వాలెంటైన్‌ డే – కలర్‌ డ్రెస్సింగ్

వాలెంటైన్‌ డే ను అర్ధవంతంగా, ఆనందంగా జరుపుకోవాలనే వారు ఈ రోజుకోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ఆ రోజున నచ్చిన వారికి గులాబీలను, కానుకలు ఇచ్చి తమ ప్రేమను పంచుకుంటారు. నీలం: ఈ రంగు డ్రెస్‌ను వాలెంటైన్‌ డే రోజున ధరిస్తే ‘ఎవ్వరితోనూ ప్రేమలో లేను’ అనే అర్ధమట.  ఎరుపు: ఎలాంటి సందేహం లేకుండా ప్రేమకు చిహ్నంగా ఈ రంగును వాడుతూనే ఉంటారు. ఎరుపు రంగు డ్రెస్‌ ధరిస్తే ‘ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు’ అని గుర్తు అట.  పచ్చ:  ‘ఆశ’ను చిగురంపజేసే సుగుణం ఆకుపచ్చ రంగుకు ఇచ్చేశారు. సో.. ఎదురుచూడండి అని చెప్పకనే చెబుతున్న విషయమట. ఆరెంజ్‌ ప్రేమికుల రోజున నచ్చినవారికి ‘ప్రపోజ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు’ అన్నమాటట.  నలుపు: హాట్‌ కలర్‌గా పేరున్న రంగు నలుపు. ఈ డ్రెస్‌లో ఎవరినైనా ఇట్టే కట్టిపడేయచ్చు. కానీ, ప్రేమికుల రోజున దీనిని ధరిస్తే మాత్రం ‘విఫల ప్రేమ’కు…

Read More

పిల్లలని ప్రేమించడం ఎలా?

పిల్లలకి ప్రేమించడం మాత్రమే తెలుసు. వాళ్ళకి పగ, ద్వేషం లాంటివి తెలియవు. కోప్పడినప్పుడు బాధ పడతారు, ప్రేమగా దగ్గరకు తీసుకోగానే అన్నీ మర్చిపోతారు. మనం ఎంత ప్రేమ ఇస్తే అంతే ప్రేమ తిరిగి వస్తుంది. పిల్లలని బాగా ప్రేమించండి, మీ ప్రేమ వాళ్ళకి అర్థం అయ్యే లాగా మీ పనులలో, మాటలలో చూపించండి. ఉదాహరణకి వాళ్ళు ఏదైనా బొమ్మ గీస్తే, చాలా బాగా వేసావు అని ముందే గమనించి చెప్పడం. వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయడం, వాళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడటం, ఎక్కువ సమయం వాళ్ళతో గడపడం, వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసుకోవడం వల్ల మీకు పిల్లలకి మధ్య బంధం బాగా బలపడుతుంది. అపుడు వాళ్ళ ప్రేమని మీరే గుర్తించగలరు.

Read More

ప్రేమ – నిర్వచనం

పవిత్రమైనది, అగ్ని లాగా స్వచ్చమైనది, ప్రపంచాన్ని నడిపించేది ప్రేమే. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ , అల్లూరి సీతారామరాజు కి ఉన్నది అటువంటి ప్రేమ దేశం మీద మదర్ థెరిస్సా, డొక్కా సీతమ్మ గారి వంటి వారికి ఉన్నది అటువంటి ప్రేమే – ప్రజల మీద ప్రతి తల్లి దండ్రులకి ఉండేది కూడా అదే ప్రేమ – పిల్లల ప్రయోజకత్వం మీద భార్య భర్తలకు ఉండేది అదే ప్రేమ – జీవిత భాగస్వామి మీద ఇవన్నీ బాగానే ఉన్నాయి అసలైన ప్రేమ ఇద్దరు పెళ్లి కానీ స్త్రీ పురుషుల మీద అంటే మాత్రం ఇక్కడ మనం కొన్ని పచ్చి నిజాలు మాట్లాడుకోవాలి. అది ప్రేమ, ఆకర్షణ, మొహం , లేక కామమా ఒక అమ్మాయి అబ్బాయి మంచి స్నేహితులుగా ఉన్నారు అనుకుందాం, జీవితాంతం వారు మంచి స్నేహితులుగా…

