
ప్రా‘మిస్’..నేను జీవితాంతం వరకు నీతోనే ఉంటారు.. నిన్ను కెరింగ్‌గా చూసుకుంటాను.. నీతో ఎప్పటికి నిజాయితీగా ఉంటాను..ఇలాంటివి తరచుగా అందరినోట్లోను వింటూనే ఉంటాం. ప్రేమ నిజంగా పండాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ముఖ్యం..అందుకే మనం కోరుకున్న ప్రేమను ప్రామిస్ వేసి మరి చెప్తాం. అందుకే వాలెంటైన్స్ వీక్‌లో ఈరోజు (ఫిబ్రవరి11)ను లవర్స్ ‘ప్రామిస్ డే’ గా జరుపుకొంటారు.

పండంటి ప్రేమకు..
► ఇద్దరు మధ్యలో ప్రధానంగా ఉండాల్సింది నమ్మకం. ఈ పునాది ఎంత గట్టిగా ఉంటుందో వారి ప్రేమ అంత ధృడంగా ఉంటుంది.
► పరిస్థితులు ఎలా ఉన్నా ఒకరికి మరొకరు తామున్నామనే భరోసా ఇచ్చుకొవాలి.
► ప్రేమలో ఎదుటివారి లోపాలు, వారినుంచి తిరిగి ఆశించడం, డిమాండ్ చేయడం వంటివి ఉండవు.
► ప్రేమ అన్నాక చిరుకోపాలు, తాపాలు సహజం.. వాటిని పెద్దగా పట్టించుకోకుండా పరిష్కరించుకోవాలి.
► ప్రేమలో ఇరువురి ఇష్టాలను పరస్పరం గౌరవించుకోవాలి.

ఇక్కడ ప్రామిస్ మోటో మాత్రం ఒక్కటే.. తల్లిదండ్రులతో, బంధువులతో , మిత్రులతో మనం చేయగలిగేది మాత్రమే చెప్పాలి. ప్రతి ఒక్కరిలోను చిన్నపాటి లోపాలుండటం సహజం. అనవసర కోపాలకు పోకుండా, వాటిని పరిష్కరించుకుంటూ.. మనకు వారితో ఉన్న ప్రేమ కలకాలం నిలవాలని ‘ప్రామిస్’ వేసి మరికోరుకుందాం..
You must log in to post a comment.