అటల్ బిహారీ వాజపేయి

అటల్ బిహారీ వాజపేయి(1924–2018)

భారత దేశ వికాస్ పురుషుడిగా ,భారత దేశ రాజకీయ బిష్మ పితామహుడు గా దేశవ్యాప్తంగా కీర్తింప బడుతున్న అటల్ బిహారీ వాజపేయి గారు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పట్టణంలో జన్మించారు, వీరి స్వస్థలం మాత్రం ఆగ్రా నగరం దగ్గర లో ఉన్న బాటేశ్వర్ గ్రామం.

ప్రాథమిక నుంచి డిగ్రీ వరకు గ్వాలియర్ నగరంలో పూర్తి చేసి పోస్టుగ్రాడ్యుయేషన్ ను లక్నోలో పూర్తి చేశారు. చిన్నతనంలోనే ఆర్ ఎస్ ఎస్ పట్ల ఆకర్షితుడై సంఘ శాఖల్లో ప్రతి రోజు పాల్గొనేవారు. ఆర్య సమాజ్ , ఆర్ ఎస్ ఎస్ లలో రెండింటి భాద్యతలు స్వీకరించి అప్పగించిన పనిని ఏకాగ్రత తో పూర్తి చేశారు.

ఆర్ ఎస్ ఎస్ సంఘ్ చాలక్ గురూజీ గోవల్కర్ గారి సూచనల మేరకు దీనా దయల్ ఉపాధ్యాయ గారితో కలిసి జనసంఘ్ పార్టీని విస్తరించడంలో కృషి చేశారు. లాల్ కృష్ణ అద్వానీ, వాజపేయి గారు తొలుత రాజకీయ మిత్రులు, అనంతరం ప్రాణ స్నేహితులు, వారి అనుబంధం 5 దశాబ్దాలు కొనసాగింది. దేశ మొదటి ప్రధాని నెహ్రూ గారినే తన అభిమానిగా మార్చుకున్నారు. నెహ్రూ గారితో ప్రారంభమైన చెలిమి ఆ తరువాత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతో కూడా కొనసాగింది.

1957,1967,1971,1977,1980,1989,1991,1996, 1998, 2004 వరకు మొత్తం 10 సార్లు లోక్ సభకు, 1964, 1985 లో రెండు సార్లు రాజ్య సభకు ఎన్నికయ్యారు. 1977లో దేశాయ్ మంత్రివర్గంలో విదేశాంగ శాఖ మంత్రిగా ,1996లో 13 రోజుల ,1998 నుంచి 2004 మొత్తం మూడు సార్లు దేశానికి ప్రధానమంత్రి గా పనిచేశారు.

వాజపేయి గారు గొప్ప రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా గొప్ప కవి, గొప్ప పత్రికా సంపాదకులు. దేశ రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి గా ఎన్నికైన కవి వాజపేయి గారు. వాజపేయి గారు దేశ అభివృద్ధి ని కాంక్షించారు ప్రధానమంత్రి గా 50 ఏళ్లలో సాధ్యపడని అభివృద్ధి ని కేవలం 6 సంవత్సరాలలో చేసి చూపిన పరిపాలన దక్షుడు.

60 దశాబ్దాలు రాజకీయాల్లో కొనసాగిన అవినీతి మరకలు అంటకుండా రాజకీయాల నుంచి విరమణ పొందారు. ఆయన చేసిన సేవలకు గాను భారత దేశ ప్రభుత్వాలు దేశంలో అత్యున్నత పద్మ భూషణ్, పద్మ విభూషణ్, భారత రత్న పురస్కారాలతో సత్కరించటం జరిగింది. వాజపేయి స్వేచ్ఛ వాద రాజకీయ నాయకుడు, తన రాజకీయ మూలలను కాపాడుకుంటూనే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రీతి పాత్రుడయ్యారు. రాజకీయాల్లో అజాత శత్రువు గా నిలిచిపోయారు.

%d bloggers like this: