
కావలసినవి: ఆపిల్స్ – 3 (పైతొక్క తొలగించి గుజ్జులా చేసుకోవాలి)
బాదం గుజ్జు – 3 టేబుల్ స్పూన్లు
కోవా – అర కప్పు
దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్
పంచదార – అర కప్పు
నెయ్యి – 4 లేదా 5 టేబుల్ స్పూన్లు.
తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడికాగానే.. ఆపిల్ గుజ్జు, బాదం గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ.. ఉడికించుకోవాలి. అందులో పంచదార యాడ్ చేసుకుని, బాగా కరిగే వరకూ తిప్పుతూ ఉండాలి. కోవా, దాల్చిన చెక్క పొడి వేసుకుని బాగా కలుపుతూ దగ్గరపడే వరకూ తిప్పుతూ మిగిలిన నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
You must log in to post a comment.