ఉడుత

ఉడుత రోడెంట్ అనే జాతికి చెందింది. ఈ రోడెంట్ లలో ఉడుతల ను సియురిడే(family Sciuridae) కుటుంబం లో చేర్చారు.వీటికుండే కుచ్చు లాంటి తోక ఇందులోని సభ్యుల ప్రధాన లక్షణం.ఇంకా ఉడుతల లో నేల మీదవి,ఎగిరేవి, ప్రయరి డాగ్,చిప్మంక్ ,మార్మట్ ఇలా బోలెడు రకాలు ఉన్నాయి.

మళ్ళీ వీటిలో మన దేశం లో ఉండేవి ఇండియన్ పాం స్క్విరాల్(Funambulus palmarum) ఇది దక్షిణ భారతం లో, శ్రీలంక లో ఉంటుంది.దీనినే మూడు చారల ఉడుత (three-striped palm squirrel).ఇది ఉత్తర భారత దేశం లో ఐదు చారల ఉడుత ( (Funambulus pennantii) కనిపిస్తుంది

ఇది అన్ని రంగుల్లో ,చారలు లేకుండా ప్రపంచమంతా కనిపించినా, మన దేశం లో చారలతోనే కనిపిస్తుంది

ఉడుతలు ఇయోసిన్ యుగం అంటే 56 నుంచి 34 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి.అంటే ఒక రకంగా మనకంటే పురాతన మైనవి.వీటి ప్రత్యేకతలేమంటే,ఇవి చాలా మనిషికి దగ్గరగా పెరగ గలవు.ఒక రకంగా మనుషుల ఉనికి కావాలి వీటికి.కొంతమంది వీటిని ఇష్టపడి పెంచుతారు.పార్కుల్లో,ఇతర తోటల్లో వీటి ఉనికి,సంచారం అందంగా ఉంటుంది అంటారు.ఇంకొందరు వీటిని చీడ లాగ భావిస్తారు.వీటికుండే తెలుసుకోవాలనే లక్షణం వల్ల ,కోరికే గుణం వల్ల వైర్లు,ఇంటి పరికరాలు,అన్నిటిని పాడు చేస్తాయి. అందుకని వాటికి ట్రాప్ లు అమర్చి చంపడమో,దూరంగా వదిలేయ్యడమో చేస్తారు. చాలా సంస్కృతులలో వీటికి కొంత స్థానం ఉంది.నార్స్ పురాణాల్లో “రాటోటోస్కర్” అని ఓడిన్ తాలూకు ఒక అనుయాయి అంటారు.ఇంకొన్ని ఆదిమ సమాజాల్లో టోటెమ్ లాగా,గొప్ప శక్తులుండే ఆత్మ లాగ కుడా వర్ణిస్తారు.