
కావలసినవి: అరటి పండ్లు – 4 (మెత్తగా గుజ్జులా చేసుకోవాలి)
గోధుమ పిండి – పావు కప్పు
బియ్యప్పిండి – పావు కప్పు
మైదా పిండి – పావు కప్పు
మొక్కజొన్న పిండి – ముప్పావు కప్పు
ఉప్పు – తగినంత
బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్
పంచదార – 2 టేబుల్ స్పూన్లు
నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో అరటిపండ్ల గుజ్జు, గోధుమ పిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్ పౌడర్, పంచదార, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి జోడించి, బాగా కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కాగుతున్న నూనెలో పునుల్లా వేసుకుని దోరగా వేయించి సర్వ్ చేసుకోవాలి.
You must log in to post a comment.