Read More

వ్యాపారం VS ఉద్యోగం

ఉద్యోగం – వ్యాపారం రెండు సమానమే. కానీ ఉద్యోగులకి వ్యాపారస్తులు – వ్యాపారస్థులకి ఉద్యోగులు అవసరం ఉంది. ఉద్యోగం లో స్వేచ్చా – స్వాతంత్ర్యం ఉండదు, వ్యాపారం లో ఉంటుంది ఉద్యోగం లో ఒకరి కింద పని చేయాలి – వ్యాపారం లో ఎవరికింద పని చేయక్కర్లేదు ఉద్యోగం లో ఎదుగుదల తక్కువ – వ్యాపారం లో ఎదగడం ఎక్కువ ( కొన్ని సార్లు సర్వం ఊడ్చుకుపోతుంది ) ఉద్యోగస్తుడు ఉద్యోగం పోతే కంగారూ , బాధ కనబరుస్తాడు – వ్యాపారస్తుడు కొత్త విధానాన్ని ఆలోచిస్తాడు ఉద్యోగం లో రిస్క్ తక్కువ – వ్యాపారం లో రిస్క్ ఎక్కువ ఉద్యోగం జీవితం సాధారణంగా ఉంటుంది – వ్యాపారం లో జీవితం లో ఏ ఒక్కరోజు ఒకేలా ఉండదు. ఉద్యోగం జీవితాంతం కష్టపడుతూనే ఉండాలి, రిటైర్మెంట్ కి దాచుకోవాలి…

Read More

ప్రేమ – కోట్స్

నాకంటూ పెద్ద కలలేం లేవు. కానీ ఒక కల మాత్రం ఉంది. నువ్వూ నేనూ ఎప్పుడూ కలిసుండాలని! ప్రేమగా, అద్భుతంగా నాప్రేమనంతా మాటల్లో చెప్పలేను. కానీ.. ఒక మాట మాత్రం చెప్పగలను. ఈ జీవితంలో నిన్ను ప్రేమించినంతంగా ఇంకెవరినీ ప్రేమించలేను. కాదు.. కాదు.. ఈ జీవితంలో నిన్ను మాత్రమే ప్రేమించగలను’

Read More

అమ్మాయి కి తొందరగా ఎందుకు పెళ్లి చెయ్యాలి

అమ్మాయికి త్వరగా వివాహం చేయాలని సమాజంలో ఎక్కువమంది తల్లిదండ్రులు ఆతృత పడుతుంటారు. దీనికి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, సంప్రదాయాలు కారణం. సామాజికం మనిషి సంఘజీవి. సంఘానికి భయపడతారు. గౌరవిస్తారు. నిత్యం వచ్చే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మీకెంతమంది పిల్లలు. ? ఇద్దరాడపిల్లలా. ఇంకా పెళ్లి చేయక పోవడమేమిటి.రోజులు బాగోలేదు. త్వరగా చేసేయండి. ఉచిత సలహా ఇచ్చి, వెళ్లిపోయారు. ఆ యజమానికి కంగారు మొదలవుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళ సలహాలు నీ కాలంలో, మా కాలంలో చిన్నప్పుడే పెళ్ళిళ్ళయి పోయేవి. మీరెందుకు చేయరు. అమ్మాయి పెళ్లి చూసి చనిపోదామని ఉంది. నా కోరిక తీర్చవా? చుట్టాల రొద ఏమిటమ్మా వదినా! మన బంధువుల్లో. మీ అమ్మాయి వయసున్న వారందరికీ వివాహాలయ్యాయి. మీరేమో చదువులు, చట్టుబండలంటూ ఆలీశ్యం చేస్తున్నారు. ప్రమాదం సుమా. ఇలా సామాజికంగా రకరకాల వత్తిళ్లతో అమ్మాయికి తొందరగా పెళ్లి…

Read More

టెన్నిస్ – ఆసక్తికరమైన విషయాలు

ఇది ముఖ్యంగా individual sport. అంటే ఇద్దరు లేదా గరిష్టంగా నలుగురు ఆడే ఆట. అందువల్ల ఒక్కో ఆటగాడి/ఆటగత్తె ప్రతిభ స్పష్టంగా తెలుస్తుంది. చాలా ఇతర ఆటలు గుంపుగా ఆడేవి కాబట్టి సమిష్టి కృషి వల్ల నెగ్గుతారు. ప్రత్యేకంగా ఒకరి ఆట బాగానే ఉన్నా ఆ ఒక్క కారణం వల్లే నెగ్గడం చాలా అరుదు. టెన్నిస్ ఆట చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. క్రికెట్ ని gentleman’s sport అంటారు గానీ నిజానికి టెన్నిస్ ని అలా అనాలనిపిస్తుంది. ఇది చాలా ఖరీదైన ఆట. కానీ ఒకసారి నేర్చుకుని ఒక స్థాయికి ఎదగగలిగితే తర్వాత జీవితానికి ఢోకా ఉండదు. టెన్నిస్ 12 వ శతాబ్దంలో ఫ్రాన్స్ లో మొదలైందట. అప్పట్లో దీన్ని అరచేతులతో (బాట్లు కాకుండా) ఆడేవారట. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా పాతవైన టెన్నిస్ పోటీలు వింబుల్డన్ టోర్నమెంట్.…

