బ్లాగింగ్ ద్వారా ఆదాయ మార్గాలు

బ్లాగింగ్ ద్వారా నెలకు పదివేల డాలర్లు(అంటే సుమారు ఏడెనిమిది లక్షలు) కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇందులో సగటు చెప్పడం కష్టం, మీ బ్లాగ్ని ఎంత మంది చూస్తున్నారు అనేదాన్ని బట్టి ఉంటుంది, లేదా మీరు ఎంచుకున్న ఆదాయ మార్గం బట్టి ఉంటుంది. మొదట ఆదాయ మార్గాలు చూద్దాం.

ప్రకటనలు : ఇది అత్యంత సాధారణంగా ఉపోయోగ పడే ఆదాయ మార్గం. ఇక్కడ మీ బ్లాగ్ కు ఎన్ని వీక్షణలు వస్తున్నాయి, ఎంతమంది ప్రకటనలు మీద ఆసక్తి చూపుతున్నారు, మీ ప్రేక్షకులు ఏ దేశానికి చెందిన వారు మొదలైనవి కారకాలుగా ఉంటాయి. గూగుల్ యాడ్సెన్స్, ఇంకా మరికొన్ని సంస్థలు ద్వారా ఈ ప్రకటనలు మీ బ్లాగులో కనబడేలా చేయవచ్చు.

అఫిలియేట్ మార్కెటింగ్ : అధిక ఆదాయం వచ్చేది ఇక్కడ నుండే. ఇక్కడ మీకు తక్కువ వీక్షకులు ఉన్నా కూడా ఎవరైనా మీ యొక్క లింక్ ద్వారా ఏదైనా వస్తువు గాని, సేవ గాని కొనుగోలు చేస్తే మీకు అంత కమిషన్ వస్తుంది. మరి కమిషన్ ఎవరు ఇస్తారంటే ఆ యొక్క వస్తువు గానీ, సేవ గానీ అందచేసే సంస్థ. అమెజాన్, వెబ్ హోస్టింగ్ సంస్థలు, ఇతర ఈ కామర్స్ సంస్థలు వంటివి సాధారణంగా ఇలాంటి భాగస్వామ్య ప్రోగ్రాంలలో చేరడానికి సౌకర్యం ఇస్తాయి.

మీ సొంత సేవలను/ఉత్పత్తులను అమ్మడం: మీకు కొంతమంది నమ్మకమైన వీక్షకులు వచ్చిన తరువాత బ్లాగ్ ద్వారా మీ యొక్క సొంత ఉత్పత్తులను గాని, సేవలను గాని అమ్మవచ్చు. ఉదాహరణకి ఏదైనా కోర్స్, ఈ పుస్తకం మొదలైనవన్నమాట.

పైన చెప్పిన మూడు విధాలుగా బ్లాగర్లు సంపాదించవచ్చు. దీనికి ఒక పరిమితి లేదు. మీరు బాగా కష్టపడితే ఊహించనంత ఫలితం ఉంటుంది. ఐతే కష్టం లేకుండా ఏమి జరగదండీ. ఎందుకంటే ఈ రోజు సంపాదిస్తున్న బ్లాగర్లు అందరు కొన్ని సంవత్సరాలు పని చేసారు (ఎన్నో బ్లాగులు ద్వారా ప్రయత్నించి) ఈ స్థాయి రావడానికి.

%d bloggers like this: