తేగలు & బుర్రగుంజు

తాటి పండ్లను భూమిలో పాతర వేస్తారు ల. (తక్కువ లోతు గుంటలో లేదా భూమి మీది తాటి పండ్ల పరిచి మీద మట్టి కప్పుతారు). ఒక్కో తాటి పండులో సాధారణంగా మూడు బుర్రలు ఉంటాయి, ఒక్కో బుర్ర ఒక్కో తాటి చెట్టు విత్తనం.

కొన్ని రోజులకు తాటి పండ్ల లోని ముట్ల/బుర్రల నుంచి మొలకలు వచ్చి వేరు భూమిలోకి దిగుతుంది,ఈ వేరునే మనం తేగ అని పిలుస్తాం.

పచ్చి తేగలను తినలేం, వాటిని ఉడక బెట్టటమో లేదా నిప్పులలో కాల్చి తినాలి. ఉడకబెట్టిన తేగ తొందరగా పాడవుతుంది, తేగ మీద ఒక బంక లాంటి పదార్థం ఏర్పడుతుంది. అందువల్ల ఉడక బెట్టిన తీగలను వాటి పైన ఉండే చర్మాన్ని వలిచి ఆరబెట్టాలి.

తేగలను కుండలో ఉంచి, తేగలపై కొంచెం నీళ్లు జిలకరిచి గడ్డి చుట్టతో కుండా మూతిని మూసి, ఈ కుండను బోర్లించి చుట్టూ గడ్డి చిన్న చిన్న పుల్లలు వేసి మంట పెడతారు. బోర్లా ఉంచిన కుండలో ఉన్న తేగలు బాగా ఉడుకుతాయి. ఈ పద్దతిని “తంపటి” వేయడం అంటారు. తంపటి వేసిన తేగలు రుచిగా ఉంటాయి, పైగా ఎక్కువ రోజులు బంక , భూజు పట్టకుండా ఉంటాయి.

సంక్రాంతి భోగి మంటల చివర్లో తేగలు కాల్చుకు తినడం ఒక ఆనవాయితీ గా ఉండేది. భోగి లోకి తేగలు ఇవిగో తీసుకోండి అంటూ పచ్చితేగలు పల్లెటూర్లలోని బంధువులు తెచ్చి ఇచ్చేవాళ్ళు.

తేగ మధ్యలో వివిధ పొరలతో కూడిన మెత్తని పుల్ల లాంటిది ఉంటుంది దాన్ని చందమామ అంటారు, దాని చివరన మెత్తగా ఉండి చాల తీయగా ఉంటుంది. తేగని భూమి నుంచి తీయకుండాఉంచి ఉంటె ఈ చందమామే తాటి ఆకు చిగురు అవుతుంది.

ఇసుక నేల అయితే తేగ బాగా బలంగా పెరుగుతుంది (తేగ బాగా ఊరింది అంటారు పల్లెల్లో ), తేగని భూమి నుండి పెరకడం కూడా సులభం. తేగ లేతగా ఉన్నపుడు రుచి బాగుంటుంది, అదే సమయంలో బుర్రగుంజు కూడా బాగుంటుంది.

తాటి బుర్రలు లేక తాటి ముట్లు

తాటి బుర్రలను మధ్యకి కత్తి తో చీల్చిన తరువాత

తేగ ముదిరే కొండి పిండి పదార్థం ఎక్కువై గట్టి పడుతుంది, కానీ బుర్ర లోని గుంజు వదులుగా గా అయిపోయి నీరు చేరుతుంది.

ఇలా నీరు ఎక్కువైన బుర్రగుంజు తింటే విరోచనాలు అవుతాయి.

%d bloggers like this: