వి.పి.సింగ్

వి.పి.సింగ్ (1931–2008)

వి.పి.సింగ్ గారి పూర్తి పేరు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ , ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అలహాబాద్ దగ్గరలో ఉన్న ఒక చిన్న జమీందారు కుటుంబంలో జన్మించిన సింగ్ గారు తమ దగ్గర బంధువులు మండా సంస్థాన రాజ కుటుంబానికి దత్తత వెళ్లారు. దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థలలో పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు అభ్యసించారు.

వి.పి.సింగ్ చిన్నతనం లో చాలా సిగ్గరి , రాజ సంప్రదాయం ప్రకారం గుఱ్ఱపు స్వారీ, ఖడ్గ యుద్ధం లో ప్రావీణ్యం సంపాదించారు. తండ్రి గోపాల్ సింగ్ తరువాత మండా సంస్థానానికి 27 ఏళ్ళు వయస్సు లో రాజుగా పట్టాభిషిక్తులయ్యారు.

వి.పి.సింగ్ తండ్రి గారు భారత దేశం మొదటి ప్రధాన మంత్రి నెహ్రూ గారు మంచి స్నేహితులు. నెహ్రూ ఆహ్వానం మేరకు సింగ్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీకి పూర్వాంచల్ ప్రాంతంలో బలమైన మద్దతుదారులుగా నిలిచారు.

1969,1980 లలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి, 1971,1980,1989, 1991,1996లలో లోక్ సభకు, 1983 నుంచి 1988 వరకు రాజ్య సభకు ఎన్నికయ్యారు. 1970లో అసెంబ్లీలో చీఫ్ విప్ గా, 1976 నుంచి 1977 వరకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా, 1980 నుంచి 1983 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గా, 1983 నుంచి 1988 వరకు ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులుగా ,1989 నుంచి 1990 వరకు దేశ ప్రధాన మంత్రి గా పనిచేశారు.

దేశ రక్షణ శాఖ మంత్రిగా బోఫోర్స్ కుంభకోణం వెలుగులోకి తెచ్చిన మొదటి వ్యక్తి , ప్రధానమంత్రి గా బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే మండల్ కమిషన్ సిఫార్సులు అమల్లోకి తెచ్చిన ప్రధానమంత్రి గా చరిత్ర లో నిలిచిపోయారు.

వి.పి.సింగ్ ను రాజకీయాల్లో అత్యంత నమ్మదగిన వ్యక్తి కాదు అని అన్ని పార్టీల నాయకులు విమర్శించారు. అధికారంలోకి రావడానికి పార్టీలు మారడానికి సాహసించారు.

వి.పి.సింగ్ అమలు చేసిన మండల్ రిజర్వేషన్లు కారణంగా దేశవ్యాప్తంగా అగ్రవర్ణాల ఆగ్రహానికి గురైన మొదటి అగ్రవర్ణ నాయకుడిగా , అయోధ్య యాత్ర ను అడ్డుకొని హిందూ మత వ్యతిరేకిగా దేశ రాజకీయాల్లో అత్యంత అమనకరమైన రీతిలో ప్రజలచే తులనాడబడిన నాయకుడిగా, తన రాజకీయ భవిష్యత్తు ను స్వయంగా నాశనం చేసుకున్న వ్యక్తిగా దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

%d bloggers like this:
Available for Amazon Prime