చంద్రశేఖర్

చంద్రశేఖర్ (1927–2007)

చంద్రశేఖర్ గారి పూర్తి పేరు చంద్రశేఖర్ సింగ్ , ఇబ్రహీంపట్టి గ్రామం బలియా జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. చిన్నతనం నుంచే తెలివైన విద్యార్థి కావడంతో ప్రభుత్వం నుంచి ఉపకరవేతనాలతో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసి కొంత కాలం సోషలిస్టు పత్రికలో జర్నలిస్ట్ గా ఉద్యోగం చేశారు.

వీరి రాజకీయ గురువు సోషలిస్టు దిగ్గజం ఆచార్య నరేంద్ర దేవ్ గారు విశ్వవిద్యాలయం లో కూడా వీరికి ఆచార్యులు. పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న సమయంలో పెద్దల ఒత్తిడి వల్ల వివాహం చేసుకున్నారు. ప్రజా సోషలిస్టు పార్టీ తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ విభాగానికి ప్రధాన కార్యదర్శి గా , రాజ్యసభ కు ఎన్నికయ్యారు.

ఇందిరా గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ పార్టీ తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను బాహాటంగా విమర్శించేవారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మోహన్ ధారియా, రాం ధన్ , ఎస్.ఎన్ సిన్హా లతో కలిపి వీరిని పార్టీలో “యంగ్ టూర్క్స్” గా పిలిచేవారు. పదవుల కోసం తనకి వంగి వంగి నమస్కారాలు చేసే వారి కన్నా తన నిర్ణయాలను బాహాటంగా విమర్శించే చంద్రశేఖర్ గారు అంటే ఇందిరా గాంధీ కి ఎంతో అభిమానం మరియు గౌరవం.

లోక్ నాయక్ జె.పి గారు తలపెట్టిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమనికి మద్దతు తెలిసిన మొదటి వ్యక్తి చంద్రశేఖర్ గారు. 1977లో కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పాటు లో కీలక పాత్ర పోషించారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టాలని స్వయంగా ప్రధాన మంత్రి దేశాయ్ కోరిన తిరస్కరించారు.

1983లో కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు”భారత యాత్ర” పేరుతో పాదయాత్ర చేసిన ఏకైక జాతీయ స్థాయి నాయకుడు.ఆ పాదయాత్ర ఆయనకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు మాత్రమే కాకుండా దేశ రాజకీయాల్లో మాస్ లీడర్ గా ఇమేజ్ వచ్చింది.

1977 నుంచి 2004( ఒక్క 1984 మినహా)లలో జరిగిన అన్ని లోక్ సభ ఎన్నికల్లో బలియా స్థానం నుంచి మంచి ఆధిక్యంతో గెలిచేవారు. 1977లో జనతాపార్టీ కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యి 1988 వరకు కొనసాగారు, 1990 నుంచి 2008 వరకు సమాజ్ వాదీ జనతాపార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు.

1989లో వి.పి.సింగ్ ప్రధానమంత్రి కావడంలో కీలకపాత్ర పోషించిన, తరువాత కాలంలో వారిద్దరి మధ్య సఖ్యత లేకపోవడం గమనార్హం. 1990మధ్యలో ప్రధాని వి.పి.సింగ్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసి కాశ్మీర్, రామాజన్మభూమి, మండల్ రిజర్వేషన్లు వంటి అంశాలపై అల్లర్లు జరగకుండా నియంత్రించడంలో సఫలీకృతం అయ్యారు.

లోక్ సభ లో అధికార, ప్రతిపక్షల మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన ప్రతిసారి వారిద్దరి మధ్య వారధిగా నిలిచి ఎన్నోసార్లు సయోధ్య కుదుర్చారు. దేశ రాజకీయాల్లో నెహ్రూ, వల్లభాయ్ పటేల్, లోహియా, జె.పి వంటి ఎందరో దిగ్గజ నేతలతో పాటు ప్రమోద్ మహాజన్, నితీశ్ కుమార్ , వెంకయ్యనాయుడు వంటి ఎందరో యువ నాయకులతో కలిసి పని చేసిన ఘనత ఒక్క చంద్రశేఖర్ గారిదే.

రాజకీయాల్లో చంద్రశేఖర్ గారు అజాత శత్రువు , అవినీతి రహిత నాయకుడిగా చివరి వరకు రాజకీయాల్లో కొనసాగారు.

%d bloggers like this: