నితీశ్ కుమార్(1951)
నితీశ్ కుమార్ గురించి మన తెలుసుకొనే ముందు వారి కుటుంబ నేపథ్యంలోకి వెళితే బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో ఉన్నా హర్నట్ తాలూకాలోని కళ్యాణ్ భిగా వారి స్వగ్రామం, నితీశ్ తాతగారు కిశోరి శరణ్ సింగ్ గ్రామంలో పేరొందిన రైతు మాత్రమే కాకుండా ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు కూడా ,గ్రామంలో అనేక సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా కూడా పేరుపొందరు. నితీశ్ కుమార్ గారి తండ్రి కవిరాజ్ గారు కూడా వారి తండ్రి నుండి ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకోని ఆయుర్వేద వైద్యులు అయ్యారు ,స్వాతంత్ర్య సమరయోధులు మరియు బీహార్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు,పాట్నాలో చదువుకొనే రోజుల్లో ఆర్య సామాజ్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు,కవిరాజ్ గారు తన రాజకీయ కార్యకలపాల కోసం కళ్యాణ్ భిగా దగ్గరలోని బర్హా తాలూకాలోని భక్తియార్ పూర్ గ్రామంలో స్థిరపడ్డారు.ఇది నితీశ్ కుమార్ గారి కుటుంబ నేపథ్యం.
ప్రారంభ జీవితం, విద్య:
నితీశ్ కుమార్ 1వ తేదీ మార్చ్1951లో కవిరాజ్ రామ్ లాఖాన్ సింగ్,పరమేశ్వరి దేవి దంపతులకు,బీహార్ రాష్ట్రంలో ఉన్న పాట్నా జిల్లాలోని బర్హా తాలూకా భక్తియార్ పూర్ గ్రామంలో జన్మించారు.నితీశ్ కుమార్ చిన్నతనం నుంచే తెలివైన విద్యార్థిగా ఉపాధ్యాయుల నుంచి గుర్తింప బడ్డాడు,గణిత శాస్త్రం అంటే చాలా మక్కువ, అలాగే హిందీ భాష అంటే కూడా మక్కువ చూపేవారు,ముఖ్యంగా పాఠశాలలో జరిగే హిందీ వృకత్వ పోటీలలో కూడా పాల్గొనే వారు, పాట్నా లోని పాట్నా విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాల బీహార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ప్రస్తుతం జై ప్రకాశ్ నారాయణ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్))లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వెంటనే బీహార్ రాష్ట్ర విద్యుత్ కార్పొరేషన్ లో సహాయక ఇంజినీర్ గా చేరి కొంత కాలం పనిచేసి రాజీనామా చేశారు.1973లో జె.పి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమంలో పాల్గొని క్రియాశీలక రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
రాజకీయ జీవితం:
నితీశ్ కుమార్ తండ్రి కవిరాజ్ సింగ్ గారు బీహార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు, స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్ళారు, అటువంటి నిజాయితీ గల నాయకుడైన కవిరాజ్ గారు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1952లో జరిగిన బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో తనకు పట్టున్న భక్తియార్ పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయాలని ఆశించారు,కానీ అధిష్టానం వేరే వ్యక్తికి ఇవ్వడం జరిగింది, మళ్ళీ 1957లో పార్టీ టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు,తరువాత రాజకీయాల నుంచి విరమించుకున్నారు. తండ్రి రాజకీయ జీవితాన్ని సునిశితంగా గమనిస్తున్న నితీశ్ చిన్నతనం నుంచే సోషలిస్టు దిగ్గజం రామ్ మనోహర్ లోహియా భావజాలనికి ఆకర్షితులయ్యారు.
- విద్యార్థి నేతగా:
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో మొదటిసారిగా లోహియా, జయప్రకాష్ నారాయణ్,సత్య నారాయణ్ సిన్హా వంటి సోషలిస్టు దిగ్గజాలను కలుసుకోవడంతో వారి భావాల ప్రభావం వల్ల రాజకీయాల మీద ఆసక్తి మరింత పెరిగింది,నితీశ్ లోహియా నాయకత్వంలోని సంయుక్త సోషలిస్టు పార్టీ యువజన విభాగం సమాజ్ వాదీ యువజన్ సభలో చేరారు అప్పుడే లాలూ ప్రసాద్ యాదవ్(ఆర్.జె.డి పార్టీ అధినేత, మాజీముఖ్యమంత్రి), రఘువంశ్ ప్రసాద్ సింగ్(కేంద్ర మాజీమంత్రి) వంటి మొదలైన యువనాయకులు పరిచయమయ్యారు (తరువాత కాలంలో వీరందరూ దేశ, బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో రాణించారు) . పాట్నా విశ్వవిద్యాలయంలో నెలకొన్న అనేక సమస్యల మీద లాలూ ప్రసాద్ నాయకత్వంలో పోరాటం చేశారు, నితీశ్ తన విషయ పరిజ్ఞానంతో అనతి కాలంలోనే పార్టీలో అలాగే లాలూకి అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిగా మారారు, ఎంతలా అంటే యువజన విభాగం తరుపున అంతరాష్ట్ర విద్యార్థుల చర్చలకు నితీశ్ ని ఎంపిక చేసేలా,అలాగే ఏదైనా పోరాటం మొదలుపెట్టాలన్న ముందు నితీశ్ తో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకునేటంతగా. లాలూ వయస్సులో నితీశ్ కన్న పెద్దవాడైన యిద్దరు కలసి పార్టీ తరుపున విశ్వవిద్యాలయంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.సోషలిస్టు యువజన విభాగానికి నితీశ్, లాలూ ప్రసాద్ ఉన్నట్లు జనసంఘ్ యువజన విభాగనికి సుశీల్ కుమార్ మోడీ(ప్రస్తుత బీహార్ ఉపముఖ్యమంత్రి), రవి శంకర్ ప్రసాద్(ప్రస్తుత కేంద్ర మంత్రి) ఉండేవారు. రాజకీయ భవజాలపరంగా నితీశ్ కుమార్, సుశీల్ కుమార్ లకు వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఇద్దరూ ఎంతో స్నేహితంగా ఆనాటి నుండి ఈనాటికి కొనసాగుతున్నారు.
- సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో :
బీహార్ విద్యుత్ కార్పొరేషన్ లో ఇంజినీర్ గా పనిచేస్తున్న నితీశ్ కుమార్ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ చేపట్టిన సంపూర్ణ క్రాంతి ఉద్యమం వైపు ఆకర్షితుడై తన ఉద్యోగం నుండి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చారు. అవినీతి, పాలన నియంతృత్వం ప్రధానంగా జరిగిన ఉద్యమంలో లాలూ ప్రసాద్, రామ్ విలాస్ పాశ్వాన్, సుశీల్ కుమార్ మోడీ,ములాయం సింగ్ యాదవ్,శరద్ యాదవ్ వంటి యువకులతో పాటు చంద్రశేఖర్, రామకృష్ణ హెగ్డే, జార్జ్ ఫెర్నాండెజ్, మధు దండవాతే, ఎస్.ఆర్.బొమ్మై, నానజీ దేశముఖ్ వంటి రాజకీయ నాయకులతో కలిసి నితీశ్ కుమార్ ఉద్యమంలో పనిచేశారు.సంపూర్ణ క్రాంతి ఉద్యమ కాలంలో నితీశ్ సోషలిస్టు సిద్ధాంతాలను మరింత లోతుగా అధ్యయనం చేసారు.జె.పి గారి ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో ఇందిరా ప్రభుత్వం విధించిన ఎమెర్జెన్సీ వల్ల మీసా చట్టం కింద అరెస్ట్ చేయడంతో తన జీవితంలో మొదటిసారి జైలుకు వెళ్లారు,1977లో ఎమెర్జెన్సీ తొలగించిన తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.
- ప్రజాక్షేత్రంలో :
1977లో జె.పి స్థాపించిన జనతా పార్టీలో లాలూ ప్రసాద్, నితీశ్ కుమార్ చేరారు , లాలూ ప్రసాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు, కానీ నితీశ్ పోటీ చేసిన హర్నట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమి పాలయ్యారు, కేవలం మూడేళ్ళ ల్లో జనతా ప్రభుత్వం పడిపోవడంతో లాలూ ప్రసాద్ తో కలిసి జనతా పార్టీలో చీలిక వర్గమైన రాజ్ నారాయణ్ నేతృత్వంలోని జనతా పార్టీ(సెక్యూలర్)లో చేరి 1980లో మళ్ళీ రెండోసారి హర్నట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.1984 లో జనతా పార్టీ(సెక్యూలర్), చరణ్ సింగ్ నేతృత్వంలోని లోక్ దళ్ పార్టీ లో విలీనం జరగడంతో 1985 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ లోక్ దళ్ అభ్యర్థిగా టిక్కెట్ ఆశించిన నిరాశ ఎదురవడంతో స్వతంత్ర అభ్యర్థిగా హర్నట్ నుంచి మూడోసారి పోటీ చేసి గెలుపొందారు తిరిగి లోక్ దళ్ పార్టీలో చేరారు, శాసనసభలో నితీశ్ చేసే ప్రతి విమర్శ పాలకపక్షానికి కాలవరనికి గురి చేసేది లాలూ పార్టీ నేతగా వ్యవహరిస్తున్న అసెంబ్లీలో జరిగే వాడివేడిగా జరిగే చర్చల్లో నితీశ్ కుమార్ పాల్గొని తమ పార్టీ గళాన్ని గట్టిగా వినిపించారు. 1989లో మొదటి సారి లోక్ సభకు పోటీ చేసి బర్హా నుంచి గెలుపొందిన నితీశ్ తరువాత 1991,1996,1998,1999, 2004 వరకు వరుసగా ఆరుసార్లు గెలుపొందిన ఏకైక బీహార్ నాయకుడిగా నితీశ్ చరిత్రలో నిలిచిపోయారు (ముఖ్యంగా బర్హ్ లోక్ సభ నియోజకవర్గంలో అంతకుముందు ఉన్న కేంద్ర మాజీ మంత్రి తారకేశ్వరి సిన్హా పేరిట ఉన్న 4 సార్లు రికార్డును బద్దలుకొట్టి నితీశ్ 5 సార్లు గెలిచారు,ఆరోసారి నలంద నియోజకవర్గంలో గెలుపొందారు).2005 నుంచి ప్రస్తుతం వరకు బీహార్ శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు.
- పార్లమెంట్ సభ్యుడిగా:
1989: యువకుల కోటాలో జనతా దళ్ పార్టీ తరుపున మొదటిసారి లోక్ సభకు తన సొంత నియోజకవర్గం మైన బర్హా నుంచి పోటి చేసి గెలిచి మొదటిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు . నితీశ్ సోషలిస్టు దిగ్గజం చంద్రశేఖర్ గారి శిష్యరికం వల్ల పార్లమెంట్ రాజకీయాలను అవగాహన చేసుకుని బీహార్ రాష్ట్ర సమస్యలు మీద ఎక్కువగా మాట్లాడేవారు, అనతి కాలంలోనే ప్రధానమంత్రి వి.పి.సింగ్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. జనతాదళ్ పార్టీలోని దిగ్గజాలు దేవిలాల్,అరుణ్ నెహ్రూ, అరిఫ్ మొహమ్మద్,మధు దండవతే,చంద్రశేఖర్, జార్జ్ ఫెర్నాండెజ్ వంటి హేమహామీలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.1990లో కేంద్ర వ్యవసాయ,సహకార సహాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
1991: రెండో సారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యి పార్లమెంట్ పార్టీ ఉపనాయకుడిగా జనతాదళ్ పార్టీ తరుపున ఎన్నుకోబడ్డారు,అటు పార్లమెంటులో మాత్రమే కాకుండా బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు . వివిధ పార్లిమెంట్ స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా నియమించబడ్డారు, అలాగే వ్యవసాయ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా కూడా వ్యవహరించారు.
1996: మూడోసారి పార్లమెంట్ సభ్యుడిగా సమతా పార్టీ తరుపున పోటీ చేసి ఎన్నికయ్యారు, సమతా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా జార్జ్ ఫెర్నాండెజ్ , ఉప నాయకుడిగా నితీశ్ కుమార్ ఎన్నికవ్వడం జరిగింది, పార్లిమెంట్ సభ్యుడిగా నితీశ్ బీహార్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తన తోటి సభ్యులతో కలిసి గళం విప్పేవారు, లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా ఎన్నికయ్యారు,అలాగే అంచనాలు, రాజ్యాంగ, రక్షణ పార్లమెంట్ స్థాయి సంఘాలలో సభ్యుడిగా ఎన్నికయ్యారు.
1998: 12వ లోక్ సభ ఎన్నికల్లో సమతా పార్టీ బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్యకూటమి (ఎన్.డి.ఏ)లో చేరి ఎన్నికల్లో పోటీ చేసి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది నితీశ్ నాలుగోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు, కేంద్ర రైల్వే, ఉపరితల రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
1999: 12వ లోక్ సభ కేవలం 13 నెలల్లో రద్దు కావడం వల్ల మళ్ళీ జరిగిన 13వ లోక్ సభ ఎన్నికల్లో సమతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు, కేంద్రంలో మళ్ళీ ఎన్.డి.ఏ అధికారంలోకి రావడంతో నితీశ్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో ఉపరితల,వ్యవసాయ, రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
2004: 14వ లోక్ సభ ఎన్నికల్లో బర్హ్ , నలంద నియోజకవర్గాల్లో పోటీచేసి నలంద నియోజకవర్గంలో గెలుపొంది ఆరోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు, అలాగే జనతాదళ్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కూడా వ్యవహరించారు.
- కేంద్రమంత్రిగా:
1989లో వి.పి.సింగ్ నేతృత్వంలో ఏర్పడిన జనతాదళ్ ప్రభుత్వంలో నితీశ్ మొదటి సారిగా 1990లో కేంద్ర వ్యవసాయ, సహకార శాఖల సహాయ మంత్రిగా భాద్యతలు చెప్పట్టారు, పేరుకే సహాయ మంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రిత్వ భాద్యతలు మొత్తం నితీశ్ కుమార్ నిర్వహించారు(వ్యవసాయ శాఖ మంత్రి అయిన దేవిలాల్ ఉప ప్రధానమంత్రి కూడ కావడంతో తన కార్యభారం మొత్తాన్ని నితీశ్ కు అప్పగించారు), నితీశ్ వ్యవసాయ శాఖామంత్రి గా రైతుల కోసం అనేక పథకాలు అమలు జరపడానికి కార్యచరణ రూపొందించి అమలు జరుపుతున్న సమయంలో వి.పి.సింగ్ ప్రభుత్వం కూలిపోయింది.
1998లో మళ్ళీ అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో కేంద్రంలో ఎన్.డి.ఎ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సమతా పార్టీ నుంచి జార్జ్ ఫెర్నాండెజ్ రక్షణ శాఖ మంత్రిగా, నితీశ్ కుమార్ రైల్వే శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రైల్వే అధికారులతో సమీక్షలు జరుపుతూ శాఖ ఆదాయం పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు, అలాగే బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి రెండు నెలలు వ్యవధి మాత్రమే ఉండటంతో రైల్వే బడ్జెట్ తయారు చేయడం పై విస్తృతంగా అధికారులతో సమీక్షలు జరిపి బడ్జెట్ తయారీలో సూచనలను అనేక చేశారు,అలా రెండు నెలలు రోజుకు 18 గంటలు పనిచేసి ప్రధానమంత్రి మన్ననలు పొందారు. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న సమయంలో
తరువాత మీడియాతో మాట్లాడుతూ
రైల్వే మంత్రి గా పనిచేస్తున్న సమయంలోనే ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్న అన్నా డి యం కె చెందిన నాయకుడు రాజీనామా చేయడంతో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ఆ శాఖను నితీశ్ కుమార్ కు అప్పగించారు, రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో
నితీశ్ కుమార్ మొదటిసారి ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలొనే ప్రధాని వాజపేయిగారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మరియు గుజరాత్ లోని ద్వారకా నుండి కలకత్తా వరకు దేశం మొత్తాన్ని కలుపుతూ “స్వర్ణ చతుర్భుజి(Golden triangle) ” పథకానికి స్వీకారం చేశారు,రవాణా శాఖ మంత్రిగా ప్రాజెక్ట్ చేప్పట్టేందుకు కావాల్సిన వ్యయం,మౌలికవసతులు వంటి అనేక విషయాలను అధికారులతో చర్చించి రిపోర్టు తయారు చేసి ఇవ్వవలని అధికారులను ఆదేశించారు. నూతన రవాణా ప్రోజెక్టుల వివరాల గురించి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయం.
రైల్వే, రవాణా మంత్రిత్వశాఖలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న సమయంలోనే అన్నా డి యం కె ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వల్ల 1999లో వాజపేయి ప్రభుత్వం కూలిపోయింది,1999లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ ఎన్.డి.ఎ కూటమికే అధికారం ఇవ్వడంతో నితీశ్ కుమార్ మళ్ళీ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో
ఉపరితల మంత్రిగా కేవలం కొద్ది నెలలు మాత్రమే పనిచేసిన ఆ శాఖలోని పై అధికారులు నుంచి కింది స్థాయి గుమస్తా వరకు నితీశ్ జవాబుదారీతనాన్ని అమలు చేసారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టిన నితీశ్ తాను సహాయ మంత్రిగా ఉన్న సమయంలో రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి పూనుకున్నారు ఆలాంటి వాటిలో ఒకటి పంటలకు గిట్టుబాటు ధర(M.S.P) పెంచడం ముందుగా ఒకటి, తరువాత సాగునీటి ప్రాజెక్టులపై కూడా దృష్టి సారించారు, సాగునీటి వనరుల నిర్వహణ పద్దతులు కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం వంటివి మొదటిసారిగా నితీశ్ కుమార్ హయాంలోనే జరిగింది .వ్యవసాయ, రవాణా మంత్రిత్వ శాఖలు ఒక ఎత్తయితే రైల్వే శాఖ సమర్ధవంతంగా నిర్వహించిన మంత్రిగా అందరిచేత ప్రశంసలు అందుకున్నారు.కేంద్ర రైల్వే మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రైల్వే శాఖ కార్యాలయాలు మొత్తాన్ని ఆధునికీకరణ నితీశ్ హయాంలోనే జరిగింది, టిక్కెట్ రిజర్వేషన్ ,తత్కాల్ బుకింగ్ వంటివి నితీశ్ హయాంలోనే ప్రవేశపెట్టారు. రైల్వే రిజర్వేషన్లు ప్రారంభించిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ
అలాగే దేశంలో కొత్త రైల్వే జోన్స్ ఏర్పాటు కూడా నితీశ్ హయాంలోనే జరిగింది,రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు ఎక్కువ నిధులను మంజూరు చేయడం కూడా నితీశ్ హయాం నుంచే మొదలైంది, అలాగే రైల్వే బడ్జెట్ లో ప్రయాణికులకు టిక్కెట్ రాయితీ ప్రోత్సాహకాలు వంటివి ఎన్నో కార్యక్రమాలు రైల్వే మంత్రిగా చేపట్టారు. పాట్నాలోని గంగా నది ఒడ్డున ఉన్న జె.పి సేతుగా పిలవబడే డిఘ-సొన్ పూర్ రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి శంకుస్థాపన నితీశ్ కుమార్ హయాంలోనే జరిగింది (2016లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ,బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లు ప్రారంభించారు ). శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ప్రధానమంత్రి వాజపేయి తో పాటుగా స్టేజ్ మీద
దేశం మొత్తం మీద అనేక రైల్వే ప్రొజెక్టులకు అంకురార్పణ చేశారు . రైల్వే బడ్జెట్ ప్రవేశానికి ముందు పార్లమెంట్ ఆవరణలో
నితీశ్ రైల్వే శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసే సమయానికి అత్యంత లాభదాయక శాఖగా మార్చిన ఘనతను సొంతం చేసుకున్నారు.
- ముఖ్యమంత్రిగా:
2000:
2000 లో జరిగిన బీహార్ ఎన్నికల్లో సమతా పార్టీ, బీజేపీ కలిసి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రెండు పార్టీలు ఎన్నికల బరిలోకి దిగాయి.ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత 324 స్థానాలు ఉన్న అవిభజిత బీహార్ రాష్ట్ర అసెంబ్లీలో ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే సీట్లు రాలేదు,124 సీట్లతో అతిపెద్ద పార్టీగా లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ అవతరించింది.బీజేపీ పార్టీ ,సమతా పార్టీకి కలిపి మొత్తం 101 స్థానాలు రావడంతో శరద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ్ పార్టీ, శిబు సొరేన్ నేతృత్వంలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ,అలా వారు అసెంబ్లీలో అడుగు పెడుతున్న సమయంలో మీడియా ముందు తమ ఐకమత్యం తెలియజేస్తూ
అలా, మొదటిసారిగా నితీశ్ కుమార్ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు కొన్ని కారణాల వల్ల అసెంబ్లీలో సంఖ్య బలం నిరూపించుకోలేక కేవలం 7 రోజులు ముఖ్యమంత్రి గా పనిచేసి రాజీనామా చేశారు.
