జయలలిత

జయలలిత (1948–2016)

జయలలిత గారు ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలోని పాండవపుర తాలూక మేల్కొటే గ్రామంలో జన్మించారు. జయలలిత గారి అసలు పేరు” కోమలవల్లి”. ఆమె తల్లి ప్రముఖ నటీమణి సంధ్య గారు. జయలలిత తాతగారు మైసూర్ రాజ్య దివాన్ రంగా చారి గారికి వ్యక్తిగత వైద్యులు.

జయలలిత గారు చదువుల్లో బాగా రణించేవారు ,మద్రాస్ ఎస్.ఎల్.సి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం దక్కించుకున్నారు. 16 యేటనే చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో అగ్ర నటిమణిగా రాణించి 32 యేటా సినిమా రంగం నుంచి తప్పుకున్నారు. చలనచిత్ర పరిశ్రమ నుంచి విరమించుకున్న తరువాత కొంత కాలం ఇంటికే పరిమితమయ్యారు.

తన ఆరాధ్య నటుడు ఎంజీర్ ఆహ్వానం మేరకు ఆయన స్థాపించిన అన్నాడీఎంకే పార్టీలో చేరి పార్టీ గెలుపునకు కృషి చేశారు. పార్టీ తరుపున ప్రచార కార్యదర్శిగా ఎన్నికయ్యి పార్టీ ప్రచార కార్యక్రమాలు విజయవంతంగా ప్రజల్లోకి చేరడంలో కృషి చేశారు. ఎంజీర్ మరణించిన తరువాత పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కొని పార్టీ పగ్గాలు చేపట్టారు.

1984 లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు,1989 నుంచి 2016 వరకు మొత్తం 7 సార్లు తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1991 నుంచి 1996 వరకు, 2001,2002 నుంచి 2006 వరకు, 2011 నుంచి2014, 2015 ,2016 వరకు మొత్తం ఆరు సార్లు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా, 1989 నుంచి 1991 వరకు,1996 నుంచి 2001 వరకు,2006 నుంచి 2011 వరకు మొత్తం 3 సార్లు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గా పనిచేశారు. 1999లో వాజపేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూలిపోవడంలో ముఖ్య పాత్ర పోషించారు.

ముఖ్యమంత్రి గా ఆమె ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్లు దేశవ్యాప్తంగా బాగా ప్రచారం పొందిన సంక్షేమ పథకం. జయలలిత గారు మంచి వక్త, ఆమె తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో అనర్గళంగా ప్రసంగించగలరు. 1990 నుంచి చివరి శ్వాస వరకు దేశ, తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఏకైక వ్యక్తి జయలలిత గారు.

రాజకీయాల్లో తనదైన శైలిని ఏర్పరచుకున్న జయలలిత గారు తన జీవితంలో ఏ కేంద్ర రాజకీయ నాయకులు ముందు తలవంచలేదు కానీ అనేక మంది తలలను వంచారు. పురుషాధిక్యత కలిగిన దేశ రాజకీయాల్లో ఆమె తనకంటూ ప్రత్యేకమైన చరిత్రను సృష్టించుకున్నారు. అందుకునే ఆమెను” విప్లవ నాయకి” అని పిలిచేది తమిళ ప్రజానీకం. ఇష్టం లేని రంగలలో ప్రవేశించి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి జయలలిత గారు, ఆమె స్పూర్తితో మరెందరో మహిళలు రాజకీయ రంగ ప్రవేశం చేసి రాణిస్తున్నారు.

%d bloggers like this: