
జున్ను నుంచి బీ–12 లభిస్తుంది. పాలు, పన్నీరు, పాల ఉత్పత్తులు, ముడిబియ్యం వాడాలి. రక్తహీనత ఎక్కువగా ఉండేవాళ్లు.. పాలకూరతో జ్యూస్ చేసుకుని తాగాలి. బీట్‌రూట్, క్యారట్, ఉసిరి కలిపి జ్యూస్ చేసుకుని ఉదయాన్నే తాగితే.. ఐరన్ పుష్కలంగా వస్తుంది. ఐరన్ సమృద్ధిగా ఉంటే రక్తహీనత రానే రాదు. రోజూ దానిమ్మ రసం తీసుకోవాలి.
గుప్పెడు కరివేపాకును దంచి మజ్జిగలో వేసుకుని తాగితే మంచిది. మధ్యాహ్నం పూట ప్రతిరోజూ తోటకూర, గోంగూర, పాలకూర ఏదో ఒకటి తినేలా చూసుకోవాలి. వారంలో ఆరురోజులు ఆకు కూరలు తినాలనే నిబంధన తప్పని సరిగా పెట్టుకోండి.
You must log in to post a comment.