2005–2010:
ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2005 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ లేకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించి మళ్ళీ అక్టోబర్ చివర్లో ఎన్నికలు జరిగాయి ఈ సారి జనతాదళ్, బీజేపీ కలిసి తొలిసారిగా సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి,నితీశ్ కుమార్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు, తన మిత్రుడు బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ ఉపముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత
భాద్యతలు స్వీకరించిన తర్వాత నితీశ్ కుమార్ మొదట రాష్ట్ర ఆర్థిక పరిస్థితి , శాంతిభద్రతల గురించి దృష్టి సారించారు, 1990నుండి 2005 వరకు సాగిన లాలూ ప్రసాద్ కుటుంబ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతల, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారయ్యింది, అలాగే దేశంలో “బిమారు(బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్)” రాష్ట్రాల జాబితాలోకి చేర్చబడింది,లాలూ ప్రసాద్,రబ్రీ దేవీ ముఖ్యమంత్రిలుగా ఉన్నప్పుడు అవినీతి, బంధుప్రీతితో అలరారుతూ ఆటవిక రాజ్యాన్ని తలపించింది. నితీశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ క్రమంలో అనేకమంది నేరస్తులను అరెస్టు చేసి జైలుకు పంపించారు, శాంతిభద్రతల సమస్యలు సాధారణ స్థితికి వచ్చిన తరువాత కేంద్రప్రభుత్వంతో కలసి మావోయిస్టుల కార్యకలాపాలు రాష్ట్రంలో బలపడడానికి విలులేకుండా అనేక కఠినమైన చర్యలు తీసుకున్నారు. బిహార్ రాష్ట్ర ప్రధాన ఆర్థిక వనరు వ్యవసాయం కావడంతో(అవిభజిత బిహార్ రాష్ట్రంలో ఝార్ఖండ్ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం చేకూరేది కానీ ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాత బీహార్ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది)నితీశ్ ప్రభుత్వం సేల్స్, ల్యాండ్ టాక్స్ ల ద్వారా ఖజానాకు ఆదాయం చేకూర్చే అనేక సంస్కరణలు విస్తృతంగా అమలు చేయడం జరిగింది. అవినీతి రహిత పరిపాలన అందించేందుకు అవినీతి నిరోధక శాఖకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు.2009 బిమారు రాష్ట్రాల వార్షిక నివేదిక లో మిగిలిన రాష్ట్రాల కన్న ఆర్థిక ప్రగతి మెరుగ్గా ఉందని సాక్షాత్తు రిసర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ నుండి ప్రశంసలు అందుకున్నారు.బీహార్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి గా దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు,ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు వారంలో ప్రతి శుక్రవారం ప్రజల కోసం ” జనతా దర్బార్ ” కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అదేశించడమే కాకుండా తాను కూడా నెలలో ఒకరోజు తన నివాసంలో కార్యక్రమంలో ఇప్పటికీ పాల్గొంటూనే ఉన్నారు. ప్రజలు నితీశ్ ను ” సుసన్ బాబు ( అభివృద్ధి ప్రదాత )” గా బీహార్ ప్రజలు చేత గౌరవాన్ని పొందారు.
2010–2015 :
నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి 2009 లోక్ సభ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలు సాధించింది( మొత్తం 40 స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 32 స్థానాలను కైవసం చేసుకుంది),2010లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ తో గెలిపించారు(మొత్తం 243 స్థానాలకుగాను ఎన్డీయే కూటమి 206 స్థానాలు కైవసం చేసుకుంది). ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ
ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేస్తూ
నితీశ్ మూడోసారి ముఖ్యమంత్రి గా భాద్యతలు చేప్పట్టిన వెంటనే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి సారించారు, మొదటి సారి అధికారం చేపట్టిన తరువాత కేవలం రోడ్లు విస్తరణ పనులు ముమ్మరంగా ఆరంభించారు కానీ విద్య,విద్యుత్, త్రాగునీటి సమస్యల పరిష్కారం కోసం కార్యచరణ రూపొందించి పనులు చేపడుతున్న సమయంలో ఎన్నికలు రావడంతో కొంత జాప్యం జరిగిన తిరిగి నితీశ్ అధికారంలోకి వచ్చిన తరువాత పనులను వేగవంతం చేశారు,2013 నాటికి రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి విద్యుత్, రోడ్లు, వైద్య , త్రాగునీటి సదుపాయాలు సమకూర్చారు.నితీశ్ మరో అడుగు ముందుకు వేసి మహిళా సాధికారత కోరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50%సీట్లు మహిళలకు కేటాయించారు,అలాగే బాలికలకు పాఠశాలకు వెళ్ళేటందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున సైకిళ్లు అందించారు. నితీశ్ ప్రభుత్వ అభివృద్ధి నమూనాను మెచ్చుకుంటూ ప్రపంచ బ్యాంక్ అధికారులు ప్రశంసించారు,తన మిత్రపక్షమైన బీజేపీ ఎన్డీయే కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పేరును ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ ఎన్డీయే కూటమి నుండీ వైదొలగారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పొందడంతో బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు, కొద్దీ నెలల్లోనే మళ్లీ నాలుగో సారి అధికారం చేపట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు.
2015–2020:
2015 ఎన్నికల్లో తన పాత మిత్రుడు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ తో కలసి మహాఘట్ బంధన్ కూటమిగా బరిలోకి దిగి మళ్ళీ ఎన్నికల్లో విజయం సాధించి ఐదో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ముఖ్యమంత్రి అయ్యాక బీహార్ రాష్ట్రం మొత్తం సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు జరిగేలా చర్యలు చేపట్టారు, ప్రజల కోసం నూతన సంక్షేమ పథకాల అమలు శ్రీకారం చుట్టారు,లాలూ ప్రసాద్ తనయుడు అప్పటి బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రైల్వే కాంటీన్ కు సంబంధించిన అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ జరిపించాలని నితీశ్ స్వయంగా కేంద్ర దర్యాప్తు సంస్థకు లేఖ రాశారు, అలాగే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్డీయే కూటమిలో చేరి బీజేపీ మద్దతుతో మళ్లీ 6వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు
2019 లోక్ సభ ఎన్నికల్లో మళ్ళీ నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి బీహార్ రాష్ట్రంలో 40 సీట్లకుగాను 39 సీట్లు కైవసం చేసుకుంది.
2020:
2020లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలో తిరిగి ఎన్డీయే కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చింది.ఏడో సారి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు.
- నితీశ్ కుమార్ ప్రాతినిధ్యం వహించిన రాజకీయ వేదికలు :
నితీశ్ కుమార్ రాజకీయాలు మొత్తం సామాజిక న్యాయం కోసం చుట్టే కేంద్రీకృతమైనవి, ప్రజలకు సామాజిక న్యాయం అందించే కోరకు పలు రాజకీయ వేదికలతో కలిసి పని చేసారు.
సంయుక్త సోషలిస్టు పార్టీ :
నితీశ్ కుమార్ ఎంతగానో అభిమానించే సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా స్థాపించిన పార్టీ. విద్యార్థిగా ఉన్న సమయంలో పార్టీ యువజన విభాగం మైన సమాజ్ వాదీ యువజన విభాగంలో చేరిన కొద్ది రోజులకే పార్టీ యువజన విభాగం నాయకుడు లాలూ ప్రసాద్ తో స్నేహం ఏర్పడింది, వారి స్నేహం ఎంతలా అంటే లాలుకు వివాహం జరిగేదాక నితీశ్ కుమార్ తో హాస్టల్లో ఒకే గదిలో ఉండేవారు, పాట్నా విశ్వ విద్యార్థి సంఘం ఎన్నికల్లో లాలూ ప్రసాద్ నిలబడేలా ఒప్పించి తానే స్వయంగా లాలూ ప్రసాద్ తరుపున ప్రచారం చేసి గెలిపించారు, లాలూ ప్రసాద్ ఎం.ఎ చదువు పూర్తి చేసి యూనివర్సిటీ లో లా కోర్స్ ను అభ్యసించడానికి అక్కేడే ఉండిపోయారు, నితీశ్ మాత్రం ఇంజినీరింగ్ పూర్తి చేసి బీహార్ విద్యుత్ కార్పొరేషన్ లో ఇంజినీరుగా తన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించిన నితీశ్ అందులో ఇమడలేక రాజీనామా చేసి అప్పుడే అవినీతి రహిత సమాజం కోసం జె.పి తలపెట్టిన ఉద్యమం వైపు ఆకర్షితుడై ఉద్యమంలో తన మిత్రుడు లాలూ ప్రసాద్ తో కలసి ఉద్యమంలో పాల్గొని ఎమెర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు సైతం వెళ్లారు.
జనతా పార్టీ :
1977లో ఎమెర్జెన్సీ ఎత్తివేసిన తరువాత నిరంకుశ ఇందిరా గాంధీ పరిపాలనకు వ్యతిరేకంగా జై ప్రకాశ్ నారాయణ్ స్థాపించిన జనతా పార్టీలో తన మిత్రుడు లాలూ ప్రసాద్ తో కలిసి చేరారు,1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ లోక్ సభకు పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు, నితీశ్ మాత్రం 1978లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు,ఓటమి చవిచూసిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఇండియా తరుపున ప్రపంచ యువతకు సంబంధించిన నాయకత్వ సదస్సులో పాల్గొన్నారు ముఖ్యంగా సోషలిస్టు భావజాలాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రష్యా దేశంలో పర్యటించి సోషలిస్టు నూతన భావాలను అధ్యయనం చేసేటందుకు రష్యా పర్యటన బాగా ఉపయోగపడింది.1980లో జనతా పార్టీలో చీలికలు ఏర్పడటంతో , రాజ్ నారాయణ్ నేతృత్వంలో ఉన్న జనతాపార్టీ(సెక్యూలర్)లో తన మిత్రుడు లాలూ ప్రసాద్ తో కలిసి చేరి మళ్ళీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు, లాలూ ప్రసాద్ మాత్రం అసెంబ్లీకి ఎన్నికయ్యి అసెంబ్లీలో పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారు, నితీశ్ మాత్రం ఓటమికి నిరాశ చెందకుండా తన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చెప్పట్టారు ప్రజల మద్దతు పొందటం జరిగింది,1984లో జనతాపార్టీ(సెక్యూలర్)ని మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్ నేతృత్వంలోని లోక్ దళ్ పార్టీలో విలీనం జరిగింది.
లోక్ దళ్ :
లాలూ ప్రసాద్ , నితీశ్ కుమార్ తదితరులు లోక్ దళ్ పార్టీ లో చేరారు 1985 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కొందరి ఒత్తిడి తో నితీశ్ కు పార్టీ టిక్కెట్ రాకుండా చేయడంతో ,నితీశ్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా తన నియోజకవర్గం హర్నట్ నుంచి బరిలోకి దిగి లోక్ దళ్ పార్టీ అభ్యర్థి మీద ఘనవిజయం సాధించారు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు, లాలూ ప్రసాద్ చొరవతో తిరిగి లోక్ దళ్ పార్టీలో చేరారు అసెంబ్లీలో తన విషయ పరిజ్ఞానం తో అతికొద్ది సమయంలో పార్టీలో ముఖ్యనేతగా ఎదిగారు,1987లో పార్టీ అనుబంధ విభాగామైన యువ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో లాలూతో
జనతాదళ్ :
1989 లోక్ సభ ఎన్నికల్లో పూర్వ జనతా పార్టీలోని చీలికలు మొత్తం కలసి జనతాదళ్ పార్టీగా ఏర్పడటంతో లాలూ ప్రసాద్, నితీశ్ కుమార్ లు ఇద్దరూ కలిసి జనతాదళ్ పార్టీ విజయం కోసం పార్టీ తరుపున బీహార్ రాష్ట్రం మొత్తం ప్రచారం చేశారు, అలా ప్రచారం చేస్తున్న సమయంలో
ఇదే ఎన్నికల్లో నితీశ్ పాట్నా సమీపంలోని తన సొంత లోక్ సభ నియోజకవర్గమైన బర్హ్ నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు, నితీశ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నేతగా పార్టీలో ఎదుగుతున్న సమయంలోనే కేంద్రంలో జనతాదళ్ పార్టీ అధికారంలోకి రావడంలో కృషి చేసినందుకు కేంద్ర పార్టీ అధినాయకత్వం నితీశ్ ను బీహార్ రాష్ట్ర జనతాదళ్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా నియమించింది.ఒకవైపు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటూనే బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ గడిపారు,1990లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ముఖ్యమంత్రి గా ఎవరిని నియమించాలనే మీమాంసలో ఉన్న లాలూ ప్రసాద్ పేరును మొదటగా నితీశ్ ప్రతిపాదించడమే కాకుండా పార్టీ తరుపున గెలిచిన సభ్యులతో కలిసి పార్టీ నాయకులు ఉప ప్రధానమంత్రి దేవి లాల్, ఒరిస్సా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ , ప్రధానమంత్రి వి.పి.సింగ్ చేత లాలూ ప్రసాద్ అభ్యర్థిత్వానికి ఆమోద ముద్ర వేయించారు,అలా లాలూ ప్రసాద్ బీహార్ రాష్ట్రానికి జనతాదళ్ పార్టీ తరుపున ముఖ్యమంత్రి అవ్వడంలో నితీశ్ కీలక పాత్ర పోషించారు. ప్రమాణ స్వీకారం సమయంలో నితీశ్, లాలూ,శరద్ యాదవ్
1990 ప్రారంభంలో నితీశ్ కేంద్ర వ్యవసాయ, సహకార శాఖ సహాయ మంత్రి భాద్యతలు చేపట్టి కొంతకాలం పనిచేసారు,1991లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు, జనతాదళ్ పార్టీ కి జాతీయ ప్రధానకార్యదర్శి గా కూడా ఎన్నికయ్యారు ,పార్టీ పార్లమెంట్ ఉపనాయకుడిగా పార్లమెంటులో బీహార్ రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తూనే కేంద్ర ప్రభుత్వం తీసుకొనే వివాదాస్పద నిర్ణయాలను విమర్శలు చేయడానికి వెనుకడేవారు కాదు,ముఖ్యంగా బాబ్రీ మసీదు కూల్చివేత ప్రక్రియ జరగడానికి కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే ప్రధాన కారణం గా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి పి.వి నైతిక బాధ్యత వహిస్తు రాజీనామా చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి మంత్రి లాలూ ప్రసాద్ తో కలిసి పాట్నా లో నిరాహారదీక్ష సమయంలో
ఈ సమయంలో లాలూ ప్రసాద్ ముఖ్యమంత్రి గా కొన్ని వివాదాస్పద నిర్ణయాల వల్ల అటు ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు రావడంతో నితీశ్ తదితరులు నిర్ణయాలను పూనః సమీక్ష చేయాల్సిందిగా కోరాడం లాలూ ప్రసాద్ ససేమిరా అనడం వెంటవెంటనే జరిగిపోయాయి, అలాగే లాలూ ప్రసాద్ తన పాలన సుస్థిరం చేసుకోవడానికి పార్టీలో నేరస్తులను చోటు ఇవ్వడం కూడా వారి మధ్య పెరిగేలా చేసింది ,1993లో నితీశ్ తన అనుచరులతో కలిసి జనతాదళ్ పార్టీ పదవులకు రాజీనామా చేశారు.రాజీనామా చేసిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ
సమతా పార్టీ :
జనతాదళ్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత నితీశ్ పార్లమెంట్ కేంద్రంగా బిహార్ రాష్ట్రంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు మీద పార్లమెంట్ సాక్షిగా విమర్శలు చేశారు, అదే సమయంలో జనతాదళ్ పార్టీ చీలికవర్గమైన జనతాదళ్(జార్జ్)పార్టీ అధినేత జార్జ్ ఫెర్నాండెజ్ తో మంతనాలు జరిపి కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు, అలా 1994 ప్రారంభంలో సమతా పార్టీ ఆవిర్భావించింది,పార్టీ కార్యాలయంలో జార్జ్ ఫెర్నాండెజ్ , నితీశ్ కుమార్ మిగిలిన నాయకులు
1994లో పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన సమావేశంలో సమతా పార్టీ ని ప్రజలకు పరిచయం చేశారు ఆ సమయంలో భాగంగా వేదిక మీద
బీహార్ లోని లాలూ ప్రసాద్ యాదవ్ వ్యతిరేక వర్గం మొత్తం పార్టీలో చేరడంతో పార్టీకి రాష్ట్రంలో బలమైన పూనాదులు ఏర్పడ్డాయి, సమతా పార్టీ అధ్యక్షుడిగా జార్జ్ ఫెర్నాండెజ్ ఎన్నికయ్యారు. సమతా పార్టీ ఆవిర్భావంతో జనతాదళ్ పార్టీకి అండగా ఉన్న వెనుకబడిన తరగతుల ప్రజలు క్రమంగా సమతా పార్టీ వైపు మల్లడంతో లాలూ ప్రసాద్ యాదవ్ -ముస్లింల సంఘటిత ఓట్లను తనవైపు ఆకర్షించేందుకు వారికి పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తన వైపు తిప్పుకున్నారు.1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సమతా పార్టీ ప్రకటించి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా
ఎన్నికల్లో సమతా ఓటమి పాలయింది,1996 లోక్ సభ ఎన్నికల్లో సమతా పార్టీ 13 సీట్లు కైవసం చేసుకుంది నితీశ్ కూడా మళ్ళీ లోక్ సభకు ఎన్నికయ్యారు, కేంద్రంలో అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో ఏర్పడ్డ 13 రోజుల ప్రభుత్వానికి సమతా పార్టీ ద్వారా మద్దతునిచ్చారు, తరువాత బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమిలో చేరడం జరిగింది, బీహార్ రాష్ట్రంలో బీజేపీతో కలిసి లాలూ ప్రసాద్ అవినీతి పాలన మీద అనేక పోరాటాలు చేశారు, ముఖ్యంగా లాలూ ప్రసాద్ హయాంలో జరిగిన దాణా కుంభకోణం వెలుగులోకి తీసుకు రావడంలో బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీతో కలిసి కృషి చేశారు. 1998 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసి ఎన్నికల్లో గెలవడమే కాకుండా కేంద్రంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు, మళ్ళీ 1999లో జరిగిన ఎన్నికల్లో సమతా పార్టీ 21 సీట్లు కైవసం చేసుకుంది నితీశ్ మళ్ళీ కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.2000 లో జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున ఎన్నికల్లో పోటీకి దిగి కేంద్రమంత్రి హోదాలో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు
ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఏ పార్టీ మెజార్టీ దక్కకపోవడంతో నితీశ్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా వంటి చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కానీ మద్దతు నిరూపించుకోలేక రాజీనామా చేశారు, ఆ సమయంలో మీడియా ముందు మాట్లాడుతూ
2003లో సమతా పార్టీ ,జనతాదళ్ పార్టీ చిలికవర్గమైన శరద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ్ ను కలపాలని నిర్ణయించింది , అందుకు ఇరువర్గాల నేతలు సుముఖంగా ఉండటంతో అధినేత జార్జ్ ఫెర్నాండెజ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ
పాట్నాలో ఉన్న గాంధీ మైదానంలో బహిరంగ సభలో సమతా పార్టీ, జనతాదళ్ పార్టీ నేతలు కలిసిపోయారు కొత్త పార్టీ గా జనతాదళ్(యునైటెడ్)పార్టీ ఆవిర్భావం జరిగిన సమావేశంలో నేతలు నితీశ్, ఫెర్నాండెజ్, శరద్ , దిగ్విజయ్ సింగ్
జనతాదళ్(యునైటెడ్) :
2004 నుంచి ప్రస్తుతం వరకు పార్టీ గెలుపు ఓటమిలో కీలకపాత్ర పోషిస్తున్నారు, అలాగే పార్టీకి జాతీయ అధ్యక్షుడు గా కూడా పనిచేస్తున్నారు.
వ్యక్తిగత జీవితం :
నితీశ్ కుమార్ వివాహం మంజూ కుమారి సిన్హా తో జరిగింది, వారిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. నితీశ్ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో మంజూ కుమారి గారు కూడా పాట్నా విశ్వవిద్యాలయం అనుబంధ మహిళా కళాశాలలో విద్యార్థిని , వారిద్దరూ తొలిసారిగా విద్యార్థులు ధర్నాలో కలుసుకున్నారు, తరువాత కాలంలో పరిచయం ప్రేమగా మారుతున్న సమయంలో నితీశ్ తండ్రిగారు వివాహం చేయడానికి సంకల్పించి అనుకోకుండా బంధువులు ద్వారా సంబంధం కోసం మంజూ కుమారి గారి తండ్రిని కలిసి వివాహ సంబంధం నిశ్చయించుకొన్నారు. సోషలిస్టు భావాలు కలిగిన నితీశ్ తన వివాహాన్ని పాట్నా రిజిస్టర్ కార్యాలయంలో ఎంతో నిరాడంబరంగా చేసుకున్నారు, ఇంజినీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్లనుకున్న సమయంలో కుటుంబ సభ్యులందరూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మంజూ కుమారి గారు మాత్రం సమర్థించారు, రాజకీయాల్లో తీరిక లేకుండా గడుపుతున్న సమయంలో మంజూ కుమారి గారు ఇంటి భాద్యతలు నిర్వర్తించారు, కుటుంబ పోషణ కోసం ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేసారు,అంతేకాకుండా 1977,1980,1985 ఎన్నికల్లో పోటీ చేసేటందుకు కి నితీశ్ కు కుటుంబ అవసరాల కోసం దాచుకున్న ధనాన్ని ఇచ్చారు. 1977,1980 ఎన్నికల్లో ఓడిపోయి డీలా పడిపోయిన నితీశ్ రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని భావిస్తున్న సమయంలో మంజూ కుమారి గారి నైతిక మద్దతు వల్ల ఓటమి ఆలోచనలు నుండి బయటపడటం జరిగింది,1985 నుంచి ప్రస్తుతం వరకు అప్రతిహతంగా సాగిపోతున్న నితీశ్ విజయాలకు ఆమె కారకురాలు ,నితీశ్ కేంద్రంలో మంత్రిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా పనిచేస్తున్న మంజూ కుమారి గారు టీచర్ గా పనిచేస్తూ సాధారణ జీవితం గడిపారు, ఆమె 2007లో మరణించారు,వారికి ఒక కుమారుడు, పేరు నిశాంత్ కుమార్ సిన్హా. నితీశ్ కుమార్ , మంజూ కుమారిగారు
వారి కుమారుడు
ప్రస్తుత భారత దేశ రాజకీయాల్లో చివరి క్రియాశీలక సోషలిస్టు ముఖ్యమంత్రి ఒక్క నితీశ్ కుమార్ మాత్రమే.
You must log in to post a comment.