Read More

గొంతెమ్మ కోరికలు

పాండు రాజు మొదటి భార్య అయిన కుంతీ దేవి యొక్క వికృతి నామం గుంతి, గొంతీ. ఆ “గొంతీ” కి గౌరవ వాచకం గొంతి+అమ్మ = గొంతెమ్మ . కురుక్షేత్ర యుద్ధం సమయంలో , కర్ణుడితో ఆమె మాట్లాడే సమయాన ఆమె “కర్ణుడూ బ్రతకాలి, అర్జునుడూ బ్రతకాలి” అని కోరుకున్నది, కానీ అది అసంభవము, అయితే ఇద్దరిలో ఒకరే ఉండగలరు తప్ప ఇద్దరు ఉండాలి అంటే అది సాధ్య పడని పని అని కర్ణుడు చెపుతాడు. కాబట్టి సాధ్యపడని కోరికలను గొంతెమ్మ కోర్కెలు అని అంటారు “అవ్వా కావాలి , బువ్వా కావాలి ” అన్న జాతీయం కూడా ఈ కోవకు చెందినదే.

Read More

అత్త – కోడలు

అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. అత్త గారు కోడలి గారికి ప్రధమ విమర్శకురాలు. ఒక రకంగా ఆమె కోడలు చేసిన పనిని విమర్శనాత్మకంగా చూస్తుంది. కోడలు వేరే ఇంటిలో వేరే పద్దతులు నేర్చుకొని వస్తుంది. ఇంకా ఆమె అక్కడ పూర్తి స్వతంత్రురాలు. తల్లి చాటు బిడ్డ. తండ్రికి గారాల పట్టి. అందువల్ల కాఫీ తాగి స్నానానికి వెళ్ళటం, వంట చేసేప్పుడు రుచి చూడటం వగైరాలు. ఇవి తల్లి మందలించి ఊరుకుంటుంది. కానీ అత్తగారికి నచ్చకపోవచ్చు. అత్తగారికి కోడలు పొద్దున్నే లేచి స్నానం అది చేసి తరువాత పూజ అయ్యాక కాఫీ తాగాలి, వంట చేసేప్పుడు జాగ్రత్తగా చేయాలి గాని, ఉప్పు సరిపోయిందా లేదా అని రుచి చూడటం లాటివి నచ్చవు. ఆమె చేస్తే అది అవసరం అనుకోండి. ఎందుకంటే ఉప్పు కషాయం…

Read More

పిల్లలను – కొట్టడం తిట్టడం చేయరాదు

దీని గురించి ఒక మంచి శ్లోకం ఉన్నది సంస్కృతంలో. రాజవత్ పంచవ ర్షా ని దశ వర్షా ని దాసవ త్ ప్రాప్ తే తు షోడసే వర్షే పుత్రం మిత్రవదాచ రే త్ అంటే చిన్న పిల్ల వాడిని రాజువలే పెంచాలి అయిదు సంవత్సరాలు.ఎలాంటి ఇబ్బందీ లేకుండా.ఆ తర్వాత పది సంవత్సరాలు సేవకుని వలె ఎంతో క్రమశిక్షతో పెంచాలి.ఇలా 15 సంవత్సరాలు గడిచిపోతాయి. పదునారవ సంవత్సరం వచ్చిన తర్వాత పుత్రుని మిత్రునిలా చూడాలి.అంటే తిట్టినా లేదా ఒక దెబ్బ వేసినా అది 15 సంవత్సరాలు వచ్చేవరకు మాత్రమే. ఆ తర్వాత చాలా గౌరవంగా ఒక మిత్రునితో మాట్లాడినట్లు మాట్లాడాలి.అలాగే అయిదు సంవత్సరాలు నిండే వరకు పిల్లలను చాలా ప్రేమతో పెంచాలి.కొట్టడం తిట్టడం చేయరాదు.

Read More

సంతోషం – డబ్బు

సంతోషం డబ్బులో లేదు. మనసులో ఉంది. అలాగని, సొమ్ము లేకపోతే జీవితం గడవదు. మనిషి జీవించడానికి ముఖ్యంగా..కూడు గూడు గుడ్డ. అవసరం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో కనీస అవసరాలు పెరిగాయి. వాటిని నెరవేర్చడం కోసం మనిషి నిరంతరం శ్రమిస్తున్నాడు. ఆర్ధికంగా రెండు జీవిత వర్గాలున్నాయి… వడ్డించిన విస్తరిలాంటి జీవితం మరియు స్వయం పోషక జీవితం తాతలు, తండ్రులు సంపాదించి ఇస్తే సుఖజీవనం సాగించేవారిది ‘వడ్డించిన విస్తరి.’ రెండో రకం స్వయం పోషక జీవితం. వీరు ఎంతో కష్టపడి పనిచేయడం ద్వారా జీవిస్తారు. ఇందులో కొందరు చక చకా సంపాదించి, ఆర్ధిక సమృద్ధి సాధిస్తారు. మరికొందరు ఎన్నాళ్ళు చూసినా ‘ గొర్రెకు బెత్తెడు తోక ‘ మాదిరిగా ఉండిపోతారు. మరి సంతోషంగా జీవించడానికి ఎంత డబ్బు కావాలి అంటే, వారి కోరికల చిట్టాని బట్టి వుంటుంది. చెట్టుకిందో,…

Read More

జీవితంలో అత్యంత విలువైన 10 విషయాలు

1.సమయం చాలా విలువైనది. 2.ఆరోగ్యం ధనం కంటే విలువైనది. విద్యా ధనం అన్ని ధనముల కంటే ముఖ్యమైనది. 3.సమాజం లో చాలా చెడు ఉంటుంది. కావున గుడ్డిగా అనుకరణ చేయకూడదు. 4.ధనమూలమిదం జగత్. డబ్బు లేని రోజున ఇంట్లో వారు దగ్గరి బంధువులు వేరే విధంగా ప్రవర్తిస్తారు. 5.ఏదైనా కష్టం వచ్చినపుడే మన అసలైన శ్రేయోభిలాషులు ఎవరో తెలుసు కుంటాము. 6.సంపదలున్నవని గర్వ పడకూడదు. అవి చాలా చంచల మైనవి. ఏ క్షణమైనా మనలను విడచి వెళ్లిపోవచ్చు. 7.వైద్యులు, వైదికులు, వకీళ్లు -వీరితో తగాదా పెట్టుకుంటే మనమే నష్టపోతాము. 8.తల్లి దండ్రులను, పెద్దలను గౌరవించడం మన బాధ్యత. మనము వారిని సరిగా గౌరవించక పోతే మన పిల్లలే మనకు ముసలితనం లో పెద్ద శిక్ష వేస్తారు. 9.మన బల హీనతలను ఎవరికీ చెప్పకూడదు. 10.మన మంచి అలవాట్లే…

Read More

పాఠశాలలో నిర్వలేని ఒక ముఖ్యమైన నైపుణ్యం – ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ‘ జీవించడం’

ఈ నైపుణ్యం నేర్వనందువల్లనే, ఎన్నో జీవితాలు మొగ్గలోనే మాడిపోతున్నాయి. నిజానికి లౌకికంగా చూసినా, అలౌకికంగా చూసినా మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. ఏజీవికీ లేని మాట్లాడటం అనే నైపుణ్యం మానవుడి సొంతం. మిగతాజీవులకూ తెలివితేటలు ఉన్నా, మానవుడి తెలివి అద్భుతం. ఆదిమ మానవుడి నుంచి ఇప్పటిదాకా జీవన విధానం ఎంతో మారిపోయింది. విద్యా, వైద్య , శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనూహ్యంగా అభివృద్ధి చెందాయి. కాబట్టి, బతికివుంటే ఎన్నో అద్భుతాలు చూస్తాం. అందుకే కరుణశ్రీ గారు… చచ్చిపోయినట్టి సార్వభౌమునికంటే బ్రతికి ఉన్న చిన్న చీమ మేలు బ్రతుకుకన్న వేరు స్వర్గమ్ము లేదురా లలిత సుగుణజాల! తెలుగు బాల! అన్నారు. జీవించడం.. అనే గొప్పవిషయాన్ని బాల్యం నుంచి చెప్పకపోవడం వల్ల ఎందరో క్షణికావేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఆ కుటుంబాలలో చీకటి మిగులుతోంది. అందుచేత, సమస్యలు వస్తే, తట్టుకుని…

Read More

జీవితం – ముగిసే పరిభ్రమణ చక్రం

స్త్రీ పురుష సమాగమం దగ్గరనుండీ మొదలయ్యే ప్రాణి ఆవిర్భావం నుంచీ జీవి యొక్క అంత్యేష్టి వరకూ సాగే ప్రతీ దశా చాలా చిత్రంగా అనిపిస్తుంది . స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణను సూత్రంగా కట్టి ” వాంఛ ను ” తీవ్రంగా వారిలో కలగచేసి సుఖాన్ని ఎరగా ఉంచి తర్వాత తరానికి సృష్టిని కొనసాగేలా చేయడం ప్రకృతి యొక్క గొప్ప ఎత్తుగడ. కొన్ని కోట్ల పురుష కణాలలో ఒకటే స్త్రీ అండంతో జతకట్టి ఓ నూతన జీవిని ఏర్పరచడం , లోలోపలే ఆ శిశు ఎదుగుదలా క్రమమమంతా ఓ అద్భుతమైతే అంతవరకూ ఆ జీవిని పోషించడానికి తగిన ఏర్పాట్లు లోపలే తదనుగుణంగా జరగడం , ఆ జీవి ఎదుగుదల పూర్తయ్యాక తల్లి భగరంద్రము నుండే వెలుపలకి రావాలని యత్నించి సఫలీకృతమవ్వడం – అంతలా తనని శారీరకముగా శ్రమ…

Read More

పెళ్లిళ్లు – కోరికలు

పెళ్లి అయినా వెంటనే భర్త అన్ని సౌకర్యాలు అమర్చాలి అని యువతులు ఆశిస్తూ ఉన్నారు. కారు తో సహా. ఇక యువకులు అయితే భార్య ఉద్యోగం చేసి సంపాదించాలని కొందరు ఆశిస్తే, కోరికలు తగ్గించు కుని ఉన్నంతలో సర్దుకు పోవాలని కొందరు ఆశిస్తారు. ప్రస్తుతo ఎక్కువ మంది యువతులు సమానత్వం ఆశిస్తున్నారు. స్వేచ్చను ఇది వరకు కంటే ఎక్కువ ఆశిస్తున్నారు.పెళ్లి అంటేనే సర్దుబాటు. సర్దు బాటు లేని సంసారం ఎక్కువ కాలం నిలబడ దని నా అభిప్రాయం. పరిపక్వత ఉంటే వాస్తవానికి దగ్గరగా అలోచించగలరు. ఉద్యోగం చేసే యువతి ఆశించే దొకటి. ఉన్నత వర్గాల యువతీ, యువకుల ఆశలు వేరే. పెళ్లిళ్లు చాలా విఫలం అవుతున్నాయి. కారణం ఎమిటి? తీర్చలేని కోరికలు, అత్యాశలు కారణం. వాస్తవానికి దూరంగా అంచనాలు. తక్కువ ఆశిస్తే ఎక్కువ పొందవచ్చు. మనం మన…

Read More

నవ వదు వరులు – సలహాలు – సూచనలు

సలహాలు వివాహం అయిన మొదట్లోనే మీ మనసంతా కోసి అవతల వారికి ఇచ్చేయకండి. మెల్ల మెల్లగా ఒక్కో తెర తొలగి, ఒక్కో విషయం తెలుసుకుంటూ తెలుపుతూ ముందుకు సాగండి. మీ ఆవీ జీవీ అంతా పిండుకుని చెప్పినా అవతల వారికి అర్ధం ఔతుందని ఏమీ గ్యారంటీ లేదు. నిరుత్సాహం తప్ప ఇలా చేస్తే ఫలితం ఏమీ లేదు. పెళ్లికి ముందే మాట్లాడుకున్నాం, నిర్ణయించుకున్నాం కనుక అలాగే జరగాలి జరుగుతుంది అని అనుకోకండి. పెళ్లికి ముందు అమ్మాయి అమెరికా వెళ్దాం అనచ్చు, పెళ్లయ్యాక ఇండియాలోనే ఉందామని అనుకోవచ్చు..పెళ్లికి ముందు పిల్లల ఇప్పుడే వద్దు అనుకోవచ్చు, పెళ్లయ్యాక వెంటనే కావాలి అనిపించవచ్చు. All decisions are and will always be subject to change. మీరు వారితో కలిసి ప్రయాణించడం, కలసిన మీ అభిప్రాయాలు, నిర్ణయాలు వల్ల కాక,…

Read More

ఏకాగ్రత

ఏకాగ్రత పెంచుకోవడం అందరికి, ముఖ్యంగా విద్యార్థులకు చాలా అవసరం. అందుకోసం కొన్ని పద్ధతులు పాటించవచ్చు: మాములుగా అందరూ కంటితో చూస్తూ చదువుతారు. ఒకటి కంటే ఎక్కువ ఇంద్రియాల ప్రమేయం చదివే ప్రక్రియలో మనం భాగం చేయగలిగితే ఏకాగ్రత మెరుగవుతుంది. 1) పైకి చదవడం- చదువుతున్నది చెప్పడమే కాకుండా వింటాం కూడా. 2) చదివేది పుస్తకంలో క్లుప్తంగా రాయడం. 3) ఇప్పుడు చాలా రకాలైన పుస్తకాలు, పిడిఎఫ్ లు చదివి వినిపించే ఆప్స్ ఉన్నాయి. కుదిరితే ఇలా వింటూ, చూస్తూ, ఒక నోటు పుస్తకంలో ముఖ్యమైన వాటిని రాసుకుంటూ చదివితే ఏకాగ్రత కోల్పోవడం తగ్గుతుంది. మన ఏకాగ్రతకు భంగం కలిగించే వస్తువులు (సెల్ ఫోను), వ్యక్తులను చదువుతున్నప్పుడు దూరం పెట్టాలి. వీలయినంత వరకు చదవడానికి ఒక ప్రదేశం ( లైబ్రరీ, ఇంటి లో ఒక గది) నిర్ణయించుకుని అక్కడే…

Read More

మేనరికం

భారతీయ వివాహ సంబంధాల ఆచారాల్లో మేనమామ కూతురు, అక్క కూతురిని చేసుకోవడం ‘మేనరికం ‘ అంటారు. ఇవి ఆచార సమ్మతమైన వివాహ సంబంధాలు. మేనత్త కూతుర్ని చేసుకోవడం ‘ ఎదురు మేనరికం ‘ అంటారు. మేనమామ కూతుర్ని చేసుకోవచ్చు. అక్క కూతుర్ని చేసుకోవచ్చు. మన సంప్రదాయం ప్రకారం మేనత్త కూతుర్ని చేసుకోరాదు. ఈ మూడు వరసల్లో ఏది చేసుకున్నా, ఆ దంపతులకు పుట్టే సంతానం అవకరాలతో జన్మిస్తారని వైద్య శాస్త్రం చెబుతోంది. అవకరాలు లేకుండా పుట్టిన సందర్భాలు బాగానే వున్నాయి. ఒక తరం వరకూ కొంత పరవాలేదు. కానీ రెండు మూడు తరాలవారు మేనరికాలు చేసుకుంటే, ఖచ్చితంగా అవకరాలతో పిల్లలు పుడతారనడానికి చాలా దృష్టాంతరాలున్నాయి. బయటి సంబంధాలు చేసుకుంటే, ఆస్తులు బయటకు వెళ్లిపోతాయని చాలా మంది మేనరికాల వైపు మొగ్గు చూపుతున్నారు. బయటి అమ్మాయి, అబ్బాయి అలవాట్లు,…

Read More

ప్లటోనిక్ లవ్ (Platonic love)

ఆలుమగల మధ్య కల బంధం మొదట్లో కేవలం శారీరిక సంబంధ సుఖాల పట్లే కేంద్రీకరింపబడినా, సమయంగడిచే కొద్దీ వారి సంబంధం మానసికమౌతుంది. అప్పుడు వయసు మళ్ళిన తర్వాత శరీరం ఉడిగినా, వారు ఇంకా ప్రేమించుకుంటూనే ఉంటారు.. అయితే ఈ ప్రేమ మానసికం. నా ఉద్దేశ్యంలో పరిపక్వమైన ప్రేమను మనము పొందగలిగేదీ, ఇవ్వగలిగేదీ ఇప్పుడే. శారీరిక ఆకర్షణ అన్నది మొదట పునాది వేస్తుంది ..మానసిక పరిణితి ఆ పునాదుల మీద తర్వాతి దశకు మనలను చేరుస్తుంది.

Read More

తల్లిదండ్రులు – పొరపాట్లు

ధైర్యం- అతను ఈ స్వంత పాషన్‌ను ఎంచుకుంటే నా పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉంటుంది ప్రకటనలు – 8 వ తరగతిలోనే ఐఐటి కోచింగ్ ప్రారంభమయ్యే పాఠశాలల్లో పిల్లలను చేరడం. గుర్తింపు – భవిష్యత్తులో వారి పిల్లలు ఏమి కావాలనుకుంటున్నారో తెలుసుకోవడం. వారు ఎలా ఉండాలనుకుంటున్నారు? హాహాహా! తల్లిదండ్రులు తమ చుట్టూ ఉన్నవారి మాటలు వింటారు కాని వారి స్వంత పిల్లలను వినరు. విద్య ముఖ్యం కాదు. మీ పిల్లలను ఆంగ్ల భాషలో మాత్రమే బోధించే ఇంటర్నేషనల్ పాఠశాలలు లేదా పాఠశాలల్లో చేరడం సరైన ఎంపిక కాదు. పిల్లలకు నీతి, నీతులు నేర్పించాలి. విద్య కంటే పాత్ర ముఖ్యం. కంఫర్ట్ జోన్ – పిల్లలకు కావలసినది ఇవ్వడం. మీరు కోరుకున్నదంతా మీరు ఇస్తే, దాని విలువ వారికి తెలియదు. గౌరవం – తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పొరుగువారు, ప్రతి వ్యక్తిని గౌరవించాలి. తల్లిదండ్రులు ఇంట్లో…

Read More

Illu Festival – IIT Kharagpur

Ilumination, popularly known as Illu, is a festival unique to IIT Kharagpur. It is inspired from the day of Diwali (the festival of lights) and is usually held on the day of Diwali itself. It is held as a competition among student halls. As part of the Illumination festival, all halls build vertical panels of bamboo (called Chatais) on which thousands of lamps (diyas) are mounted forming outlines of people or things; illustrating an event, or a place of importance. The chatais may reach a height of 6 metres (20…

Read More

విషయాలు – మొహమాటం

1. భోజనం చేసినప్పుడు మొహమాట పడొద్దు. 2. దాహం వేసినప్పుడు ఎక్కడికైనా వెళ్లినప్పుడు మొహమాట పడకుండా మంచినీళ్లు అడిగి తాగాలి. 3. మనకి తలపోటు వచ్చినప్పుడు ఎవరైనా ఆగకుండా మాట్లాడితే మొహమాటపడకుండా ఏదో ఒక వంక చెప్పి వాళ్లని పంపి చేయాలి 4. మనకి నిద్ర సమయం వచ్చినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఎక్కువ సేపు మాట్లాడితే రేపు మాట్లాడతాను అని మొహమాటం లేకుండా చెప్పేయాలి. 5. మన ఆరోగ్యం విషయం ఇంట్లో వాళ్లకి మొహమాటం లేకుండా చెప్పాలి. 6. పెళ్లి చేసుకునే విషయంలో మొహమాటపడకుండా నచ్చింది లేకపోతే నచ్చినది చెప్పాలి, లేకపోతే జీవితాంతం బాధపడాలి.

Read More

ప్రేమ – సైకలాజికల్ భావాలు

ప్రేమ ఒక మధురమైన అనుభూతి. ఒక వస్తువు మీద ప్రేమ కలిగింది అంటే దానిని అపురూపం గా దాచుకుంటారు . మనుషుల్ని ప్రేమిస్తే ,సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ప్రేమిస్తున్నారు , ప్రేమని పొంది అనుభవిస్తున్నారు అంటే వాళ్ళు కొంత మంది చాలా హుషారు గా వుంటారు. కొంత మంది నాకేంటి నేను సాధించాను అని చాలా గర్వంతో వుంటారు. కొంత మంది పెళ్లి కుదిరింది అనుకోండి. రోజంతా మొబైల్ లో మాట్లాడుకుంటూ ,ప్రేమజంట లా ఫీల్ అవుతారు. పెళ్లి కట్నం మూలం గా, లేదా ఉద్యోగం మూలంగా జరుగుతోంది అని అసలు అనుకోరు. అది కూడా ప్రేమ గా భావిస్తారు. ప్రేమించడం వేరు , ప్రేమించుకున్నాం అని ఫీల్ అవ్వడం వేరుగా వుంటాయి. నిజం గా ప్రేమ వుందా…

Read More

పెళ్లి – భవిష్యత్తు బాధ్యతలు

పెళ్లి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే తంతు అయినా, ఇద్దరి కుటుంబాలు, ఆ సభ్యుల భవిష్యత్తు కూడా వీరు ఇద్దరి పై ఆధార పడి ఉంటుంది. అమ్మాయి కేవలం భర్తను మాత్రమే దృష్టిలో పెట్టుకుని లేదా భర్తకు మాత్రమే చెందినది భావించడం ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నాం. అమ్మాయికి తన తల్లిదండ్రులు ఎంత ముఖ్యులతో, వారు శారీరకంగా , మానసికంగా బాగుండాలని ఎంతగా కోరుకోరుకుంటుందో, అబ్బాయి కూడా అంతే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అత్తమామల సేవ కోసమే అమ్మాయిజీవితం గడపాలని కోరుకునే వారి ఆలోచన లో ఎంత తప్పు ఉందో, పెళ్లి చేసుకున్న అబ్బాయి పట్ల తప్ప మరెవరి బాధ్యత తనది కాదని భావించడం కూడా అంతే తప్పు. అటువంటి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం లో తన బాధ్యత, అవసరం ఉందని అమ్మాయి తెలుసుకోవాలి.…

Read More

వితంతువు – సాంఘిక దురాచారం

స్త్రీలకి బొట్టూ , కాటుక , పువ్వులు పెట్టుకోవడం , గాజులు వేసుకోవడం ఇవ్వన్నీ వాళ్ళ పర్సనల్ ఛాయిస్ – అవి వాళ్ళ అలంకరణలో ఓ భాగం మాత్రమే. అవి వాళ్ళకి పెళ్ళి కాకమునుపు నుండీ వాళ్ళ జీవితంలో ఓ భాగంగా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ జీవితం మధ్యలో పెళ్ళి పేరిట ఒక మగవాడు ప్రవేశించి అతనేదో చనిపోతే అందుకు బాధపడడం , దుఖఃపడడం సహజం కానీ అతనేదో చనిపోయాడనే ఒక్క కారణం చేత స్త్రీ ఇవన్నీ ఎందుకిక్కడితో అర్ధాంతరంగా తన జీవితం నుండి వదిలేసుకోవాలి ? . ” పర పురుషుడికి ఆమెపై వ్యామోహం కలగకుండా ఉంచేందుకై ఈ ఏర్పాటు ” అని అడిగితే కొందరేదో దీనిని సమర్ధించ చూస్తారు కానీ ” అదే ఏర్పాటు మగవాడికెందుకు ఉండదు ? జీవితాంతం వరకూ కలిసి ఉంటామని…

