
100 గ్రా. వెలగపండు గుజ్జు నుంచి 140 క్యాలరీలు వస్తాయి. అనేక వ్యాధుల నివారణలో ఔషధంగా పనిచేస్తోంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండు మంచి మందు. అల్సర్‌తో బాధపడే వారికి ఈ పండు వల్ల ఉపశమనం కలుగుతుంది. వెలగపండు గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధి అవుతుంది. రక్తహీనతను నివారించే గుణం వెలగపండులో ఉంది. ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటే, వెలగ పండు జ్యూస్ తాగిస్తే తగ్గుతాయి. అలసటగా, నీరసంగా ఉన్నప్పుడు వెలగపండు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది.
మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఈ పండ్లు తినడం మంచిది. మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి. వెలగపండు గుజ్జుకి తగినంత గోరువెచ్చని నీళ్లు, కొద్దిగా పంచదార కలిపి తీసుకుంటే రక్తంలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి. కాలేయం, కిడ్నీలపై అధిక పనిభారం పడకుండా ఉంటుంది ∙స్త్రీలు వెలగ పండు గుజ్జు క్రమం తప్పకుండా తినడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. వెలగపండు గుజ్జు తినడం వల్ల ప్రొటీన్లు సమపాళ్లలో అంది కండరాలు వేగంగా వృద్ధి చెందుతాయి ∙వెలగపండు గుజ్జుకి మధుమేహాన్ని అదుపులో ఉంచే శక్తి ఉంది. ∙వెలగ పండుకి 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది ∙నోటి పుండ్లనీ తగ్గిస్తుంది ∙పొట్టలో పేరుకున్న గ్యాస్‌నీ తొలగిస్తుంది. నరాలకూ ఉత్తేజాన్నీ, శక్తినీ ఇస్తుంది.
You must log in to post a comment.