విషయాలు అవసరం లేదు, అవి చెప్పటానికి అత్తగారు ఏమో అక్కడ లేకపోయే.

ఇంకా కోడలు లేని అత్త గుణవంతురాలు ఎందుకంటే.

ఆమె గురించి చెప్పేందుకు కోడలు లేదు. ఆమె వయస్సు పెద్దరికం వల్ల అందరికి , వడియాలు పెట్టేపుడు పిండి గుడ్డ పైన వేయలా లేక పేపరు పైన వేయలా అనే విషయాలు చెప్తుంది. ఇంకా అడిగితే, కోడలు ని ప్రతిదానికీ అరవకూడదని, పాపం వేరే ఇంటి నుంచి వచ్చి నేర్చుకోవటానికి సమయం పడుతుందని చెప్తుంది. (అంటే ఆమెకు కోడలు లేదు గా, పక్క వాళ్లకు చెప్పటమే కదా) దాంతో పక్క వాళ్ళ కోడలు అబ్బా ఇమే ఎంత మంచిది, ఎంత సహన సంపద ఉంది, ఎంత గుణ మంతురాలు మా అత్తగారు కూడా ఉంది ఎందుకు, సూర్య కాంతనికి జిరాక్స్ కాపీ అనుకుంటుంది.

%d bloggers like this:
Available for Amazon Prime