Read More

వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చెయ్యాలంటారు

వెయ్యి అబధ్ధాలు అనేది అతిశయోక్తి మాత్రమే. సాధారణంగా ఎవరూ సమస్త సద్గుణసంపన్నులు కారు.ప్రతి వధువు, వరుని లోఏదో ఒక చిన్న లేక పెద్ద లోపం ఉంటుంది. కానీ వారు వైవాహిక జీవితానికి పనికి వస్తారు.ఇలా సంప్రదింపులు జరిపే టపుడు 99 విషయాలు నిజమే.చెబుతారు.ఏదో ఒక విషయాన్ని కప్పిపుచ్చుతారు. .ఇది కొంత వరకు సమర్ధనీయమే.కానీ చదువు, ఉద్యోగం. లేదా.ఆరోగ్య విషయాలలో అబధ్ధాలు చెప్పి పెళ్లి చేస్తారు. ఈమధ్య ఇలాంటి వి కొన్ని చూస్తున్నాము.ITC లో ఉద్యోగం. అని చెబుతారు. పెళ్ళయిన తర్వాత తెలిసిందేమిటంటే అతను ITC లో చిన్న కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. ఇలాగే ఒక అబ్బాయి దుబాయ్ లోఉద్యోగం చేస్తున్నాడు అని నమ్మించి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అతను దుబాయ్ వెళ్లి పోయాడు.ఎన్నాళ్ళకు భార్యకు వీసా.పంపించ లేదు.చివరకు ఎంక్వైర్ చేస్తే అతను అక్కడ ఒక అధ్యాత్మిక…

Read More

మాటలు – విలువలు

” నిండు కుండ తొణకదు” అని వినే ఉంటారు. మన మాటలు ఎంతో విలువైనవి అది మనం తక్కువ గా మరియు ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోవాలి , లేదంటే మన మాటలకు విలువ ఉండదు. మనం అందరం విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం. , కాని సరిగ్గా చూసినట్టు అయితే ఆయన అవతారమే మనకి ఎన్నో నేర్పిస్తుంది. పెద్ద చెవులు , చిన్న నోరు కి అర్ధం – మనం ఎక్కువ విని తక్కువ మాట్లాడాలి అని. అందుకే కొందరు అంటారు. ఆ దేవుడు మనకి రెండు చెవులు ఇచ్చి ఒకటే నోరు ఇచ్చారు అని. బహుశా అది నిజమేనేమో. పైగా, మనం ఎంత తక్కువ మాట్లాడితే మన శక్తి ( energy) ని కూడా అంత తక్కువ ఖర్చు అవుతుంది. తక్కువ మాట్లాడడం అనే కంటే అర్థవంతంగా మాట్లాడగలిగితే ఎక్కువ…

Read More

వివాహం vs సహజీవనం

వివాహం అనేది ఒక వ్యవస్థ- ఏ దేశంలో అయినా దాని మూలాలు, భూమికి, గొడ్డుకీ ప్రతిగా వారసుడిని ఇచ్చి, పనికి వచ్చే పిల్లలను కనిచ్చే ఒక ఆడమనిషిని ఇవ్వడంతో మొదలయ్యింది. కాల క్రమేణా ఆ వ్యవస్థ రూపాంతరం చెందింది. ఒక ఇరవై సంవత్సరాల క్రితం వరకు ఆడవారికి ఆర్థిక స్వాతంత్ర్యం లేదు కాబట్టి, నచ్చినా నచ్చకున్నా, వివాహాలలో ఉండేవారు. విడాకులు అనే చట్టం మన దేశానికి వచ్చి గట్టిగా 75 ఏళ్ళు కాలేదు, అంత మాత్రం చేత మన వ్యవస్థ అద్భుతమని, న భూతో న భవిష్యత్ అని 90ల లో వచ్చిన తెలుగు సినిమా డైరెక్టర్ లాగా మనం భుజాలు తట్టేసుకో అక్కర్లేదు. సహజీవనం అనగానే ప్రతి ఒక్కరూ ఊహించుకునేది, ఇవాళ ఒకరితో, రేపు ఇంకొకరితో అని, మన ఆలోచన అక్కడితో ఆగిపోతుంది, అటువంటి ఆలోచన…

Read More